ఆదిలాబాద్ అర్బన్ : మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న ప్రతిపైసాను వారి సంక్షేమానికే ఖర్చు చేసి అభివృద్ధికి తోడ్పడాలని హైకోర్టు న్యాయమూర్తులు బి.చంద్రకుమార్, జి.చంద్రయ్యలు అన్నారు. మంగళవారం జిల్లా పరిష త్ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం అజాద్ 126వ జయంతిని, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో హైకోర్టు న్యాయమూర్తులు ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ముందుగా జిల్లా కలెక్టర్ అబుల్ క లాం ఆజాద్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆర్వీఎం, మైనార్టీ కా ర్పొరేషన్ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల తీరును ఆయా శాఖ అధికారులు వివరించారు. ఆజాద్ జయంతి సందర్భంగా ముగ్గురు విద్యార్థులను హైకోర్టు జడ్జిలతో పాటు కలెక్టర్, నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 20 మంది విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపాలకృష్ణమూర్తి, ఏఎస్పీ జోయేల్ డేవిస్, ఎంపీ జి.నగేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ రంజానీ, మైనార్టీ నాయకులు సాజిద్‌ఖాన్, యూనిస్ అక్బానీ, సాజిదొద్దీన్, సిరాజ్‌ఖాద్రి, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు జడ్జిలను జిల్లా కలెక్టర్, అధికారులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ప్రతిపైసా సంక్షేమానికి ఖర్చుచేయాలి
Published Wed, Nov 12 2014 3:34 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement