solid tribute
-
వేలవేల వందనాలు
⇔ వాడవాడలా వైఎస్సార్ జయంతి వేడుకలు ⇔ వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం, ఘన నివాళులు ⇔ పేదలకు అన్నదానం, రక్తదాన శిబిరాలు, పండ్లు, బ్రెడ్ల పంపిణీ ⇔ అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు, వైఎస్ అభిమానుల హాజరు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో శుక్రవారం వాడవాడలా ఘనంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు వైఎస్సార్ అభిమానులు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు పాలభిషేకాలతో పాటు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. వైఎస్ జయంతిని పురస్కరించుకొని పేదలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణి చేశారు. రక్తదాన శిబిరాలు, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామానా ⇔ వైఎస్ జయంతి వేడుకలు జరిగాయి. ఒంగోలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ⇔ మార్కాపురంలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పార్టీ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డిలు వైఎస్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఏరియా వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ⇔ కొండపి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా జయంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ⇔ దర్శి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని అన్నీ మండలాలల్లో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ⇔ చీరాల నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ వరికూటి అమృతపాణిలు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచారు. ⇔ అద్దంకిలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాచిన చెంచు గరటయ్య వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి రోగులకు పండ్లు పంచారు. ⇔ యర్రగొండపాలెం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఎంపీపీ విజయభాస్కర్‌తో పాటు ఆయా మండలాల పార్టీ శ్రేణులు వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ⇔ గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ⇔ కందుకూరు నియోజకవర్గంలో కొల్లూరి కొండయ్య, గంగిరెడ్డి, రమేష యాదవ్‌ల ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ⇔ సంతనూతలపాడు నియోజకవర్గంలో పార్టీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాయకులు జయంతి వేడుకలు నిర్వహించారు. ⇔ పర్చూరు నియోవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. ⇔ కనిగిరి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త బుర్రా మధుసూదనయాదవ్ ఆధ్వర్యంలో అన్నీ మండలాల్లో వైఎస్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
అనంతకు ఘన నివాళి
అనంతపురం అగ్రికల్చర్ : అనంతపురం జిల్లా అభ్యున్నతికి అనంత వెంకటరెడ్డి ఎనలేని కృషి చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో అనంత వెంకటరెడ్డి 15వ వర్థంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఐ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా విశేష సేవలు అందించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ నేతలు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, హెచ్.నదీంఅహ్మద్, సిద్ధారెడ్డి, మీసాల రంగన్న, బోయ తిప్పేస్వామి, నార్పల సత్యనారాయణరెడ్డి తదితరులు కొనియూడారు. మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు పాటించి, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. నిజాయితీ, చిత్తశుద్ధి తన తండ్రి స్వంతమని అనంతవెంకటరెడ్డి తనయుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన చూపించిన బాటను తూచ తప్పకుండా పాటిస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం జిల్లా అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జలాలు జిల్లాకు తీసుకురావాలని ఆనాడే అనంత వెంకటరెడ్డి ఎంతో తాపత్రపడ్డారని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఫ్యాక్షనిజానికి దూరంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ నేటితరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయుడని తెలిపారు. అనంత వెంకటరెడ్డి అరుదైన రాజకీయ నేత అని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ అన్నారు. సామాన్య జీవితం గడుపుతూ జిల్లా అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీ నేతలతో కలిసి పోరాడిన వ్యక్తిని కొనియూడారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నేతలు సోమర జయచంద్రనాయుడు, కేటీ శ్రీధర్, దాదాగాంధీ, శంకర్, డాక్టర్ గోవర్దన్‌రెడ్డి, జాన్‌వెస్లీ తదితరులు వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నేత ఎం.వి.రమణ, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, నగర కమిటీ నేతలు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, చింతకుంట మధు, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, మిద్దిభాస్కర్‌రెడ్డి, బండి పరశురాం, నరేంద్రరెడ్డి, బోయసుశీలమ్మ, శ్రీదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
ఫిల్ హ్యూస్కు ఘన నివాళి
-
ఎప్పటికీ మా మనస్సులోనే...
ఫిల్ హ్యూస్ మరణంతో క్రికెట్ ప్రపంచమే కాదు... యావత్ క్రీడాలోకం షాక్‌కు లోనయ్యింది. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు... హాంకాంగ్ నుంచి హైదరాబాద్ దాకా ప్రతి క్రీడాకారుడు, క్రీడాభిమాని హ్యూస్కు ఘన నివాళి అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెటర్లు తాము ఆడుతున్న, ఆడిన బ్యాట్లను ఇళ్ల బయట ఉంచి ‘పుట్ యువర్ బ్యాట్స్’ పేరుతో అతడిని స్మరించుకున్నారు. సిడ్నీ: ‘మరణంతో భౌతికంగా నువ్వు మాకు దూరమైనా... ఎప్పటికీ మా మనసుల్లో నిలిచే ఉంటావు....’ ఫిల్ హ్యూస్కు క్రీడాప్రపంచం అర్పించిన నివాళి ఇది. 25 ఏళ్ల చిన్నవయసులోనే మైదానంలో గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన హ్యూస్... గురువారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మ్యాచ్‌ల మొదలు స్కూల్ స్థాయి క్రికెట్ వరకు ప్రపంచంలో అన్ని మూలలా ఆటగాళ్లు హ్యూస్కు శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్యంగా ‘పుట్ యువర్ బ్యాట్స్’ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో సాగిన ప్రచారంలో ప్రముఖులంతా భాగమయ్యారు. తాము ఆడిన/ఆడుతున్న బ్యాట్లను ఇంటి బయట, మైదానంలో ఉంచి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆస్ట్రేలియా జట్టులో హ్యూస్ జెర్సీ నంబర్‌తో 408 ఫర్ ఎవర్, అతని ఆఖరి ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ 63 నాటౌట్ ఫర్ ఎవర్ అంటూ తమ ఆవేదనను పంచుకున్నారు. ఆస్ట్రేలియా మీడియా కూడా ఈ దురదృష్టకర వార్తను ప్రముఖంగా ప్రచురించి హ్యూస్కు తగిన విధంగా శ్రద్ధాంజలి ఘటించింది. శుక్రవారం ఉదయం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మొత్తం సిడ్నీ క్రికెట్ మైదానంలో సమావేశమైంది. ఈ సందర్భంగా హ్యూస్‌తో తమకున్న అనుబంధం, జ్ఞాపకాలను జట్టు సభ్యులు పంచుకున్నారు. దుబాయ్‌లోని ప్రధాన కార్యాలయం ముందు తమ సభ్య దేశాలైన 105 జట్ల తరఫున ఐసీసీ 105 బ్యాట్లను ఉంచింది. గూగుల్ ఆస్ట్రేలియా హోంపేజ్‌లో కూడా బ్యాట్‌ను ఉంచిన ఫోటోను డూడుల్‌గా పెట్టింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రధాన కార్యాలయంలో హ్యూస్ ఆఖరి స్కోరును గుర్తు చేస్తూ 63 బ్యాట్లను బయట ప్రదర్శించారు. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కూడా ఆట ప్రారంభానికి ముందు ఇదే విధంగా చేశాయి. అనంతరం నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించాయి. ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. కివీస్ క్రికెటర్లు తమ జెర్సీలపై పీ. హెచ్. (ఫిల్ హ్యూస్) అక్షరాలను రాసి మైదానంలోకి అడుగు పెట్టారు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు జట్టు సభ్యుల సంతకాలతో కూడిన బ్యాట్‌ను బీసీసీఐ ప్రదర్శించింది. ఇందులో హ్యూస్ కూడా ఉన్నాడు. చాంపియన్ క్రికెటర్‌కు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నట్లు బోర్డు పేర్కొంది. సచిన్ టెండూల్కర్ తన 25వ ఏట (హ్యూస్ వయసు) వాడిన బ్యాట్‌ను పుట్ యువర్ బ్యాట్స్ కోసం ప్రదర్శించాడు. భారత హాకీ జట్టు తమ హాకీ స్టిక్‌లను ఉంచగా, ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారులు ఆడమ్ స్కాట్, రోరీ మెకిల్రాయ్ తమ క్యాప్‌లకు నల్ల బ్యాండ్‌ను ధరించి నివాళి అర్పించారు. అమెరికాలోనూ పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు రిచర్డ్స్, గిల్‌క్రిస్ట్, డీన్జోన్స్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు రైనా, రహానే తదితరులు కూడా తమ బ్యాట్‌ను ఉంచి సంఘీభావం ప్రకటించారు. టెన్నిస్ స్టార్స్ నాదల్, ముర్రే క్రికెటర్ కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. ఆస్ట్రేలియాలో క్లబ్ క్రికెట్లో కొన్ని మ్యాచ్‌లను 63 ఓవర్ల పాటు నిర్వహించగా... ఓ మ్యాచ్‌లో జూనియర్ క్రికెటర్లు 63 పరుగులు చేయగానే రిటైర్ అయ్యారు. స్కూల్ క్రికెట్లో పిల్లలు ధరించేందుకు 408 నంబర్ ఉన్న క్యాప్‌లను అందించారు. సిడ్నీలో స్మారక సభ ఫిల్ హ్యూస్‌ను స్మరించుకునేందుకు వీలుగా త్వరలోనే స్మారక సభ నిర్వహించనున్నట్లు న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్ మైక్ బెయిర్డ్ ప్రకటించారు. హ్యూస్ కుటుంబ సభ్యులతో చర్చించి తేదీని ఖరారు చేస్తామని, సిడ్నీ క్రికెట్ మైదానంలో ఇది జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ మైదానంతో ఫిల్కు ఎంతో అనుబంధం ఉందని, అతడిని అభిమానించేవారంతా పెద్ద సంఖ్యలో రావాలని మైక్ కోరారు. -
క్యాంపస్‌లో ఆజాద్‌కు ఘన నివాళి
దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఘన నివాళులు అర్పించారు. తెయూ కళాశాల ప్రాంగణం లో మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్, హ్యూమానిటీస్ ప్రిన్సిపాల్ కనకయ్య మాట్లాడుతూ అబుల్ క లాం ఆజాద్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించి, హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారని తెలిపారు. తొలి విద్యా శాఖ మంత్రిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. తెయూ పీఆర్ఓ రాజారాం మాట్లాడుతూ ఆజాద్ నికార్సైన సెక్యులర్‌వాది అని, పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించిన జాతీయవాది అని అన్నారు. ముందు చూపుతో యూజీసీ, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేసి దేశాన్ని విద్యారంగంలో అగ్రభాగాన నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో తెయూ మై నారిటీ విభాగం డైరక్టర్ జమీల్ అహ్మద్, ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ అఖ్తర్ సుల్తానా, ప్రొపెసర్ నసీం, డాక్టర్ అబ్దుల్ ఖవి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి వి ద్యార్థి నాయకులు పాల్గొన్నారు. సౌత్ క్యాంపస్‌లో భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో అబుల్‌కలామ్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సబిత, ప్రొఫెసర్లు లలిత, హరిత, ప్రతిజ్ఞ, నాగరాజు, రవీందర్, విద్యార్థి నాయకులు గణేశ్, సంజయ్, సవిత, స్వరూప, దివ్య, మహేశ్ -
పులికి ఘన నివాళి
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేసిన బాలాసాహెబ్ ఠాక్రే ప్రథమ వర్ధంతిని శివసేన అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహిం చిన శివాజీపార్క్ మైదానం ‘బాల్‌ఠాక్రే అమర్ రహే’ నినాదాలతో ఆదివారం హోరెత్తింది. ఉద యం నుంచే నగరంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వచ్చిన శివసైనికులు, తమ ప్రియతమ నాయకుడు బాల్ ఠాక్రేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించిన శివాజీపార్క్ మైదానంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసి పోయాయి. శివాజీపార్క్ మైదానం ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న మీనాతాయి ఠాక్రే విగ్రహాన్ని భారీగా పూలతో అలంకరిం చారు. శివసైనికులు ముందుగా మీనాతాయి విగ్రహానికి నివాళులర్పించి ఠాక్రే స్మారకం వద్దకు వెళ్లా రు. మైదానమంతా జనసంద్రంగా మారింది. 1966 లో శివసేనను స్థాపించిన బాల్‌ఠాక్రే దానిని మహా రాష్ట్రలో బలమైన రాజకీయశక్తిగా తీర్చిదిద్దడానికి ఎంతగానో శ్రమించారు. అనారోగ్యం కారణంగా ఆయన గత నవంబర్ 17న మరణించారు. భారీగా ప్రముఖుల రాక శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రశ్మి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్మారకం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సేన సీని యర్ నాయకులు, కార్పొరేటర్లతోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్, కూతురు సుప్రియా సుళే, గవర్నర్ కె.శంకరనారాయణన్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషి, కేం ద్ర, రాష్ట్ర మంత్రులు హాజరై ఠాక్రేకు నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వర్ధంతికి హాజరుకాకపోవడం గమనార్హం. అభిమానుల సందడి.. రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు, ఠాక్రే అభిమానులు శనివారం సాయంత్రం నుంచి ముంబైకి తరలిరావడం మొదలుపెట్టారు. తదనంతరం బాంద్రాలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీ బంగ్లాకు చేరుకున్నారు. చాలా మంది ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే శివాజీపార్క్ మైదానానికి చేరుకుని క్యూలో నిలబడ్డారు. నివాళులర్పించే బోర్డులు, ప్లెక్సీలు.. ఠాక్రేకు నివాళులర్పించడానికి అమర్చిన బోర్డులు, ఫ్లెక్సీలు ముంబైలో చాలాచోట్ల దర్శనమిచ్చాయి. ‘శివ్తీర్థ్’ వద్ద ఉన్న శివాజీ విగ్రహం పక్కన 20 అడుగుల వెడల్పు, 40 అడుగులు పొడవుతో ఠాక్రే స్మారకం ‘స్మృతి ఉద్యాన్’ను బీఏంసీ ఏర్పాటు చేసింది. దీనిని 15 రకాల పూలు,మొక్కలతో అలంకరించారు. భారీగా పోలీసు బందోబస్తు వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ముంబై పోలీసుశాఖ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. రద్దీని నియంత్రించేందుకు శివ్తీర్థ్ వద్ద ప్రత్యేకంగా ఒక కంట్రోల్‌రూం, రెండు వాచ్టవర్లు ఏర్పాటు చేశారు. 650 మంది కానిస్టేబుళ్లు, 225 మంది మహిళా కానిస్టేబుళ్లు, 50 మంది పోలీసు అధికారులు, నలుగురు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ పోలీసు కమిషనర్లను నియమించారు. అలాగే స్టేట్ రిజర్వుడు పోలీసులకు చెందిన మూడు బెటాలియన్లు, అల్లర్ల నియంత్రణకు రెండు బెటాలియన్లు, ఐదు కంబాట్ వాహనాలతో భద్రత ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు.... వర్ధంతిని పురస్కరించుకుని శివసేన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. పలుచోట్ల రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించింది. శివసేన సినిమా యూనియన్ ఆధ్వర్యంలో దాని సభ్యులకు రూ.రెండు లక్షల పాలసీ ఉచితంగా ఇచ్చారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ఉచితంగా హెల్త్‌కార్డులు అందజేస్తామని సేవ వర్గాలు తెలిపాయి. మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం : ఉద్ధవ్ శివాజీపార్క్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం సాయంత్రమే ఉద్ధవ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మేయర్ బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయారని, రాష్ట్ర పాలనలో మార్పు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిలోని శివసేన, బీజేపీ, ఆర్పీఐకి అనుకూల వాతావరణం ఉందన్నారు. ఈసారి తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చెరకు రైతులకు గిట్టుబాటు ధర కావాలని కొద్ది రోజులుగా స్వాభిమాన్ శేత్కారి సంఘటన నాయకుడు, ఎంపీ రాజుశెట్టి చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. ఠాక్రే చేసిన పనులు, మార్గదర్శకాలు భావితరానికి ఎంతో దోహదపడతాయని వ్యాఖ్యానించారు.