ప్రతి ఏటా నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్‌లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కు అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగానూ ఆజాద్ గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్‌ను దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణిస్తుంటారు.
దేశ స్వాతంత్ర్య సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1934లో యూనివర్సిటీ క్యాంపస్‌ను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
మొదటి విద్యా మంత్రిగా, స్వాతంత్య్రానంతరం దేశంలోని గ్రామీణ పేదలకు, బాలికలకు విద్యను అందించడంపై ఆయన దృష్టి సారించారు. వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించడం, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను విస్తరించడంతోపాటు వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన విద్యారంగంలో పలు మార్పులు చేశారు. దేశాభివృద్ధిలో ఆజాద్ అదించించిన సహకారం స్వాతంత్ర్య ఉద్యమానికి మించినదని కొందరు అంటుంటారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని తొలిసారిగా 2008 నవంబర్ 11న నిర్వహించారు. నాటి నుంచి ప్రతీటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం
Comments
Please login to add a commentAdd a comment