దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఘన నివాళులు అర్పించారు. తెయూ కళాశాల ప్రాంగణం లో మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్, హ్యూమానిటీస్ ప్రిన్సిపాల్ కనకయ్య మాట్లాడుతూ అబుల్ క లాం ఆజాద్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించి, హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారని తెలిపారు. తొలి విద్యా శాఖ మంత్రిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. తెయూ పీఆర్‌ఓ రాజారాం మాట్లాడుతూ ఆజాద్ నికార్సైన సెక్యులర్‌వాది అని, పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించిన జాతీయవాది అని అన్నారు.
ముందు చూపుతో యూజీసీ, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేసి దేశాన్ని విద్యారంగంలో అగ్రభాగాన నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో తెయూ మై నారిటీ విభాగం డైరక్టర్ జమీల్ అహ్మద్, ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ అఖ్తర్ సుల్తానా, ప్రొపెసర్ నసీం, డాక్టర్ అబ్దుల్ ఖవి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి వి ద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
సౌత్ క్యాంపస్‌లో
భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో అబుల్‌కలామ్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సబిత, ప్రొఫెసర్‌లు లలిత, హరిత, ప్రతిజ్ఞ, నాగరాజు, రవీందర్, విద్యార్థి నాయకులు గణేశ్, సంజయ్, సవిత, స్వరూప, దివ్య, మహేశ్
క్యాంపస్‌లో ఆజాద్‌కు ఘన నివాళి
Published Wed, Nov 12 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement