performance
-
లాజిస్టిక్స్‌లో టాప్–25లో భారత్
న్యూఢిల్లీ: వేగవంతమైన వస్తు రవాణా, వ్యయాల తగ్గింపునకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీల మద్దతుతో రవాణా రంగ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ స్థానం మెరుగుపడనుంది. ‘ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచిక’లో 2030 నాటికి భారత్ టాప్–25 దేశాల్లో ఒకటిగా ఉంటుందని ఒక అధ్యయనం అంచనా వేసింది. ఈఏసీ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ సాయంతో మెస్సే స్టట్గార్ట్ ఇండియా (అంతర్జాతీయ ప్రదర్శన సంస్థ) అధ్యయనం నిర్వహించి, ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నెల 13–15 మధ్య ముంబైలో అంతర్జాతీయ లాజిస్టిక్స్ ఎగ్జిబిషన్ ‘లాగిమ్యాట్ ఇండియా 2025’ సదస్సుకు ముందు దీన్ని విడుదల చేయడం గమనార్హం. ప్రపంచబ్యాంక్ లాజిస్టిక్స్ పనితీరు సూచీలో (ఎల్పీఐ) 139 దేశాలకు గాను భారత్ ప్రస్తుతం 38వ స్థానంలో ఉండగా, 2030 నాటికి టాప్–25లో చేరాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం విధించుకుంది. పీఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున రవాణా వసతుల అభివృద్ధిని చేపట్టడం ఈ లక్ష్యం సాధనకు ఉపకరిస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. నివేదికలోని అంశాలు.. → భారత ఫ్రైట్, లాజిస్టిక్స్ మార్కెట్ ఏటా 8.8 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 2029 నాటికి 484.43 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. 2024 నాటికి ఇది 317.26 బిలియన్ డాలర్లుగా ఉంది. → అంతర్జాతీయ లాజిస్టిక్స్ కేంద్రంగా మారే విషయంలో భారత్ చాలా వేగంగా అడుగులు వేస్తోంది. → ప్రస్తుతం భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయాలు జీడీపీలో 13–14 శాతంగా ఉండగా, 2030 నాటికి ఒక అంకెకు తగ్గించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. మౌలిక వసతులను ఇతోధికం చేయడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా దీన్ని సాధించాలనుకుంటోంది. → హైస్పీడ్ రహదారులు, హైపర్‌లూప్‌లు, కొత్త విమానాశ్రయాలు.. ఇలా బహుళ నమూనాల ద్వారా రవాణా సమయాన్ని 66 శాతం తగ్గించి, లాజిస్టిక్స్ పోటీతత్వాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఉంది. → జపాన్ను అధిగమించి 2026 నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ చేరనున్నట్టు అంచనాలున్నాయి. ఇందుకు పీఎం గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ తదితర బలమైన విధానాల మద్దతు అవసరం ఎంతో ఉంది. → పీఎం గతిశక్తి కింద కేంద్రం రూ.11.17 లక్షల కోట్లతో 434 ప్రాజెక్టులను చేపట్టింది. తద్వారా లాజిస్టిక్స్ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఉంది.ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం అవసరం.. ‘‘వినూత్నమైన పరిష్కారాలు, అత్యాధునిక టెక్నాలజీతో మౌలిక సదుపాయాల పరంగా అంతరం తొలగించడం ద్వారా అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజంగా భారత్ అవతరించొచ్చు. ఇందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం సమన్వయంతో కలసి పనిచేయడం ఎంతో అవసరం’’అని ఈ నివేదిక సూచించింది. -
హెడ్‌కు ‘బోర్డర్ మెడల్’
