వరంగల్: అన్ని దానాల్లో కంటే అన్న దానం మిన్న అని వరంగల్ ఏసీపీ శ్రీ గిరి కుమార్ అన్నారు. ఆకలితో అలమటిస్తున్న బడుగు బలహీన వర్గాలకు పాదచారులకు విద్యార్థులకు వైద్య సిబ్బందికి పలని సేవాదళ్ వారు గత మూడు సంవత్సరాల నుంచి అమావాస్య రోజు అన్నదానం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఆదివారం రోజు మధ్యాహ్నం శ్రీ భద్రకాళి దేవాలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి శ్రీ గిరి కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అన్నదాన కార్యక్రమంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్ రెడ్డి, పలణి సేవాదళ్ నిర్వాహకులు బొడ్ల రవీంద్రనాథ్, గుండా అమర్నాథ్, నూతన్ కుమార్, లహరి సంతోష్ నరేష్, బొడ్ల సద్గున్, తాటిపల్లి కార్తీక్, పబ్బతి అవినాష్,ఛార్టర్డ్ అకౌంటెంట్ పబ్బతి కవి భరత్, మోదే నాగేందర్, వాకర్స్ అసోసియేషన్ చింతం సారంగపాణి, శ్రీమతి పడిశాల సుజాత తదితరులు పాల్గొన్నారు. సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment