ఆజాద్ జీవితాన్ని తెరకెక్కిస్తా: అమీర్ ఖాన్
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తానని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ వెల్లడించారు. అబుల్ కలాం ఆజాద్ తనకు అత్యంత సమీప బంధువు తెలిపారు. అయిన జీవిత చరిత్రను చిత్రంగా మలచాలని తన స్వప్నాన్ని త్వరలో సాకారం చేసుకుంటానని చెప్పారు. అందుకోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు వివరించారు.
కొల్కత్తాలో అపీజే కొల్కత్తా లిటరరీ ఫెస్టివల్-2014ను బుధవారం అమీర్ ఖాన్ ప్రారంభించారు. అనంతరం అమీర్ ప్రసంగిస్తూ... ఆజాద్ రచనలు తానను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించే కొద్ది కాలం ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలన్నింటిని తాను చదివానని అమీర్ ఖాన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన మహనీయుని ఆలోచనలకు ఆ ఇంటర్వ్యూలు అద్దం పడతాయని అన్నారు.
ప్రగతి శీల మేథస్సును ఆజాద్ ఓ ప్రతిరూపమని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ఆ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఎం.కె.నారాయణ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టేడిస్ చైర్మన్ సీతారాం శర్మ పాల్గొన్నారు.