మెల్బోర్న్: ఆ్రస్టేలియా క్రికెట్ బోర్డు (సీఏ) తమ ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనకు ఇచ్చే వార్షిక అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడిగా ట్రవిస్ హెడ్ ఎంపికయ్యాడు. గత ఏడాది కాలంలో ఆసీస్‌కు కీలక విజయాలు అందించిన హెడ్ ‘అలెన్ బోర్డర్ మెడల్’ను గెలుచుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1427 పరుగులు సాధించిన హెడ్... అవార్డు కోసం జరిగిన ఓటింగ్‌లో 208 ఓట్లతో అగ్ర స్థానంలో నిలవగా, హాజల్‌వుడ్‌కు రెండో స్థానం (158) దక్కింది. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో 141 బంతుల్లో 140 పరుగులు చేసిన హెడ్ ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. వన్డేల్లో అత్యుత్తమ ఆటగాడి అవార్డు కూడా హెడ్కే దక్కడం విశేషం. ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా హాజల్‌వుడ్, ఉత్తమ టి20 క్రికెటర్‌గా ఆడమ్ జంపా నిలిచారు. ‘బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా స్యామ్ కొన్‌స్టాస్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న కారణంగా ఆస్ట్రేలియా జట్టు పురుషుల క్రికెటర్లు ఎవరూ ఈ అవార్డులను అందుకోలేకపోయారు. మహిళల విభాగంలో అత్యుత్తమ క్రికెటర్‌గా అనాబెల్ సదర్లాండ్ నిలిచింది. ఓటింగ్‌లో యాష్లీ గార్డ్నర్ (143 పాయింట్లు)ను వెనక్కి నెట్టిన సదర్లాండ్ (168) ప్రతిష్టాత్మక ‘బెలిండా క్లార్క్ అవార్డు’కు ఎంపికైంది. గత ఏడాదిలో దక్షిణాఫ్రికాతో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన అనాబెల్... ఎంసీజీలో టెస్టు సెంచరీ బాదిన (ఇంగ్లండ్‌పై) తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మహిళల వన్డేల్లో ఉత్తమ క్రికెటర్ అవార్డు యాష్లీ గార్డ్నర్ గెలుచుకోగా, ఉత్తమ టి20 ప్లేయర్ పురస్కారం బెత్ మూనీకి దక్కింది. ఆ్రస్టేలియా క్రికెట్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మైకేల్ క్లార్క్, మైకేల్ బెవాన్, క్రిస్టీనా మాథ్యూస్ చోటు దక్కించుకున్నారు. -
పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు
ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థంగా పని చేసేందుకు వీలుగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బ్యాంకులను సారథ్యం వహిస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, హోల్‌టైమ్ డైరెక్టర్ల పనితీరును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్ఐ)’లో సవరణలు చేస్తున్నట్లు ప్రకటించింది.పీఎల్ఐ అందుకోవాలంటే అర్హతలురిటర్న్ ఆన్ అసెట్స్ (ఆర్‌ఓఏ): బ్యాంకులకు పాజిటివ్ ఆర్‌ఓఏ ఉండాలి. మొత్తం బ్యాంకు మిగులుపై మెరుగైన రాబడులుండాలి.ఎన్పీఏ: నికర నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.5 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం 25 బేసిస్ పాయింట్లు ఎన్పీఏ తగ్గించాలి.కాస్ట్ టు ఇన్కమ్ రేషియో (సీఐఆర్): సీఐఆర్ 50% లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల మధ్య నిష్పత్తిని అది సూచిస్తుంది. ఒకవేళ ఇది 50 శాతం కంటే ఎక్కువగా ఉంటే ఏడాదిలో మెరుగుదల చూపించాలి.ప్రోత్సాహకాలు.. ఇతర వివరాలునిబంధనల ప్రకారం బ్యాంకులు మెరుగ్గా పనితీరు కనబరిస్తే వారి సారథులకు పీఎల్ఐలో భాగంగా ఒకే విడతలో నగదు చెల్లిస్తారు. లేటరల్ నియామకాల్లో వచ్చిన వారు, డిప్యుటేషన్ పై ఉన్న అధికారులు సహా స్కేల్ 4, ఆపై అధికారులు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగం నుంచి తొలగించిన వారు దీనికి అనర్హులు.ఇదీ చదవండి: రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!2023-24 ఆర్థిక సంవత్సరం పనితీరును పరిగణనలోకి తీసుకుని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31 నాటికి బ్యాంకు ఆడిట్ చేసిన గణాంకాల ఆధారంగా పనితీరును లెక్కించనున్నారు. -
కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహమాన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌లు తమ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచార సభల్లో పాల్గొంటూ, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఓ సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా జరగబోయే ఒక ప్రచార సభలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఇవ్వనున్నారని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) అనే నిధుల సేకరణ బృందం ప్రకటించింది. కాగా ఈ కార్యక్రమ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఏఏపీఐ తెలిపింది. ఈ విషయమై ఏఆర్ రెహమాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే తేదీ నిర్ణయించిన తరువాత రెహమాన్ నుండి ప్రకటన రావచ్చని అంటున్నారు. కమలా హారిస్‌కు మద్దతుగా రెహమాన్ సంగీత కార్యక్రమం జరగబోతున్నదనే వార్త వెలువడగానే ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంతో కమలా హారిస్ ఓటర్ల నుంచి మరింత ఆదరణ పొందగలరని పలువురు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస -
ఉత్తముల లక్షణం
తమ ప్రతిభని ఎవరు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రదర్శిస్తారు ఉత్తములు. అంతే కాని తమకి ఉన్న పాండిత్యాన్ని అంతా ఎవరి వద్ద పడితే వారి వద్ద ప్రదర్శించరు.ఒకటవ తరగతి చదివే పిల్లలకి వ్యాకరణం బోధిస్తే కంగారు పడి మళ్ళీ దాని జోలికి వెళ్ళటానికి ఇష్టపడరు. వారికి అక్షరాలు చాలు. అంత మాత్రానికే తమకి ఎంతో తెలుసు అనుకుంటారు. తనకి ఎంత తెలుసు అని కాదు, ఎదుటివారికి ఏమి కావాలి? ఎంత వరకు అర్థం చేసుకోగలరు? అన్నది ప్రధానం. ఈ మాట తుంబురుడి గాన విద్యా ప్రావీణ్యం చూసిన నారదుడు అనుకున్నది. ఒక పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థుల కోసం పాడ మంటే రాగం, తానం, పల్లవి ఆలపిస్తే వారు జన్మలో శాస్త్రీయ సంగీతం జోలికి వెళ్లరు. అయినా ప్రతివారి వద్ద తమ ప్రతిభని ప్రదర్శించ వలసిన అవసరం లేదు. చెవిటి వాడి ముందు శంఖం ఊదితే కొరుకుడు పడటం లేదా? సహాయం చేయనా? అని అడుగుతాడు. అంతేకాదు ఎవరి వద్ద క్లుప్తంగా చె΄్పాలి, ఎవరి వద్ద వివరంగా చె΄్పాలి అన్నది కూడా తెలియ వలసిన అవసరం ఉంది. మాట నేర్పరితనంలో ఇది ప్రధానమైన అంశం. దీనికి హనుమ గొప్ప ఉదాహరణం. సీతాదేవిని చూచి వచ్చిన హనుమ తన కోసం ఎదురు చూస్తున్న అంగదాదులతో ముందుగా ‘చూడబడినది నా చేత సీత’ అని క్లుప్తంగా చెప్పి, సావకాశంగా కూర్చొన్న తరువాత వారి కోరిక పైన తాను బయలుదేరిన దగ్గరనుండి ఆ క్షణం వరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు చె΄్పాడు. అందులో తన ప్రతాపం చాలా ఉంది. అది అంతా సత్యమే! అది విని ముఖ్యంగా యువరాజు, ఈ బృందనాయకుడు అయిన అంగదుడు, తన శక్తిని గుర్తించి, గుర్తు చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించిన జాంబవంతుడు, కపులు సంతోషిస్తారు. పైగా కపివీరులు అవన్నీ తామే చేసినట్టు ΄÷ంగి ΄ోయారు. అదే విషయం సుగ్రీవ శ్రీరామచంద్రులతో క్లుప్తంగా చె΄్పాడు. వారు తన యజమానులు. వారి వద్ద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారి సమయం విలువైనది. పైగా రాజుల వద్ద దాసులు తమ ఘనత చెప్పుకోకూడదు. అది రాచమర్యాద కాదు. అందుకే తన ప్రతాపం ఎక్కడా మాటల్లో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక్క మాటలో సముద్రం లంఘించి వెళ్ళాను అని తేల్చి వేశాడు. అది మర్యాద మాత్రమే కాదు, వినయశీలత. విరాటరాజు కొలువులో ప్రవేశించటానికి వెడుతున్న పాండవులకు వారి పురోహితుడు ఇచ్చిన సూచనలు అందరికీ ఉపయోగ పడేవే. రాజుకన్న విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించ కూడదు, రాజుగారి భవనాని కన్న పెద్ద, ఎతై ్తన భవనంలో ఉండ కూడదు అన్నవి ఇక్కడ పేర్కొన దగినవి. తమ ఘనత సందర్భానుసారం ప్రకటించాలి. ఎదగటం లేదా ఒదగటం పరిస్థితులను అనుసరించి ఉండాలి. పిడుగుకి బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు ఉండరు తెలివైన వారు. దీనికి చక్కని ఉదాహరణ చెపుతాడు పింగళి సూరన.‘‘ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మీ’’ అని. చెరువులో నీటి మట్టం పెరిగితే తామర కాడ చుట్లు విచ్చుకొని, పువ్వు గాని, మొగ్గ గాని ఆకు గానీ ఉపరితలం మీద తేలుతాయి. నీరు తగ్గితే కాడ చుట్టలు చుట్టుకొని పువ్వు మాత్రమే నీటి ఉపరితలం మీద ఉంటుంది. నీరు ఎండి΄ోతే దుంపలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి ముడుచుకొని ΄ోయి ఉంటుంది. నీరు నిండితే చిగురిస్తుంది. ఉత్తముల గొప్పతనం కూడా అంతే! – డా. ఎన్. అనంతలక్ష్మి -
