ఓ పక్క భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇక్కట్లకు గురైతుంటే.. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఏర్పేడు మండలం ఇసుకతగేలి చెరువుకు గండి పడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. దీనికి జిల్లా ఏఈ జయకుమార్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు.
అధికారుల నిర్లక్ష్యం - వైఎస్సార్ సీపీ ధర్నా
Published Wed, Nov 11 2015 11:24 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement
Advertisement