Maulana Abul Kalam Azad
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: భారతరత్న, డాక్టర్ మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా తన నివాళి ప్రకటించారు.స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు..స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/2OoYBxEPB4— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2024 తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అజాద్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, విశ్వేసరరాజు, విరూపాక్షి హాజరయ్యారు. -
National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి..
ప్రతి ఏటా నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్‌లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కు అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగానూ ఆజాద్ గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్‌ను దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణిస్తుంటారు.దేశ స్వాతంత్ర్య సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1934లో యూనివర్సిటీ క్యాంపస్‌ను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు.మొదటి విద్యా మంత్రిగా, స్వాతంత్య్రానంతరం దేశంలోని గ్రామీణ పేదలకు, బాలికలకు విద్యను అందించడంపై ఆయన దృష్టి సారించారు. వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించడం, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను విస్తరించడంతోపాటు వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన విద్యారంగంలో పలు మార్పులు చేశారు. దేశాభివృద్ధిలో ఆజాద్ అదించించిన సహకారం స్వాతంత్ర్య ఉద్యమానికి మించినదని కొందరు అంటుంటారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని తొలిసారిగా 2008 నవంబర్ 11న నిర్వహించారు. నాటి నుంచి ప్రతీటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం -
మనసున్న ప్రభుత్వమిది
భారతదేశం అంటేనే ఏడు రంగుల ఇంద్ర ధనస్సు. మన దేశంలో అనేక రాష్ట్రాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, అనేక కులాలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా, అందరం కలిసికట్టుగా.. ఇంద్ర∙ధనస్సుగా ఒక్కటిగా ఉంటున్నాం.. ఎప్పుడూ ఉంటాం అన్నది భారతదేశ చరిత్ర. భిన్నత్వంలో ఏకత్వంతో పాటు ఒకరినొకరు గౌరవించుకోవడం మన బలం. అల్ప సంఖ్యలో ఉన్న వారికి అండగా నిలబడటం మన బలం. మెజారిటీ, మైనార్టీల మధ్య అన్నదమ్ముల ఆత్మీయత, అనుబంధం పెంచటం ఒక వైఎస్సార్ బలం.. ఒక జగన్ బలం.. వెరసి మన అందరి బలం. గత 53 నెలల్లో దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, మన రాష్ట్రంలో ముందెన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ పేదల కోసం పరితపిస్తూ పరిపాలన సాగిస్తోంది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ నిరుపేదలంటూ గతంలో ఓనర్ షిప్ (బాధ్యత) తీసుకున్న పరిస్థితులు లేవు. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ వర్గాల వారందరినీ నా కుటుంబంగా భావిస్తున్నా. వీరికి అన్ని విధాలా భరోసా ఇస్తూ అడుగులు ముందుకు వేస్తున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వంలో ఒక జగన్ కనిపిస్తాడు. జగన్‌కు ఇటు వైపు, అటు వైపు డిప్యూటీ సీఎంలుగా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనార్టీ కనిపిస్తారు. మీ బిడ్డ సీఎంగా ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచీ వీళ్లందరూ నా పక్కనే కనిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు.. మనందరిది. మనసున్న ప్రభుత్వం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని శనివారం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమాలను విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు స్థాపించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం అజాద్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని నేషనల్ ఎడ్యుకేషన్ డే గా జరుపుకుంటున్నామన్నారు. మైనారిటీస్ సంక్షేమ దినోత్సవంగా (మైనార్టీస్ డే) కూడా జరుపుకుంటున్నట్లు 2008లో అప్పటి ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు, దివంగత రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రకటించారని గుర్తు చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ముస్లింలలో పేదలందరికీ రిజర్వేషన్లు అమలు చేసిన నాయకుడు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. నాన్న ముస్లిం సోదరుల పట్ల, మైనార్టీల సంక్షేమం పట్ల ఒక అడుగు వేస్తే.. ఆయన బిడ్డగా, మీ అన్నగా, మీ వాడిగా రెండడుగులు ముందుకు వేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గతానికి, ఇప్పటికి మధ్య తేడా గమనించండి ► గత ప్రభుత్వంలో మైనార్టీలకు మంత్రి పదవి కూడా ఇవ్వని మనసు లేని ముఖ్యమంత్రి ఉండేవారు. మన ప్రభుత్వంలో రెండు దఫాలు మంత్రి మండలి కూర్పులో ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో నా మైనార్టీ సోదరుడు ఈ రోజు నా పక్కనే ఉన్నాడు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం వచ్చాక అనేక గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ► ఈ రోజు ముస్లిం సోదరులకు రాజకీయ, ఆర్థిక, మహిళా, విద్యా సాధికారత విషయంతో పాటు వారికి సంక్షేమం అందించే ఏ విషయంలోనైనా ముందున్నాం. మన పార్టీ నుంచి దేవుడి దయతో నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోగలిగాం. మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా కూర్చొబెట్టగలిగాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా నా సోదరి జకియాఖానం శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. నా అక్కచెల్లెమ్మలు, ముస్లిం సోదరుల బాగోగులు చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాగా అడుగులు వేస్తోందో చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం. ► ఎంపీపీలు, జడ్పీ చైర్మన్, మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్, ఏఎంసీ.. ఇలా ఏ నామినేటెడ్ పదవులు తీసుకున్నా.. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 50 శాతం పదవులు ఇవ్వాలని.. అందులో కూడా 50 శాతం నా అక్కచెల్లెమ్మలకే ఇవ్వాలని చట్టం చేశాం. ► ఈ రోజు, ఆ రోజు ఇదే బడ్జెట్.. ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటి కన్నా ఇప్పుడే తక్కువ. మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమే. ఈ 53 నెలల కాలంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా మీ బిడ్డ బటన్ నొక్కితే నేరుగా రూ.2.40 లక్షల కోట్లు (డీబీటీ) అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. మరి అప్పట్లో ఈ రూ.2.40 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయన్నది ఆలోచించండి. పేదవాళ్లు వెళ్తున్న స్కూళ్లు, ఆస్పత్రులు కూడా మార్పు చేస్తున్నాం. గుడ్‌మారి్నంగ్ చెబుతూ ప్రతి నెల 1వ తేదీన అవ్వాతాతలకు వారి ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చే గొప్ప పాలన జరుగుతున్న రోజులకు, నాటి రోజులకు మధ్య తేడా గమనించండి. విజయవాడ నుంచే హజ్ యాత్ర ► గతంలో హజ్ యాత్రకు వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి వెళ్లే పరిస్థితి. విజయవాడ నుంచి నేరుగా వెళ్లేలా ఎంబార్కేషన్ పాయింట్‌గా ప్రకటించాం. ఆ తర్వాత హజ్ యాత్రకు హైదరాబాద్ కంటే విజయవాడ నుంచి విమాన టిక్కెట్ రూ.80 వేలు ఎక్కువగా వేశారని డిప్యూటీ సీఎం అంజాద్ చెప్పాడు. మనం ఇవ్వాలంటే అవుతుందా.. అని అడిగాడు. ఇక్కడ ఉన్నది మనందరి ప్రభుత్వం కాబట్టి.. కచ్చితంగా తోడుగా ఉంటామని చెప్పాను. ► రూ.14 కోట్లు ఎక్కువ అవుతుందంటే వెంటనే చెక్కు ఇచ్చి కార్యక్రమాన్ని కొనసాగించాం. నేను అడిగిందల్లా ఒక్కటే.. హజ్ యాత్రకు వెళ్లినప్పుడు మీ బిడ్డ ప్రభుత్వం కోసం దువా చేయండి అని. ఈ రోజు మైనార్టీలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న ప్రభుత్వం మనది. ► అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం పెంచాం. గతంలో ఎన్నడూ లేని విధంగా పాస్టర్లకు కూడా రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం కూడా మనదే. వక్ఫ్ బోర్డు, ముస్లిం మైనార్టీ, చర్చిలకు సంబంధించిన ఆస్తుల సంరక్షణ కోసం ఏకంగా జీవో నెంబరు 60 జారీ చేశాం. వీటి రక్షణ కోసం ఒక జీవో ఇచ్చి జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసిన తర్వాత సచివాలయంలో ఉన్న ప్లానింగ్ సెక్రటరీలకు ఇన్ఛార్జ్ ఫర్ ప్రొటెక్షన్ బాధ్యతలు అప్పగిస్తూ అడుగులు వేసిన ప్రభుత్వం మనది. దేవుడు దయ, మీ అందరి చల్లని దీవెనలు మీ బిడ్డ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటున్నా. అవార్డుల ప్రదానం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అవార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేశారు. మౌలానా ఆజాద్ జాతీయ అవార్డు–2023 డాక్టర్ ఎస్ఏ సత్తార్ సాహెబ్ (వైఎస్సార్ కడప), డాక్టర్ అబుల్ హక్ అవార్డు–2023 బాబా ఫకృద్దీన్ (అన్నమయ్య జిల్లా), పఠాన్ కరీముల్లా ఖాన్ (చిత్తూరు)కు అందించారు. జీవిత సాఫల్య (లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్) అవార్డు2023ను మహ్మద్ అజ్మత్ అలీ (కర్నూలు), మహ్మద్ నజీర్ (గుంటూరు), మహ్మద్ హఫీజర్ రెహ్మాన్ (నంద్యాల), పఠాన్ మహ్మద్ ఖాన్ (మదనపల్లె), షేక్ అబ్దుల్ గఫర్ (కర్నూలు), సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ (తిరుపతి), మహ్మద్ గౌస్ ఖాన్ అరీఫ్ (వైఎస్సార్ కడప)కు అందజేశారు. 37 మంది రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులకు, 51 మంది ఉర్దూ విద్యార్థులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చేతుల మీదుగా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ఉపా«ధ్యక్షురాలు జకియాఖానమ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్, మైనార్టీస్ కమిషన్ చైర్మన్ కె.ఇక్బాల్ అహ్మద్, హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్, ఉర్దూ అకాడమి చైర్మన్ హెచ్.నదీమ్ అహ్మద్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఖాదర్ బాషా, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు రుహుల్లా, తలశిల రఘురాం, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. మైనార్టీలకు 53 నెలల్లో రూ.23,176 కోట్లు ► నా ముస్లిం మైనార్టీలనే తీసుకుంటే.. ఈ 53 నెలల కాలంలో డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ.23,176 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్సార్ పెన్షన్ కానుక, అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ ఇలా ఏ పథకం తీసుకున్నా నా అక్కచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం చూసే విధంగా అడుగులు వేయగలిగాం. గత పాలనలో కేవలం రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తేడా మీరే గమనించాలి. ► ప్రతి అడుగులో, ప్రతి పనిలో, వేసే ప్రతి మొలక చెట్టు కావాలని, ప్రతి ముస్లిం కుటుంబం కూడా బాగు పడాలని, వారి పిల్లలు గొప్పగా ఎదగాలనే తపనతో అడుగులు పడ్డాయి. ఈ మధ్య కాలంలో షాదీ తోఫా పథకాన్ని తీసుకొచ్చాం. నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, వారిని చదివించే విధంగా ప్రోత్సహించేందుకు షాదీ తోఫా కోసం పదోతరగతి పాస్ కావాలన్న నిబంధన పెట్టాం. ఆ నిబంధన పెట్టినప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం.. మనం ఇలాంటి కండిషన్లు ఎందుకు పెట్టడం.. తీసేద్దాం అని కొందరు అన్నారు. అప్పుడు నేను ఒకటే చెప్పాను. నాయకుడు అన్నవాడు ఆలోచన చేయాల్సింది ఎన్నికల గురించి కాదు.. రేప్పొద్దున వీళ్ల జీవితాల్లో వెలుగు ఎలా నింపాలని, వారి భవిష్యత్ కోసం ఆలోచనలు జరగాలని చెప్పాను. ► ఈ రోజు మనం పదోతరగతి సర్టిఫికెట్ తప్పనిసరి అని చెప్పడంతో పాటు రూ.లక్ష పెళ్లి చేసుకునేటప్పుడు ఇస్తామని చెబుతున్నాం. అప్పుడు దానికోసం కచ్చితంగా పదోతరగతి వరకు చదివించే దిశగా తల్లిదండ్రులు అడుగులు వేస్తారు. ఆ పిల్లలు కూడా చదవడం మొదలు పెడతారు. ఆ పిల్లలు చదువుల కోసం అమ్మఒడి పథకం ద్వారా అడుగులు ముందుకు వేయించగలుగుతాం. నాడు–నేడు ద్వారా స్కూళ్లను మార్పు చేస్తున్నాం. ఇంగ్లిషు మీడియం, 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలో ఐఎఫ్పి డిజిటల్ స్క్రీన్లు, బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్ బాగుండేలా ఊతమిస్తాయి. ► ఉన్నత విద్యకు వచ్చేసరికి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన ఇస్తున్నాం. ఏ పేద తల్లి తన పిల్లలను చదవించేందుకు అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా ప్రతి అడుగులోనూ చేయిపట్టుకుని నడిపించే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. అందులో మరో అడుగు కళ్యాణమస్తు (బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని పేదల కోసం), షాదీతోఫా పథకాలని గొప్పగా చెప్పగలను. ► మనందరి ప్రభుత్వం వచ్చాక ఉర్దూను రెండో అధికారిక భాషగా ప్రకటించాం. రాష్ట్రంలోని అన్ని వర్గాల మైనార్టీల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తున్నది కూడా మన ప్రభుత్వమే. దీనికోసం ఏకంగా ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్ చట్టం– సబ్‌ప్లాన్‌ను తీసుకువచ్చాం. మహనీయుల ఆదర్శంతో ప్రజా రంజక పాలన భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వంటి ఎంతో మంది మహనీయులను ఆదర్శంగా తీసుకుని సీఎం జగన్ కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రజా రంజక పాలన అందిస్తున్నారు. జగన్ మంత్రివర్గంలో తొలి ముస్లిం ఉప ముఖ్యమంత్రిగా, మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రిగా పని చేస్తుండటం నా అదృష్టం. నాడు వైఎస్సార్ ముస్లింలకు రిజర్వేషన్లు తీసుకురావడంతో ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ ముస్లిం మైనార్టీలకు రాజకీయ సాధికారత కల్పించారు. ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా చేస్తే, అందులో నేనూ ఒకడిని. నలుగురు ముస్లిం ఎమ్మెల్సీలలో మహిళకు తొలిసారి అవకాశం ఇచ్చారు. ముస్లిం సోదరులు నలుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. ముస్లింలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. – అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి -
మౌలానా ఆజాద్ జాతీయ అవార్డులు అందించిన సీఎం వైఎస్ జగన్
-
విజయవాడ : మైనార్టీ డే వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం అజాద్ జయంతి వేడుకలకు సీఎం వైఎస్ జగన్
-
మైనార్టీలను గత టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మైనార్టీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. గతానికి, ఇప్పటికి మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైఎస్సార్ రిజర్వేషన్లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం జగన్ చెప్పారు. ‘‘మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేశాం. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించాం. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చాం. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చేందుకు గత సర్కారు ఏనాడు చొరవ చూపలేదు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నాం. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలం. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇంద్రధనస్సులా అందరం కలిసే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఒక్క జగన్‌దే కాదు.. మనందరిది. ప్రతి అడుగులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుని వెళ్తున్నాం. వివిధ పథకాల ద్వారా రూ. 2.5 లక్షల కోట్లకు పైగా నగదు అందజేశాం. చంద్రబాబు హయాంలో మైనార్టీల సంక్షేమానికి రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మన ప్రభుత్వంలో రూ.23 వేల కోట్లు ఖర్చు చేశాం. విజయవాడ నుంచి హజ్‌యాత్రకు వెళ్తే అవకాశం కల్పించాం. అదనపు భారం పడకుండా రూ.14 కోట్లు మన ప్రభుత్వం చెల్లించింది. ఇమాం, మౌజంలకు గౌరవ వేతనం అందిస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. చదవండి: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా.. -
మౌలానా ఆజాద్ జయంతి వేడుకలకు సీఎం జగన్
సాక్షి, ఎన్టీఆర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శనివారం) విజయవాడకు రానున్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి.. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. నగరంలోని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలు జరగనుండగా.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం,రుహుల్లా,ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితిసింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏటా నవంబర్ 11వ తేదీని.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని దేశం మొత్తం జాతీయ విద్యా దినంగా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తుంటారు. -
CM Jagan: నవంబర్ 11న సీఎం జగన్ గుంటూరు పర్యటన
సాక్షి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు సోమవారం పరిశీలించారు. భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంత్యుత్సవం సందర్భంగా ఈ నెల 11న గుంటూరులో జరగనున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, మొహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి పర్యటించే మార్గాలు, ట్రాఫిక్, సెక్యూరిటీ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని జింఖానా మైదానం, వేంకటేశ్వర విజ్ఞాన మందిరాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ప్రజాప్రతినిధులు సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), షేక్ సజిల, పూసల, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్పర్సన్ కోలా భవాని, వైఎస్సార్సీపీ నాయకులు గులాం రసూల్, గుంటూరు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎండి.ఘని పాల్గొన్నారు. కలెక్టర్ చాంబర్లో సమావేశం జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ప్రత్యేక ఆహ్వానంతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, మొహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ కలెక్టరేట్లో సమావేశమయ్యారు. సీఎం పర్యటనపై కూలంకషంగా చర్చించారు. -