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశంసలు అందుకున్న బ్యూటీ.. (ఫోటోలు)
-
ఒలింపిక్స్ లో దూసుకుపోతున్న భారత్ అథ్లెట్లు
-
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
తెలంగాణలో సరైన ఫలితాలు రాలేదు: ఖర్గే అసంతృప్తి
సాక్షి,ఢిల్లీ: పార్టీ పవర్లో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం(జూన్8) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.‘అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మంచి ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు రాణించలేదు. ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. అర్జెంటుగా వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఇండియా కూటమి భవిష్యత్తులో కొనసాగాలి. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలి. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకం నిలబెట్టుకోవాలి. నిరంకుషత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారు. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరిగాయి’అని ఖర్గే అన్నారు. -
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. సాంగ్స్‌తో జోష్ నింపిన కేటీ పెర్రీ (ఫోటోలు)
-
అనగనగా ఓ సాగర కన్య (ఫోటోలు)
-
జలన్ కల్రాక్ చేతికి జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ రుణపరిష్కార ప్రణాళికను దివాలా పరిష్కార అపీలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) తాజాగా అనుమతించింది. జలన్ కల్రాక్ కన్సార్షియంకు కంపెనీ యాజమాన్యాన్ని బదిలీ చేసేందుకు ఎన్సీఎల్ఏటీ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బదిలీని 90 రోజుల్లోగా పూర్తిచేయవలసిందిగా జెట్ ఎయిర్వేస్ పర్యవేక్షణ కమిటీకి సూచించింది. దీంతోపాటు పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీగా జలన్ కల్రాక్ కన్సార్షియం(జేకేసీ) చెల్లించిన రూ. 150 కోట్లను సర్దుబాటు చేయమంటూ జెట్ ఎయిర్వేస్ రుణదాతలను ఎన్సీఎల్ఏటీ బెంచ్ ఆదేశించింది. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకి గతంలో విజయవంతమైన బిడ్డర్‌గా జేకేసీ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ఎయిర్వేస్ రుణదాతలు, జేకేసీ మధ్య యాజమాన్య బదిలీపై తలెత్తిన న్యాయ వివాదాలు ఏడాదికాలంగా కొనసాగుతున్నాయి. ఇంతక్రితం కంపెనీ రుణదాతలు ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ జోక్యం చేసుకునేందుకు తిరస్కరించింది. అంతేకాకుండా నిర్ణయాధికారాన్ని ఎన్సీఎల్ఏటీకి అప్పగించింది. ఆర్థిక సవాళ్లతో జెట్ ఎయిర్వేస్ సర్విసులు 2019 ఏప్రిల్ నుంచి నిలిచిపోగా.. 2021లో జేకేసీ విజయవంత బిడ్డర్‌గా నిలిచింది. కాగా.. కోర్టు అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళిక(రూ. 350 కోట్ల ఆర్థిక మద్దతు)లో భాగంగా జెట్ ఎయిర్వేస్కు గతేడాది జలన్ కల్రాక్ కన్సార్షియం రూ. 100 కోట్ల పెట్టుబడులను సమకూర్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది(2024)లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని జెట్ ఎయిర్వేస్ యోచిస్తోంది. -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
అంబానీ-రాధిక ప్రీ-వెడ్డింగ్: ఈ బ్యూటీ సందడి మామూలుగా లేదు (ఫోటోలు)
-
జగన్ మామ.. జగన్ మామ పాటకు.. పరవశించిన రాప్తాడు సభ
-
సీఈవోకే షాక్ ఇచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీ.. రూ.1000 కోట్లు క్యాన్సిల్!
