యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం | Karnataka: 80 Year Old Beggar Donates Rs 1 Lakh to Polali Rajarajeshwari Temple | Sakshi
Sakshi News home page

యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం

Published Thu, Oct 20 2022 3:34 PM | Last Updated on Thu, Oct 20 2022 3:37 PM

Karnataka: 80 Year Old Beggar Donates Rs 1 Lakh to Polali Rajarajeshwari Temple - Sakshi

దానం సొమ్ము అందజేస్తున్న అశ్వర్థమ్మ

యశవంతపుర(కర్ణాటక): కట్టుకున్న భర్త, కన్న కొడుకులు కాలం చేశారు. కడుపు నింపుకోవడానికి భిక్షాటనపై ఆధారపడింది. గుడులు, కూడళ్లలో భిక్షగా వచ్చిన నగదు కూడబెట్టింది. మంగళూరులోని ముల్కి దుర్గా పరమేశ్వరి ఆలయంలో అన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చింది. తన దాతృత్వాన్ని చాటుకుంది. 

ఆమె మరెవరో కాదు కర్ణాటక రాష్ట్రం ఉడుపికి చెందిన వృద్ధురాలు అశ్వర్థమ్మ (80). ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాచన ద్వారా రోజు వచ్చే డబ్బులను పిగ్మీ పొదుపు ఖాతాలో కడతానని, లక్ష రూపాయలు కాగానే ఏదో ఒక ఆలయానికి ఇస్తానని చెప్పింది. కరోనా సమయంలో అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రూ.1.5 లక్షలు అందజేశానని తెలిపింది. ( లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగాలు వదిలేసి.. భార్యాభర్తలిద్దరూ..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement