

బంధువుల పెళ్లిలో సందడి చేసిన నమ్రతా శిరోద్కర్.. సతీసమేతంగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్

టాలీవుడ్ సినీ తారలంతా ప్రస్తుతం పెళ్లిళ్లతో బిజీగా ఉన్నారు.

మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, సితార తాజాగా బంధువుల పెళ్లికి హాజరయ్యారు.

వీరితో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా సతీసమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.