న్యాయబద్దంగా ఎలా చేయాలో అదే చేశాం: సీఎం జగన్
-
మైనారిటీల సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయం
నంద్యాల ఘటన బాధాకరం. ఆ ఘటనకు సంబంధించిన సెల్ఫీ వీడియో బయటకు రాగానే, న్యాయబద్ధంగా ఏం చేయాలో అది చేశాం. తన, మన, పర అని చూడకుండా పోలీసులపై కేసులు పెట్టి, అరెస్టు చేశాం. అయితే గత ప్రభుత్వంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, ఆ పార్టీకి చెందిన రామచంద్రరావు అనే వ్యక్తి ఆ ఇద్దరు పోలీసులకు వెంటనే బెయిల్ ఇప్పించాడు. అంటే వారే బెయిల్ పిటిషన్ వేస్తారు. మళ్లీ వారే ప్రభుత్వాన్ని నిందిస్తారు. వారి పలుకుబడి ముందు మా పలుకుబడి సరిపోవడం లేదు. ఆ బెయిల్‌ను క్యాన్సిల్ చేయడం కోసం సెషన్స్ కోర్టుకు వెళ్లాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మైనారిటీల సంక్షేమ చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అన్ని మతాలు, కులాల మధ్య అన్నదమ్ముల భావనను మరింతగా పెంపొందించేందుకు అన్ని ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని తెలిపారు. 17 నెలల పాలన కాలంలో మైనారిటీలకు రూ.3,428 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. అనంతరం అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, పెన్షన్ కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, లా నేస్తం తదితర పథకాల ద్వారా గత నెల వరకు రూ.2,585 కోట్లు నేరుగా నగదు బదిలీ చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, ఇవ్వనున్న ఇళ్ల స్థలాల పట్టాల ద్వారా మైనారిటీలకు అందే ప్రయోజనం రూ.843 కోట్లు అని వివరించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. విద్యా రంగంలో సంస్కరణలకు ఆద్యుడు ► నేడు (బుధవారం) ఆజాద్ జయంతి. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు, మానవతావాది, బహు భాషా ప్రవీణుడు. దేశ తొలి విద్యా మంత్రిగా 1947 నుంచి 1958 వరకు ఎన్నో సేవలు అందించారు. అందుకే ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ► 2008లో ప్రియతమ నాయకుడు వైఎస్సార్ నిర్ణయం ప్రకారం ఆజాద్ జయంతిని మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ► మన విద్యా వ్యవస్థ దేశ అవసరాలకు తగినట్లు మార్చేందుకు ఆజాద్ ఎంతో కృషి చేశారు. ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు పలు సంస్కరణలు అమలు చేశారు. విద్యా శాఖలో భాగమైన బోర్డులు, సంస్థలు, కమిషన్లు, అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ), యూజీసీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ప్రారంభించింది ఆయనే. ముస్లిం, క్రైస్తవ మత పెద్దలతో సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు తల్లిదండ్రుల్లా బాధ్యతగా నిర్ణయాలు ► రాష్ట్రంలో మన పిల్లల అవసరాలు, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో మార్పులు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు–నేడు’తో సమూల మార్పులు తీసుకొస్తున్నాం. ► చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పిల్లలకు దుస్తులు, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్స్ మొదలగునవి ఇస్తున్నాం. తరగతి గదులు, టాయిలెట్లు, క్లీన్ వాటర్, కాంపౌండ్ వాల్ వరకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. ► మధ్యాహ్న భోజనం మెనూ మార్చాం. మంచి కరిక్యులమ్, ఇంగ్లిష్ మీడియమ్, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చులూ ఇస్తూ అండగా నిలుస్తున్నాం. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల మాదిరిగా ఆలోచించి బాధ్యతగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. వివిధ మతాల పెద్దలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో.. ► ఇవాళ మైనారిటీల మీద జూమ్‌లో, ట్విటర్లో ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్న ఒకాయన, గతంలో ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో మైనారిటీలకు అందించింది రూ.2,661 కోట్లు మాత్రమే. ► 2014–15లో రూ.345 కోట్లు, 2015–16లో రూ.340 కోట్లు, 2016–17లో రూ.641 కోట్లు, 2017–18లో రూ.667 కోట్లు, 2018–19లో రూ.668 కోట్లు ఇచ్చారు. ► ఒక్కరంటే ఒక్కరు మైనారిటీ మంత్రి లేని ప్రభుత్వాన్ని నడిపిన మహానుభావుడు. ఎన్నికల ముందు వరకు మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ ఈ రోజు మైనారిటీల మీద తనకు ప్రేమ ఉందంటాడు. ఎలా బురద చల్లాలన్నదే వారి లక్ష్యం. అవి కూడా అమలు చేస్తాం ► మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో ఇంకా రెండు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వైఎస్సార్ పెళ్లి కానుక పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాలు పెంచడం, పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తాం. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్ని, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, వివిధ మతాల పెద్దలు పాల్గొన్నారు. మైనారిటీల కోసం ఎన్నెన్నో చేశాం.. ► ఇవాళ మైనారిటీ సోదరుల కోసం నిజాయితీగా అన్నీ చేస్తున్నాం. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు, హోలీ ల్యాండ్‌కు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సహాయాన్ని రూ.30 వేల నుంచి రూ.60 వేలకు పెంచాం. ► రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.60 వేలు, రూ.3 లక్షలకు పైబడి ఆదాయం ఉన్న వారికి రూ.30 వేలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజాన్లకు రూ.3 వేల గౌరవ వేతనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గౌరవ పూర్వకంగా అందిస్తున్నాం. దీన్ని ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజాన్లకు రూ.5 వేలకు పెంచుతూ జనవరి 1న ఆదేశాలు జారీ చేశాం. ► వక్ఫ్ బోర్డు, ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర, చర ఆస్తులను రీసర్వే చేయించి వారి ఆస్తులు కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. క్రైస్తవులు, మిషనరీల ఆస్తులు కాపాడేందుకు కూడా రీ సర్వే చేపడుతున్నాం. ► నవరత్నాల ద్వారా మైనారిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నాం. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేశాం. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ముస్లింలు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. -
నంద్యాల ఘటన బాధాకరం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : దేశానికి తొలి విద్యా శాఖ మంత్రిగా అబుల్ కలాం సేవలందించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. అబుల్ కలాం జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ విద్య వరకు అబుల్ కలాం అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. చదవండి: టపాసుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అబుల్ కలాం హయాంలో స్థాపించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నిరుపేద విద్యార్థులకు మంచి చదువు అందించేలా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం అందించేలా మార్పులు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు వసతి దీవెన అందిస్తున్నామని, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.3,428 కోట్లు అందించినట్లు వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నమన్న సీఎం జగన్ మైనార్టీలపై ట్విట్టర్, జూమ్ల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, చంద్రబాబు పాలనలో కేవలం రూ.2500 కోట్లు మాత్రమే మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని దుయ్యబట్టారు. నంద్యాల ఘటన బాధాకరమని తెలిపిన సీఎం జగన్ తన దృష్టికి రాగానే చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నంద్యాల ఘటనలోనూ పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారని తెలిపారు. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్ కూడా మంజూరైందని, బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు. మంచి చేయాలని తాము ఆలోచిస్తుంటే.. ఎలా బురద జల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేస్తున్నమని తెలిపారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను కూడా ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. మదర్సాలకు అమ్మ ఒడిని అనుసంధానించామని, వచ్చే ఏడాది నుంచి పెళ్లి కానుక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ నీలం సాహ్ని, మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రతిపైసా సంక్షేమానికి ఖర్చుచేయాలి
ఆదిలాబాద్ అర్బన్ : మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న ప్రతిపైసాను వారి సంక్షేమానికే ఖర్చు చేసి అభివృద్ధికి తోడ్పడాలని హైకోర్టు న్యాయమూర్తులు బి.చంద్రకుమార్, జి.చంద్రయ్యలు అన్నారు. మంగళవారం జిల్లా పరిష త్ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం అజాద్ 126వ జయంతిని, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో హైకోర్టు న్యాయమూర్తులు ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ అబుల్ క లాం ఆజాద్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆర్వీఎం, మైనార్టీ కా ర్పొరేషన్ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల తీరును ఆయా శాఖ అధికారులు వివరించారు. ఆజాద్ జయంతి సందర్భంగా ముగ్గురు విద్యార్థులను హైకోర్టు జడ్జిలతో పాటు కలెక్టర్, నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 20 మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణమూర్తి, ఏఎస్పీ జోయేల్ డేవిస్, ఎంపీ జి.నగేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ రంజానీ, మైనార్టీ నాయకులు సాజిద్‌ఖాన్, యూనిస్ అక్బానీ, సాజిదొద్దీన్, సిరాజ్‌ఖాద్రి, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు జడ్జిలను జిల్లా కలెక్టర్, అధికారులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. -
క్యాంపస్‌లో ఆజాద్‌కు ఘన నివాళి
దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం ఘన నివాళులు అర్పించారు. తెయూ కళాశాల ప్రాంగణం లో మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్, హ్యూమానిటీస్ ప్రిన్సిపాల్ కనకయ్య మాట్లాడుతూ అబుల్ క లాం ఆజాద్ ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించి, హిందూ-ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారని తెలిపారు. తొలి విద్యా శాఖ మంత్రిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. తెయూ పీఆర్ఓ రాజారాం మాట్లాడుతూ ఆజాద్ నికార్సైన సెక్యులర్‌వాది అని, పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించిన జాతీయవాది అని అన్నారు. ముందు చూపుతో యూజీసీ, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేసి దేశాన్ని విద్యారంగంలో అగ్రభాగాన నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో తెయూ మై నారిటీ విభాగం డైరక్టర్ జమీల్ అహ్మద్, ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ అఖ్తర్ సుల్తానా, ప్రొపెసర్ నసీం, డాక్టర్ అబ్దుల్ ఖవి, డాక్టర్ త్రివేణి, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి వి ద్యార్థి నాయకులు పాల్గొన్నారు. సౌత్ క్యాంపస్‌లో భిక్కనూరు : తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో అబుల్‌కలామ్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సబిత, ప్రొఫెసర్లు లలిత, హరిత, ప్రతిజ్ఞ, నాగరాజు, రవీందర్, విద్యార్థి నాయకులు గణేశ్, సంజయ్, సవిత, స్వరూప, దివ్య, మహేశ్ -
అందరి ఐక్యతే అబుల్ కలాం ఆకాంక్ష
గుంటూరు ఎడ్యుకేషన్ :దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో వీరోచిత పాత్ర నిర్వర్తించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్ని వర్గాల ఐక్యతను ఆకాంక్షించిన మహనీయుడని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీ హిదాయత్ అన్నారు. ‘భారతరత్న’ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 127వ జయంతి సందర్భంగా మంగళవారం జాతీయ మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవాన్ని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హిదాయత్ మాట్లాడుతూ అబుల్ కలాం మైనార్టీల ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో రూ.46 కోట్లు సబ్సిడీ రూపంలో అందించామని, ఈ ఏడాది రూ.130 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. ముస్లింలకు రుణ మంజూరు లో బ్యాంకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయూలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. వై.