మల్లాం ఆలయంలో వైఎస్సార్ సీపీ నేత పూజలు | YSR CP leader is worshiped in the temple mallam | Sakshi
Sakshi News home page

మల్లాం ఆలయంలో వైఎస్సార్ సీపీ నేత పూజలు

Published Thu, Feb 11 2016 1:52 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

మల్లాం ఆలయంలో వైఎస్సార్ సీపీ నేత పూజలు - Sakshi

మల్లాం ఆలయంలో వైఎస్సార్ సీపీ నేత పూజలు

 చిట్టమూరు: మండల పరిధిలోని మల్లాం గ్రామంలో స్వయంభువుగా కొలువైన వళ్లీదేవ సేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డిలు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మూలం భానుప్రకాష్ శర్మ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి చిత్రపటం బహూకరించారు. ఆలయ అభివద్ధి, కోనేరు నిర్మాణానికి సహయ సహకారాలు అందిస్తామన్నారు.

 భక్తులకు అన్నదానం: ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వైస్సార్ సీపీ నాయకులు ప్రారంభించారు. ఉభయకర్తలుగా ఓడూరు గిరధర్ రెడ్డి, ఇందూరు రోహన్ సాయిలు వ్యవహరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ పేరం మధునాయుడు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి చెన్నారెడ్డి బాబురెడ్డి, నాయకులు కళత్తూరు రామ్మోహన్ రెడ్డి, ఓడూరు సుందరరామిరెడ్డి, పెళ్లకూరు సర్పంచ్ బైనా చంద్రశేఖర్ రెడ్డి, కామిరెడ్డి మోహన్ రెడ్డి, ఓడూరు రమణారెడ్డి, అన్నమనేని రామకష్ణనాయుడు, చెన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement