లాక్‌డౌన్ వల్ల నిరుపేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా పేదలకు క్షామాన్ని తెచ్చిపెట్టింది. దీంతో కడుపు నిండా తిండి లేక రోజుల తరబడి పస్తులుంటున్నవారు కోకొల్లలు. మన చుట్టూనే ఎంతోమంది అన్నం దొరక్క అల్లాడిపోతున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్నదాన్ (అన్నదానం) చాలెంజ్ తీసుకువచ్చాడు. అందులో భాగంగా మంగళవారం ట్విటర్‌లో ఓ ఫొటోను పంచుకున్నాడు. అందులో మన హీరో, తన ఇద్దరు స్నేహితులు బాబా సిద్ధిఖీ, జీశాన్ సిద్ధిఖీలతో కలిసి ఆహార పొట్లాలను సిద్ధం చేస్తున్నాడు. (ప్యార్ కరోనా)
వీటిని ఆహార కొరతతో బాధపడుతోన్న లక్షా 25వేల మందికి పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. అంతేకాక కోవిడ్-19తో ఆర్థికంగా అతలాకుతలం అయిన పేదలకు నిత్యావసర సరుకులను అందించి ఆదుకోవాలని అభిమానులను కోరాడు. కాగా సల్మాన్.. 25 వేల మంది సినీ కార్మికులకు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పలు విడతల్లో డబ్బును జమ చేస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్‌లో "బి ద రియల్ మెన్" చాలెంజ్ వైరలవుతున్న విషయం తెలిసిందే. (క్లైమాక్స్ గురించి సల్మాన్ భయపడ్డాడు)
Baba and baba's baba zeeshan ne aan baan aur shaan se 1,25,000 families ko ration bataa hai.
— Salman Khan (@BeingSalmanKhan) April 28, 2020
Now this is a challenge that one should be a part of.. Challenge 'Anna Daan'
Karo to khud ya kissi bharosemand ke through...@BabaSiddique @zeeshan_iyc pic.twitter.com/317KPrxWyp
Comments
Please login to add a commentAdd a comment