
అమరావతి, వినుకొండ(నూజెండ్ల): ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదరించే మహిళగా డొక్కా సీతమ్మ పేరు అందరికీ సుపరిచయమే. ఈ కోవాకి చెందిన వినుకొండ పట్టణంలోని భవనాశి సాయికుమారి (66) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. పట్టణంలోని వివేకానంద పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న భవనాశి సాంబశివరావు భర్య సాయి కుమారి గత 20 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నవారిని ఇంటికి పిలిచి అన్నం పెడుతుంది. ఆకలితో ఉన్నవారు ఈమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చేవారు. ఏ సమయంలో ఆకలితో వెళ్లినా లేదు అనకుండా భోజనం పెడుతూ యాచకులు, నిరుపేదల ఆకలి తీర్చే మహిళగా మంచి పేరు సంపాదించుకున్న సాయి కుమారి మృతితో వారు ఆందోళన చెందుతున్నారు. నువ్వు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కెవరమ్మా అని అన్నార్తులు రోదిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ఆమె చేతి అన్నం తిన్న వారు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆమె మృతికి పట్టణంలోని ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment