జిల్లా కలెక్టర్‌కు అభినందనలు
కర్నూలు: కృష్ణా పుష్కరాలకు నేతత్వం వహించి విజయవంతంగా నిర్వహించిన జిలా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌ను జిల్లా నాన్ గజిటెడ్ అధికారుల సంఘం నేతలు అభినందించారు. మంగళవారం జిల్లా అధ్యక్షుడు వీసీహె చ్ వెంగళరెడ్డి ఆద్వర్యంలో పలువురు నేతలు కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అ««దl్యక్షుడు మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి ఇబందులు లేకుండా పుష్కరాలు నిర్వహించారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మతి చెందిన పంచాయతీరాజ్ ఏఈ, డైవర్ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని, గాయపడిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగికి కార్పోరేట్ అసుపత్రిలో వైద్యం అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...అందరి సహకారంతోనే పుష్కరాలను విజయవంగంగా నిర్వహించామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మతి చెందిన వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జవహార్‌లాల్, అసోసియేట్ అధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాష్ట్ర ఉఫాధ్యక్షుడు జి.రామకష్ణారెడ్డి, జిల్లా కోశాధికారి పి. రామకష్ణారెడ్డి, నగర అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మన్న, హరిశ్చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.