దేశీయ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ దాని సీఈవోకే షాక్ ఇచ్చింది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీగా సేవలందిస్తున్న ఫ్రెష్‌వర్క్స్ డైరెక్టర్ల బోర్డు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన గిరీష్ మాతృబూతంకు 2022లో కేటాయించిన ఆరు మిలియన్ స్టాక్ యూనిట్ల పనితీరు అవార్డును రద్దు చేసింది. ఈ మేరకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పనితీరు లక్ష్యాలలో చేసిన మార్పులే సీఈవో పనితీరు అవార్డును రద్దు చేయడానికి కారణంగా నాస్డాక్-లిస్టెడ్ కంపెనీ అయిన ఫ్రెష్‌వర్క్స్ పేర్కొంది. అయితే 19 మిలియన్ల డాలర్ల (రూ.157 కోట్లు) విలువతో కొత్త వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డుకు సీఈవో గిరీష్ మాతృభూతం అర్హులవుతారని కంపెనీ తెలిపింది. “సీఈవో మాతృభూతం పర్ఫామెన్స్ బేస్డ్ రిస్ట్రిక్టివ్ స్టాక్ యూనిట్స్ అవార్డును రద్దు చేసి 2024లో ఆయనకి వార్షిక దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక అవార్డును అందించాలని నిర్ణయించడంతోపాటు దీర్ఘకాలిక ఈక్విటీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని పెట్టుబడిగా పరిగణించేందుకు కంపెనీ స్టాక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకున్నాం" అని ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. 2023కి ఫ్రెష్‌వర్క్స్ మొత్తం స్టాక్ ఆధారిత పరిహారం ఖర్చు 212 మిలియన్ డాలర్లు. 2021లో కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది. కంపెనీ బోర్డు 6 మిలియన్ స్టాక్ యూనిట్లను ఈసీవో మాతృభూతమ్కు బహుళ-సంవత్సరాల పనితీరు-ఆధారిత పరిమిత స్టాక్ యూనిట్ అవార్డుగా మంజూరు చేసింది. సీఈవో పనితీరు అవార్డు మొత్తం విలువ 131 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు). -
ఎగిరిపోయిన లోహ విహంగాలు
సనత్‌నగర్ (హైదరాబాద్): బేగంపేట విమానాశ్రయం వేదికగా కనువిందు చేసిన వింగ్స్ ఇండియా– 2024 ముగిసింది. చివరి రోజు సెలవు దినం ఆదివారం కావడంతో సందర్శకులు భారీ సంఖ్యలో ఏవీయేషన్ షో తిలకించేందుకు తరలివచ్చారు. సందర్శకుల తాకిడితో ఎయిర్పోర్ట్ సందడిగా మారింది. రన్‌వేపై ప్రదర్శనకు ఉంచిన చిన్నా పెద్దా విమానాలు, హెలికాప్టర్లు, చాపర్లు వీక్షించి మురిసిపోయారు. వినువీధిలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్, గ్లోబల్ స్టార్స్‌కు చెందిన మార్క్‌జెఫర్స్ బృందం లోహ విహంగాలతో చేసిన చిత్ర విన్యాసాలతో పులకించిపోయారు. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో కొలువుదీరిన విశేషాలెన్నో వీక్షించి తరించారు. ఏవియే షన్ రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచీ సందర్శకులు పోటెత్తా రు. ఏవియేషన్ షోలో అడుగడుగునా తిరిగి అద్భుతాలను ఆస్వాదించారు. నింగిలో ‘హృదయ’పూర్వకంగా రంగు రంగుల ముగ్గులను వే స్తూ కనురెప్పలను వాల్చనీయకుండా చేసిన ఏరో »ొటిక్స్ అంతులేని అనుభూతులను మిగిల్చాయంటూ తమ మనోభావాలను వెల్లడించారు. చివరి రోజు వరకు ఉన్న విమానాలు... బిజినెస్ డేస్‌గా చెప్పే మొదటి రెండు రోజుల