national education day
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: భారతరత్న, డాక్టర్ మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్స్ వేదికగా తన నివాళి ప్రకటించారు.స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకు ముందు..స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/2OoYBxEPB4— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2024 తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన అజాద్ జయంతి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆజాద్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, విశ్వేసరరాజు, విరూపాక్షి హాజరయ్యారు. -
National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి..
ప్రతి ఏటా నవంబరు 11న మన దేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశానికి మొదటి విద్యా మంత్రిగా పనిచేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఆయన 1888 నవంబర్ 11న అఫ్ఘానిస్తాన్‌లోని మక్కాలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ)కు అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగానూ ఆజాద్ గుర్తింపు పొందారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పడి, ఉన్నత విద్యకు అత్యున్నత మార్గం ఏర్పడింది. ఆజాద్‌ను దేశంలో ఉన్నత విద్యకు ఊపిరిపోసిన మహనీయునిగా అభివర్ణిస్తుంటారు.దేశ స్వాతంత్ర్య సముపార్జన, దేశ నిర్మాణంలో ఆజాద్ సహకారం అపారమైనదని చెబుతుంటారు. అతనిని స్వతంత్ర భారతదేశ ప్రధాన వాస్తుశిల్పిగానూ అభివర్ణిస్తుంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1920లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జామియా మిలియా ఇస్లామియా స్థాపనకు ఏర్పడిన కమిటీలో ఆజాద్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1934లో యూనివర్సిటీ క్యాంపస్‌ను న్యూఢిల్లీకి మార్చడంలో ప్రముఖ పాత్ర పోషించారు.మొదటి విద్యా మంత్రిగా, స్వాతంత్య్రానంతరం దేశంలోని గ్రామీణ పేదలకు, బాలికలకు విద్యను అందించడంపై ఆయన దృష్టి సారించారు. వయోజన అక్షరాస్యతను ప్రోత్సహించడం, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, సార్వత్రిక ప్రాథమిక విద్యను విస్తరించడంతోపాటు వృత్తిపరమైన శిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఆయన విద్యారంగంలో పలు మార్పులు చేశారు. దేశాభివృద్ధిలో ఆజాద్ అదించించిన సహకారం స్వాతంత్ర్య ఉద్యమానికి మించినదని కొందరు అంటుంటారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని తొలిసారిగా 2008 నవంబర్ 11న నిర్వహించారు. నాటి నుంచి ప్రతీటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం -
నంద్యాల ఘటన బాధాకరం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : దేశానికి తొలి విద్యా శాఖ మంత్రిగా అబుల్ కలాం సేవలందించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా సీఎం జగన్ ప్రకటించారు. బుధవారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. అబుల్ కలాం జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రాథమిక విద్య నుంచి వర్సిటీ విద్య వరకు అబుల్ కలాం అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. చదవండి: టపాసుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను అబుల్ కలాం హయాంలో స్థాపించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నిరుపేద విద్యార్థులకు మంచి చదువు అందించేలా నాడు-నేడు కార్యక్రమం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇంగ్లీష్ మీడియం అందించేలా మార్పులు చేస్తున్నామన్నారు. ఉన్నత విద్య చదువుకునే విద్యార్థులకు వసతి దీవెన అందిస్తున్నామని, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా రూ.3,428 కోట్లు అందించినట్లు వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నమన్న సీఎం జగన్ మైనార్టీలపై ట్విట్టర్, జూమ్ల్లో మాత్రమే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారని విమర్శలు సంధించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, చంద్రబాబు పాలనలో కేవలం రూ.2500 కోట్లు మాత్రమే మైనార్టీల సంక్షేమానికి కేటాయించారని దుయ్యబట్టారు. నంద్యాల ఘటన బాధాకరమని తెలిపిన సీఎం జగన్ తన దృష్టికి రాగానే చట్టబద్దంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నంద్యాల ఘటనలోనూ పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారని తెలిపారు. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్ కూడా మంజూరైందని, బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు. మంచి చేయాలని తాము ఆలోచిస్తుంటే.. ఎలా బురద జల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేస్తున్నమని తెలిపారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రిస్టియన్ మిషనరీ ఆస్తులను కూడా ప్రభుత్వం కాపాడుతుందని భరోసా ఇచ్చారు. మదర్సాలకు అమ్మ ఒడిని అనుసంధానించామని, వచ్చే ఏడాది నుంచి పెళ్లి కానుక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, మంత్రులు మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ నీలం సాహ్ని, మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మౌలానా అబుల్ కలామ్‌కు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, హైదరాబాద్ : స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (నవంబర్ 11) సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, పాత్రికేయుడిగా మౌలానా కనబర్చిన జాతీయవాద స్ఫూర్తి ఎంతో గొప్పదని జగన్ కీర్తించారు. మౌలానా జయంతి అయిన నవంబర్ 11ను ‘నేషనల్ ఎడ్యుకేషన్ డే’ గా జరుపుకొంటున్న సంగతిని గుర్తుచూస్తూ.. ఆ మహానుభావుడి ఆదర్శాలను నేటి సమాజమంతా అనుసరించాల్సిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు. ఆజాద్ ఆయన కలం పేరు : మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1988, నవంబర్ 11న మక్కాలో జన్మించారు. తల్లిదండ్రులు ఖైరుద్దీన్ అహమ్మద్, ఆలియా బేగమ్‌లు హజ్ యాత్రలో ఉండగా ఆజాద్ పుట్టారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆజాద్ తన తాతగారి(అమ్మవాళ్ల నాన్న) ఇంట్లో(ఢిల్లీ) పెరిగారు. స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. దాదాపు 10 సంవత్సరాలపాటు జైలుశిక్షను కూడా అనుభవించారు. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా 11 ఏళ్లపాటు పనిచేశారు. విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతి అయిన నవంబర్ 11ను ‘నేషనల్ ఎడ్యుకేషన్ డే’గా జరుపుతాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్'. 'అబుల్ కలాం' అనేది ఆయన బిరుదు. ఇక 'ఆజాద్' ఆయన కలం పేరు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా పరమపదించారు. -
ఈ విప్లవాత్మక మార్పులెవరికని అడిగితే!
విశ్లేషణ మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకే వెలుగునిచ్చాయి. సామాజిక జీవనం మారకుండా పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబా లాంటి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పు లు వచ్చాయి. కానీ ఆ మార్పులన్నీ ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయన్నది కీ లకమైనది. విద్యలో మా ర్పులు, సాంకేతిక సమాచార రంగంలోని విప్లవా లు నేటికీ కొన్ని వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో వచ్చిన గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకు మరింత వెలుగునిచ్చాయి. అదే దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, ఆదివాసీ వర్గాలలో రావాల్సినంత మార్పు జరగలేదు. 20 శాతం మంది పేద వర్గాల విద్యార్థులకు ఈ విద్యా వెలుగులు అందకపోతే దేశాభివృద్ధి కుంటుపడిపోతుంది. చరిత్రాత్మకమైన కొఠారి కమిషన్ మొట్టమొదటిసారి కామన్ స్కూల్ విధానాన్ని (సీఎస్ఎస్) ప్రవేశపెట్టింది. ఈ విధానంవల్ల సమాజంలోని ఆర్థిక అంతస్తులను తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కొఠారి కమిషన్ నిర్దేశించింది. జాతీయ సమగ్రతకు దోహదపడటం కోసం ఒక రాష్ట్రం విద్యార్థులను మరొక రాష్ట్ర విద్యార్థులతో కలపటం కూడా ఇందులో ముఖ్యమైనది. ప్రాథమిక దశలో విద్యార్థులందరికీ, ముఖ్యంగా బీసీ కులాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు, ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలన్నది కొఠారి కమిషన్ సూచనలలో కీలకమైనది. కానీ దీన్ని ఏవిధంగా అమలు జరపాలో చెప్పకపోవటం వలన అది కాగితాలకే పరిమితమైంది. 1986లో మానవ వనరులశాఖ ఒక పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు పూనుకున్నది. దీంతోనే 1986లో రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1992లో విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం పునర్ విమర్శన చేసింది. వెనుకబడిన వర్గాల పిల్లల నుంచి డిమాం డ్ లేనందున జాతీయ విద్యావిధానం (ఎన్పీఈ) అంతగా అమలుజరగలేదు. బీద పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పించటం వరకే అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయి. దీనివలన విద్యలో సమత్వం రా దని 1992లో ప్లానింగ్ కమిషన్ పునర్ సమీక్ష చేసిం ది. ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాల పిల్లలు బడికి వ చ్చేందుకై కొన్ని రాయితీలివ్వాలని తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రత్యేక హాస్టల్స్ తెరవాలని, గిరిజన ప్రాంతంలో ఆశ్రమ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలలోనే బడులు ఏర్పాటు చేయాలని ఎన్పీఈ కమిషన్ సూచించింది. నవోదయ బడులలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రిజ ర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. కానీ ఇవి అంతగా అమలు జరగలేదు. కారణాలు ఎన్నో. ఎస్సీ, ఎస్టీ స్కూళ్ల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయి. వీటికి ప్రభుత్వం డబ్బు కేటాయించకపోగా హాస్టల్స్‌లో నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నా రు. ఎన్పీఈ సిఫార్సులు విద్యారంగంలో మరొక అంతస్తును సృష్టించాయి. ఆశ్రమ స్కూళ్లకు, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో వ్యత్యాసమే ఇంకో అగాధాన్ని సృష్టించింది. జనరల్ స్కూళ్లలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చినా వారి స్థితిగతులను మార్చకుం డా పాఠశాలల్లో చేర్పించినా వారిని నిలబెట్టుకోవటమే కష్టమైపోయింది. మొదటి తరగతిలో చేరిన వాళ్లు రెండో తరగతి వచ్చేసరికి డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2013-14 విద్యాసంవత్సరంలో 5వ తరగతి వరకు చదివే విద్యార్థులలో 22.23 శాతం, 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్య 32.56 శాతం, 1 నుంచి 10వ తరగతి వరకు బడి మానేసిన విద్యార్థుల సంఖ్య 38.21 శాతంగా ఉన్నాయని, ఇటీవల తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పేర్కొంది. ఇదే నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా డ్రాప్ అవుట్ల సంఖ్య కనిపిస్తుంది. ఆ డ్రాప్ అవుట్ విద్యార్థులను పట్టించుకోకపోవటం వలన వారు చదువులో వెనుకబడిపోయారు. ఎన్పీఈ వలన 20 శాతం వర్గాల ఆడపిల్లల చదువులో మార్పు వచ్చింది. వెనుకబడిన వర్గాల ఆడపిల్లల చదువులో అంతగా మార్పు రాలేదు. సామాజిక జీవనం మారకుండా ఆ పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబాలాం టి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. అట్టడుగు వర్గాలలో చైతన్యం కలిగించి వారిని విద్య వైపు మళ్లిం చాలి. భారతదేశ తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బడికిరాని పిల్లల పైన ప్రత్యేకంగా విచారించే యంత్రాంగం కావాలి. డ్రాప్ అవుట్స్‌కు విరుగుళ్లు వెతకాలి. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త)