biyyapu madhusudan reddy
-
చంద్రబాబు అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
-
శ్రీశైలంలో శివ మాల వస్త్రాలు పంచిన ఎమ్మెల్యే
-
మల్లాం ఆలయంలో వైఎస్సార్ సీపీ నేత పూజలు
చిట్టమూరు: మండల పరిధిలోని మల్లాం గ్రామంలో స్వయంభువుగా కొలువైన వళ్లీదేవ సేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఓడూరు గిరిధర్ రెడ్డిలు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు మూలం భానుప్రకాష్ శర్మ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి చిత్రపటం బహూకరించారు. ఆలయ అభివద్ధి, కోనేరు నిర్మాణానికి సహయ సహకారాలు అందిస్తామన్నారు. భక్తులకు అన్నదానం: ఆలయంలో మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని వైస్సార్ సీపీ నాయకులు ప్రారంభించారు. ఉభయకర్తలుగా ఓడూరు గిరధర్ రెడ్డి, ఇందూరు రోహన్ సాయిలు వ్యవహరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా జాయింట్ సెక్రటరీ పేరం మధునాయుడు, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి చెన్నారెడ్డి బాబురెడ్డి, నాయకులు కళత్తూరు రామ్మోహన్ రెడ్డి, ఓడూరు సుందరరామిరెడ్డి, పెళ్లకూరు సర్పంచ్ బైనా చంద్రశేఖర్ రెడ్డి, కామిరెడ్డి మోహన్ రెడ్డి, ఓడూరు రమణారెడ్డి, అన్నమనేని రామకష్ణనాయుడు, చెన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి పాల్గొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం - వైఎస్సార్ సీపీ ధర్నా
ఓ పక్క భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇక్కట్లకు గురైతుంటే.. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఏర్పేడు మండలం ఇసుకతగేలి చెరువుకు గండి పడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. దీనికి జిల్లా ఏఈ జయకుమార్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. -
మంత్రి గోపాలకృష్ణ అనుచరులే కబ్జా చేశారు
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ నేతలు వెయ్యి ఎకరాల భూకబ్జాకు పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణ అనుచరులే కబ్జా చేశారని ఆయన అన్నారు. దళితుల పొట్టగొట్టి టీడీపీ నేతలు రూ.కోట్లు సంపాదిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ధ్వజమెత్తారు. వెయ్యి ఎకరాల భూకబ్జాపై సీబీపీ విచారణ చేయించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దళిత రైతులకు న్యాయం జరిగేవరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత మండలంలో టీడీపీ నాయకులు సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం రాష్ట్రంలో ఇదే ప్రథమం అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.