సాక్షి, గుంటూరు వెస్ట్: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు సోమవారం పరిశీలించారు. భారత తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంత్యుత్సవం సందర్భంగా ఈ నెల 11న గుంటూరులో జరగనున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, మొహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత పోలీస్ పరేడ్ మైదానంలోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు.
అక్కడి నుంచి ముఖ్యమంత్రి పర్యటించే మార్గాలు, ట్రాఫిక్, సెక్యూరిటీ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని జింఖానా మైదానం, వేంకటేశ్వర విజ్ఞాన మందిరాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ప్రజాప్రతినిధులు సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), షేక్ సజిల, పూసల, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్‌పర్సన్ కోలా భవాని, వైఎస్సార్‌సీపీ నాయకులు గులాం రసూల్, గుంటూరు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎండి.ఘని పాల్గొన్నారు.
కలెక్టర్ చాంబర్‌లో సమావేశం
జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ప్రత్యేక ఆహ్వానంతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళిగిరి, మొహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, అసిస్టెంట్ కలెక్టర్ శివన్నారాయణ శర్మ కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. సీఎం పర్యటనపై కూలంకషంగా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment