SMAT 2024: రికీ భుయ్‌ ఊచకోత.. దుమ్మురేపుతున్న ఆంధ్ర జట్టు | SMAT 2024 Andhra Team Beat Services Consecutive 4th Win | Sakshi
Sakshi News home page

SMAT 2024: దుమ్మురేపుతున్న ఆంధ్ర జట్టు.. వరుసగా నాలుగో విజయం

Published Mon, Dec 2 2024 12:12 PM | Last Updated on Mon, Dec 2 2024 2:50 PM

SMAT 2024 Andhra Team Beat Services Consecutive 4th Win

సాక్షి, హైదరాబాద్‌: దేశవాళీ టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టోర్నీలో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తున్న ఆంధ్ర జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. గ్రూప్‌ ‘ఈ’లో భాగంగా ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఆంధ్ర జట్టు 23 పరుగుల తేడాతో సర్వీసెస్‌ జట్టును ఓడించింది.

కెప్టెన్‌ రికీ భుయ్‌ విధ్వంసం
టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెప్టెన్‌ రికీ భుయ్‌ (35 బంతుల్లో 84; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా... ఓపెనర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (39 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిశాడు. 

మరోవైపు.. ప్రసాద్‌ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సర్వీసెస్‌ బౌలర్లలో పూనమ్‌ పూనియా, మోహిత్‌ రాఠి, వినీత్‌ ధన్‌కడ్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సర్వీసెస్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 199 పరుగులకు పరిమితమైంది.

అగ్రస్థానంలో
కెప్టెన్‌ మోహిత్‌ అహ్లావత్‌ (37 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), వినీత్‌ ధన్‌కడ్‌ (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో పోరాడారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్, శశికాంత్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా... సత్యనారాయణ రాజు 2 వికెట్లు తీశాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆంధ్ర జట్టు 16 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తదుపరి పోరులో మంగళవారం కేరళతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.  

స్కోరు వివరాలు 
ఆంధ్ర ఇన్నింగ్స్‌: కోన శ్రీకర్‌ భరత్‌ (సి) అరుణ్‌ (బి) పూనమ్‌ పూనియా 63; అశ్విన్‌ హెబర్‌ (సి) అరుణ్‌ (బి) విశాల్‌ 1; షేక్‌ రషీద్‌ (సి) అరుణ్‌ (బి) పుల్‌కిత్‌ నారంగ్‌ 21; రికీ భుయ్‌ (సి) వినీత్‌ (బి) విశాల్‌ 84; పైలా అవినాశ్‌ (సి) పూనమ్‌ పూనియా (బి) వినీత్‌ 5; ప్రసాద్‌ (సి) విశాల్‌ (బి) పూనమ్‌ పూనియా 28; శశికాంత్‌ (సి) పూనమ్‌ పూనియా (బి) వినీత్‌ 0; వినయ్‌ కుమార్‌ (నాటౌట్‌) 7; సత్యనారాయణ రాజు (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–24, 2–63, 3–151, 4–175, 5–188, 6–209, 7–222, 8–222. 
బౌలింగ్‌: పూనమ్‌ పూనియా 4–0–37–2; గౌరవ్‌ శర్మ 3–0–43–0; విశాల్‌ గౌర్‌ 4–0–50–2; మోహిత్‌ రాఠి 4–0–35–0; పుల్‌కిత్‌ 1.5–0–17–1; వినీత్‌ ధన్‌కడ్‌ 2.1–0–24–2; నితిన్‌ తన్వర్‌ 1–0–16–0.  

సర్వీసెస్‌ ఇన్నింగ్స్‌: కున్వర్‌ పాఠక్‌ (సి) అవినాశ్‌ (బి) స్టీఫెన్‌ 2; రజత్‌ (సి) భరత్‌ (బి) శశికాంత్‌ 33; నితిన్‌ తన్వర్‌ (ఎల్బీ) రాజు 1; వినీత్‌ (సి) వినయ్‌ (బి) శశికాంత్‌ 51; మోహిత్‌ అహ్లావత్‌ (సి) రికీ భుయ్‌ (బి) రాజు 74; అరుణ్‌ (బి) శశికాంత్‌ 0; మోహిత్‌ రాఠి (సి) అవినాశ్‌ (బి) స్టీఫెన్‌ 5; గౌరవ్‌ శర్మ (రనౌట్‌/స్టీఫెన్‌) 3; పూనమ్‌ పూనియా (సి) ప్రసాద్‌ (బి) స్టీఫెన్‌ 17; విశాల్‌ గౌర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–4, 2–38, 3–50, 4–150, 5–150, 6–173, 7–175, 8–187, 9–199. 
బౌలింగ్‌: స్టీఫెన్‌ 4–0–26–3; శశికాంత్‌ 4–0–50–3; సత్యనారాయణ రాజు 4–0–39–2; వినయ్‌ కుమార్‌ 4–0–35–0; యశ్వంత్‌ 4–0–43–0.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement