మదర్ థెరీసా జయంతి.. వైఎస్ జగన్ నివాళులు | YS Jagan Pays Tribute to Mother Teresa On Her Birth Anniversary | Sakshi
Sakshi News home page

మదర్ థెరీసా జయంతి.. వైఎస్ జగన్ నివాళులు

Published Mon, Aug 26 2024 3:20 PM | Last Updated on Mon, Aug 26 2024 5:32 PM

YS Jagan Pays Tribute to Mother Teresa On Her Birth Anniversary

సాక్షి, తాడేపల్లి: నేడు శాంతిదూత మదర్ థెరీసా జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.  పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే త‌న ఆస్తిగా భావించి వారంద‌రినీ అక్కున చేర్చుకున్న మాన‌వ‌తా మూర్తి మ‌ద‌ర్ థెరిసా అని కొనియాడారు.

ఎంతో మంది అనాథ‌లు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే కాదు అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి భ‌విషత్తుకు బంగారు బాట‌లు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని ప్రశంసించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విజ‌య‌వాడ న‌గ‌రంలోని నిర్మల్‌ హృదయ్ ‌భవన్‌ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఆ భవనం కాంప్లెక్స్‌ను ఆరోజు తాను ప్రారంభించండం సంతోషంగా ఉందని తెలిపారు. నేడు భారతరత్న, నోబెల్‌ బహుమతి గ్రహీత మ‌ద‌ర్ థెరిసాగారి జ‌యంతి సంద‌ర్భంగా మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.

మదర్ థెరిసా జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement