appreciate
-
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశంసలు అందుకున్న బ్యూటీ.. (ఫోటోలు)
-
వీడియో: ‘భారతీయన్స్’పై క్రికెటర్ ఏబీ.డివిలియర్స్ ప్రశంసలు
-
ఎస్పీకి ఐజీ అభినందన
కర్నూలు: కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసిన జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐజీ శ్రీధర్‌రావు అభినందించారు. శ్రీశైలంలో కృష్ణా పుష్కరాల బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్పీ.. ఈనెల 24వ తేదీన విజయవాడలో జరిగిన జరిగిన పుష్కరాల ముగింపు సమావేశానికి హాజరుకాలేకపోయారు. కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జ్ఞాపికను ఐజీ శ్రీధర్‌రావు అందుకున్నారు. దీనిని ఐజీ చేతుల మీదుగా శనివారం ఎస్పీ అందుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింధూ విజయం దేశానికి గర్వకారణం
-
అమూల్యమైన బహుమతి
► పీఎస్ఎల్వీ సక్సెస్‌పై ప్రధాని హర్షం.. నావిక్‌గా నామకరణం శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ సీ33 ప్రయోగం విజయవంతమవడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగంతో అందుబాటులోకి రానున్న కొత్త నావిగేషన్ వ్యవస్థకు ‘నావిక్’(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్)గా నామకరణం చేస్తూ జాతికి అంకితం చేశారు. దేశంలోని 125 కోట్ల మందికి అమూల్యమైన బహుమతి ఇచ్చారని, దేశ త్రివర్ణ పతాకాన్ని వినువీధిలో రెపరెపలాడించారంటూ ఇస్రో శాస్త్రవేత్తలను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రయోగాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి విజయవంతం చేశారని అభినందించారు. ఇస్రో ప్రయోగాల్లో ఇది చరిత్రాత్మకమైన ఘట్టమని అభివర్ణించారు. గురువారం షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ33 ప్రయోగాన్ని ప్రధాని ఢిల్లీ నుంచి వీక్షించారు. వాస్తవానికి ప్రయోగాన్ని స్వయంగా వీక్షించి, నావిగేషన్ సిస్టంను జాతికి అంకితం చేయడానికి ప్రధాని వస్తారని ప్రచారం జరిగింది. అయితే రావడం కుదరకపోవడంతో ఢిల్లీ నుంచే ఇస్రో శాస్త్రవేత్తలనుద్దేశించి మాట్లాడారు. ఉపగ్రహ ప్రయోగాలతో దేశవ్యాప్తంగా సాంకేతిక విప్లవం వచ్చిందని, వాటి ఫలితాలు సామాన్యుడికి సైతం అందుతున్నాయని పేర్కొన్నారు. మరో రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరి చేతిలో నావిగేషన్ సిస్టం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సాంకేతిక ఫలితాలు పేదా ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతోందని, అందుకే ఈ నావిగేషన్ వ్యవస్థను జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదు దేశాలకు మాత్రమే వివిధ రకాల పేర్లతో నావిగేషన్ సిస్టం ఉందని, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్న ఆరో దేశంగా భారత్ ఆవిర్భవించిందని అన్నారు. నావిగేషన్ సిస్టం టెక్నాలజీని నేడు సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారుల నుంచి విమానాలు, నౌకలు నడిపే పైలట్లు, కెప్టెన్ల వరకు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఈ టెక్నాలజీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి విపత్తులు, ప్రమాదాలు జరిగినా వెంటనే గుర్తించి సమాచారం అందిస్తుందన్నారు. -
సాక్షికి మంత్రి హరీష్ రావు ప్రశంసలు
హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణ కోసం సాక్షి మీడియా చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు ప్రశంసించారు. సాక్షి పత్రికలో అక్షర యజ్ఞం పేరిట చెరువులపై చేపడుతున్న చర్చాకార్యక్రమం ఎంతో మేలు చేస్తోందని హరీష్ రావు అన్నారు. సాక్షి తీసుకొచ్చిన జనస్పందనలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించానని చెప్పారు. సాక్షి టీవీ స్టూడియోలో శుక్రవారం రాత్రి జరిగిన చర్చా కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు సాక్షి ఈడీ రామచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు దేవురపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మిషన్ కాకతీయ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను సిటీ ఆఫ్ లేక్స్‌గా పిలుచుకునే వాళ్లం. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోనూ తెలంగాణ చెరువుల కోసం 265 టీఎంసీల నీటిని కేటాయించారు. రాను రాను చెరువుల సామర్థ్యం తగ్గిపోయింది. చెరువుల్లోకి రావాల్సిన నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. తెలంగాణలో ప్రతి గ్రామంలో జీవితం చెరువుతో ముడిపడి ఉంది. రాష్ట్రంలో నీటి లభ్యత తగ్గిపోయిందంటే చెరువుల దుస్థితే కారణమని సీఎం కేసీఆర్ చెప్పారు. భారీ ప్రాజెక్టులు కట్టాలంటే చట్టపరంగా ఎన్నో అడ్డంకులున్నాయి. చెరువుల పునరుద్ధరణకు ఎలాంటి అడ్డంకుల్లేవ్, ప్రజలకు తక్షణ ప్రయోజనం కలుగుతుంది. తెలంగాణలో మొత్తం 46 వేల చెరువులు ఉన్నాయి. పది ఎకరాల నుంచి కొన్ని వేల ఎకరాలకు ఇవి నీటిని ఇస్తున్నాయి. ఈ ఏడాది 9 వేల చెరువుల పునరుద్ధరణ, వచ్చే ఐదేళ్లలో అన్ని చెరువుల పునరుద్ధరణ చెరువుల్లో పూర్తి పూడిక తీయడం గతంలో ఎప్పుడు జరగలేదు.. ఈసారి ఒక యజ్ఞంలా చేస్తున్నాం. చెరువుల్లో 50 ఏళ్ల పూడిక ఈసారి తీయడం మా లక్ష్యం. పూడిక మట్టినంతటినీ పొలాల్లోకి తరలించడం వల్ల సాగు భూములు కూడా మెరుగవుతాయి. ప్రభుత్వం చేసే ఈ మిషన్ కాకతీయలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. చెరువుల పునరుద్ధరణకు ఎంత డబ్బు ఖర్చయితే అంత మంజూరు చేస్తాం. అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఉన్న చెరువుల సరిహద్దుల్లో మొక్కలను నాటించే పని చేస్తారు. అన్ని రికార్డులను పరిశీలించిన తరువాతనే చెరువుల సరిహద్దులపై నిర్ణయం. ఇక్రిశాట్ ప్రయోగాత్మకంగా పూడిక మట్టిపై ఓ పుస్తకం విడుదల చేసింది. పూడిక మట్టి వినియోగించేలా ప్రభుత్వమే విస్తృత ప్రచారం చేస్తోంది. అద్భుతమైన సాంస్కృతిక కేంద్రంగా చెరువు ఉంటుంది. చెరువుల పునరుద్ధరణలో కూడా గోరటి వెంకన్న భాగస్వామ్యం ఉండాలని కోరుతున్నా. ప్రాణహిత చేవెళ్ల ద్వారా నల్లగొండకు సాగు, తాగు నీరు అందించాలని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. తప్పకుండా ఆయన వినతిని అంగీకరిస్తున్నా. నీళ్లున్న చెరువుల్లో చేపల పెంపకం కూడా చేపట్టాలని ఆలోచిస్తున్నాం. మిషన్ కాకతీయపై అకౌంట్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం. తెలంగాణ పునర్నిర్మాణంలో కాకతీయ చాలా కీలక ఘట్టం. సాక్షి టీవీలో మిషన్ కాకతీయకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి హరీశ్ రావు కోరారు. -
జాతీయ క్రీడల్లో తెలంగాణకు తొలి స్వర్ణం
హైదరాబాద్: కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. గురువారం జరిగిన రోయింగ్ విభాగంలో మంజీత్ సింగ్, దేవేందర్ సింగ్ స్వర్ణ పతకాలు సాధించారు. దీంతో తెలంగాణ ఖాతాలో రెండు బంగారు పతకాలు చేరాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. జాతీయ క్రీడలు ప్రారంభమైనప్పటినుంచి ఈ రోజు వరకు తెలంగాణకు ఏ విభాగంలోనూ స్వర్ణ పతకాలు రాలేదు. -
'కేసీఆర్ 6 నెలల పాలన బాగుంది'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు 6 నెలల పాలన బాగుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కితాబిచ్చారు. సీపీఐ కార్యాలయంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పాటు కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణలో ఆరు నెలల పాలనపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిర్దిష్ట ప్రణాళికలు, సూచనలు చేస్తామని కోదండరాం అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ 6 నెలల పాలనలో నిరాశ నెలకొందని చెప్పారు. హామీలను, పథకాలను మరింత సమర్థవంతంగా నెరవేర్చాలని సూచించారు.