నిత్యాన్నదానానికి రూ.మూడు లక్షల విరాళాలు
నిత్యాన్నదానానికి రూ.మూడు లక్షల విరాళాలు
Published Sun, Aug 14 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
అన్నవరం :
సత్యదేవుని నిత్య అన్నదానపథకానికి ఆదివారం రూ.మూడు లక్షల విరాళాలను భక్తులు సమర్పించారు. వీటిలో ఇద్దరు దాతలు రూ.2,02,232 విరాళాలను అందజేశారు. మరో రూ.98 వేల విరాళాలను మరి కొంతమంది భక్తులు సమర్పించారు. శంఖవరానికి చెందిన ప్రత్తిపాడు మాజీ శాసనసభ్యురాలు పర్వత బాపనమ్మ రూ.1,01,116 విరాళాన్ని ఈఓ కే నాగేశ్వరరావుకు ఆదివారం అందచేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా శ్రావణ శుద్ధ తదియ నాడు మాజీ ఎమ్మెల్యే పర్వత సుబ్బారావు పేరున అన్నదానం చేయమని ఆమె కోరారు. బాపనమ్మ వెంట టీడీపీ నాయకుడు పర్వత రాజబాబు, స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు.
అలాగే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆచంట రామకృష్ణారావు, వేంకట మహాలక్ష్మి దంపతులు కూడా సత్యదేవుని అన్నదానç ³థకానికి రూ.1,01,116 విరాళాన్ని ఈఓకి అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అన్నదానం చేయమని కోరారు.
Advertisement
Advertisement