ఎస్పీకి ఐజీ అభినందన
కర్నూలు: కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసిన జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐజీ శ్రీధర్‌రావు అభినందించారు. శ్రీశైలంలో కృష్ణా పుష్కరాల బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్పీ.. ఈనెల 24వ తేదీన విజయవాడలో జరిగిన జరిగిన పుష్కరాల ముగింపు సమావేశానికి హాజరుకాలేకపోయారు. కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జ్ఞాపికను ఐజీ శ్రీధర్‌రావు అందుకున్నారు. దీనిని ఐజీ చేతుల మీదుగా శనివారం ఎస్పీ అందుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.