
నార్నే నితిన్ హీరోగా నటించిన చిత్రం ఆయ్.

ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది. ఈ విజయాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బవుతోంది హీరోయిన్ నయన్ సారిక.

టాలీవుడ్‌లో ఒక మంచి విజయంతో నా ప్రయాణం ప్రారంభం కావటం సంతోషంగా ఉంది. ఇంత మంచి సినిమాలో నన్ను భాగం చేసిన గీతాఆర్ట్స్ సంస్థకు, దర్శకుడు అంజి కె.మణిపుత్రకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.

స్కూల్, కాలేజీల్లో డ్రామాల్లో నటించి నటనపై మక్కువ పెంచుకున్న నయన్‌కు ముందు నుంచీ హీరోయిన్ కావాలనేది కోరిక.

ఆయ్’ సినిమాలో నటించాలని మేకర్స్ కోరినప్పుడు నటిగా తన కల నేరవేరుతోందని చాలా సంతోషపడింది.

‘‘ఆయ్’ షూటింగ్‌కు ముందు నార్నే నితిన్‌తో కలిసి రిహార్సల్స్, వర్క్ షాప్స్‌లో పాల్గొంది.

తర్వాత షూటింగ్‌లో పాల్గొంటూనే ఫైనలియర్ డిగ్రీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యింది.

‘ఆయ్’ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లను కలుసుకున్నారు. వీళ్లు నయన్ సారిక నటనను ప్రశంసించారు.

‘‘సినిమాలో చాలా ఈజ్‌తో నటించానని ఎన్టీఆర్‌గారు అభినందించారు.

అల్లు అర్జున్‌గారైతే నన్ను దక్షిణాది అమ్మాయి అనే అనుకున్నారు.

కాదని తెలిసి అంత చక్కగా పాత్రలో ఒదిగిపోయినందుకు ఆశ్చర్యపోయారు. కళ్లతో చక్కగా హావభావాలను పలికిస్తానని అల్లు అరవింద్‌గారు ప్రశంసించారు.

అంత పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు రావటం నాకెంతో గొప్పగా అనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది నయన్ సారిక.