ఎస్. వల్ల 4 శాతం రిజర్వేషన్లు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ దేశంలోని ముస్లింలు దుర్భర స్థితిలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ పార్టీలు వారి సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం ముస్లింలకు ఒక్క మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లు దండుకుని వారిని పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ 1947-58 మధ్య విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మౌలానా ఆజాద్ దేశంలో ఐఐటీలు, విశ్వవిద్యాలయాలతోపాటు యూజీసీని స్థాపించారని వివరించారు. దేశ జనాభాలో 11 శాతంగా ఉన్న ముస్లింలు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో 2 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మైనారిటీ కమిషన్ వైస్‌చైర్మన్ డాక్టర్ పీఎన్ఎస్ చంద్రబోస్, డీఈవో దొంతు ఆంజనేయులు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సప్తగిరి, మాజీ ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ షరీఫ్, రిటైర్డు ఎస్పీ ఎస్‌హెచ్ రెహ్మాన్, అజీమ్, అన్వర్ బాషా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం కె.రేణుక, ముస్లిం మత పెద్దలుపాల్గొన్నారు. డుమ్మా కొట్టిన మంత్రులు, జిల్లా స్థాయి అధికారిక కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనకపోవడం ముస్లిం మత పెద్దలను బాధించింది. దీనిపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో.. విద్యానగర్ (గుంటూరు): భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 127వ జయంతి వేడుకలను నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తాఫా తదితరులు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ ప్రతి ముస్లిం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మహబూబ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బండారు సాయి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, విద్యార్థి విభాగం నాయకుడు నర్శిరెడ్డి, నేతలు మండేపూడి పురుషోత్తం, సయ్యద్ ఖాదర్‌బాషా, మహమ్మొద్, డి.శ్రీనివాస్, ముత్యాలరాజు, ఎం.ప్రకాష్, కరిముల్లా, అల్లాబక్షు, దయా పాల్గొన్నారు. -
ఆయన జీవితాన్ని తెరకెక్కిస్తాను: ఆమిర్
సినిమా పరిశ్రమలో రాణించి స్టార్‌గా ఎదుగాలంటే ఎవరో ఒకరి ప్రోత్సాహాం, ప్రభావం లేదా స్పూర్తి ఉండాల్సిందే. బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్ సూపర్‌స్టార్‌గా ఎదగడానికి స్వతంత్ర సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ కారణమట. తాను సినీ పరిశ్రమలో ప్రముఖుడిగా ఎదగడానికి తమ కుటుంబానికి తమ దగ్గరి బంధువు ఆజాద్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని అమీర్ స్వయంగా ఇటీవల వెల్లడించారు. తన బాబాయి నాసిర్ హుస్సేన్ హిందీ చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించాలని తీసుకున్న నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో ఆజాద్ వెన్నుతట్టి.. ‘నీకు నచ్చిన పనిని నీవు చేయి.. ఎవరి మాట వినకు’ అని బాసటగా నిలిచారని అమీర్ తెలిపారు. ఆజాద్ అందించిన ప్రోత్సాహాంతోనే తన బాబాయి, తన తండ్రిలో తాహీర్ హుస్సేన్‌లు సినీ పరిశ్రమలో రాణించారని తెలిపారు. ఆజాద్ సలహాను పాటించకపోతే తన బాబాయ్, తండ్రి, తాను ఎక్కడ ఉండేవాళ్లమో అని అమీర్ అన్నారు. నీకు నచ్చిన పనినే చేయమని ఆజాద్ చెప్పిన ఫిలాసఫీ తనను ఆకట్టుకుందని.. తన ‘3 ఇడియెట్స్’ చిత్రానికి ఆయన చెప్పిన మాటలే మూల కథ అని అమీర్ తెలిపారు. భవిష్యత్‌ను ఊహించడంలో ఆజాద్‌ను మించిన వారు మరొకరు ఉండరని కితాబిచ్చారు. భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని ఆజాద్ ఓ సంవత్సరం ముందే ఊహించడం అబ్బురపరిచిందన్నారు. త్వరలోనే ఆజాద్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తాను అని అమీర్ వెల్లడించారు. -
ఆజాద్ జీవితాన్ని తెరకెక్కిస్తా: అమీర్ ఖాన్
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ వెల్లడించారు. అబుల్ కలాం ఆజాద్ తనకు అత్యంత సమీప బంధువు తెలిపారు. అయిన జీవిత చరిత్రను చిత్రంగా మలచాలని తన స్వప్నాన్ని త్వరలో సాకారం చేసుకుంటానని చెప్పారు. అందుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు వివరించారు. కొల్‌కత్తాలో అపీజే కొల్కత్తా లిటరరీ ఫెస్టివల్-2014ను బుధవారం అమీర్ ఖాన్ ప్రారంభించారు. అనంతరం అమీర్ ప్రసంగిస్తూ... ఆజాద్ రచనలు తానను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే కొద్ది కాలం ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలన్నింటిని తాను చదివానని అమీర్ ఖాన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మహనీయుని ఆలోచనలకు ఆ ఇంటర్వ్యూలు అద్దం పడతాయని అన్నారు. ప్రగతి శీల మేథస్సును ఆజాద్ ఓ ప్రతిరూపమని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఎం.కె.నారాయణ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టేడిస్ చైర్మన్ సీతారాం శర్మ పాల్గొన్నారు.