
గుంటూరు, సాక్షి: భారతరత్న, డాక్టర్ మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్ వేదికగా తన నివాళి ప్రకటించారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు..
స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/2OoYBxEPB4
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2024
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అజాద్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, విశ్వేసరరాజు, విరూపాక్షి హాజరయ్యారు.