పాటు కనువిందు చేసిన అనంతరం సాధారణంగా ‘షో’ నుంచి చాలావరకు ని్రష్కమిస్తాయి. కానీ ఈ సారి ఆఖరి రోజు వరకు రెండు, మూడు చిన్న విమానా లు తప్ప మిగతావన్నీ రన్‌వే పై కొలువుదీరి ఉండి సందర్శకులను కనువిందు చేశాయి. షోకు హైలెట్ గా నిలిచిన బోయింగ్ 777ఎక్స్, ఎ యిర్‌బస్, ఎయి ర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో కార్గో విమానాలు చివరి క్షణం వరకు ఉండి ఆనందాన్ని రెట్టింపు చేశాయి. ఆదివారం షో ముగియడంతో బై..బై అంటూ గాలిలో ఎగిరిపోయాయి. సారంగ్, మార్క్‌జెఫర్స్ బృందాలకు సెల్యూట్ నాలుగు రోజుల పాటు గ‘ఘన’విన్యాసాలతో సందర్శకులకు వినోదంతో పాటు మధురానుభూతులను పంచిన సారంగ్ టీమ్, మార్క్‌జెఫర్స్ బృందానికి భాగ్యనగరం సెల్యూట్ చేసింది. నింగిలో ‘హృదయా’ంతరాలు మురిపించేలా ఏరో»ొటిక్స్ చేసిన బృంద సభ్యులతో సందర్శకులు ఫొటోలు దిగారు. వారి ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు. హైదరాబాద్ సందర్శకులు తమపై చూపించిన ఆప్యాయతకు ఆ బృందాలు కూడా ఆనందాన్ని వ్యక్తపరిచాయి. ఈ సారి కి బై బై అంటూ..మళ్ళీ రెండేళ్ళకు కలుసుకుందాం అంటూ హైదరాబాదీయులకు వీడ్కోలు పలికిన ఏరో»ొటిక్స్ బృందాలు ఏవియేషన్ షో నుంచి వెనుదిరిగాయి. -
‘అచీవర్’ ఆంధ్రప్రదేశ్.. కేంద్ర ప్రభుత్వ సూచికలో టాప్!
వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. సరకు రవాణా రంగంలో అద్భుత పనితీరుతో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్‌గా అవతరించింది. సరకు రవాణాలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతల పనితీరుపై రూపొందించిన లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అచీవర్‌లుగా వర్గీకరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచింది. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి అవసరమైన లాజిస్టికల్ సేవల్లో ఆయా రాష్ట్రాల సామర్థ్యాన్ని ఈ సూచిక తెలియజేస్తోంది. కాగా లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్‌లో అచీవర్స్ తర్వాత ఫాస్ట్ మూవర్స్ కేటగరిలో కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలు నిలిచాయి. గోవా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఆస్పైరర్స్ కేటగిరీలో ఉన్నాయి. రాష్ట్రాల్లో సరకు రవాణా సేవలకు కల్పిస్తున్న అనుకూల పరిస్థితుల ఆధారంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ర్యాంకింగ్ ఇచ్చింది. -
ఏపీ సర్కారు పనితీరుపై కేంద్రం ప్రశంస
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరడంలో మెరుగ్గా ఉందనే విషయాన్ని గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావ్ కరాద్ ఏపీ సర్కారు తీరును మెచ్చుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి బుగ్గన అధ్యక్షతన 224వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన మాట్లడుతూ.. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.1.68 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా బ్యాంకర్లను ప్రత్యేకంగా బుగ్గన అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ ప్రణాళిక లక్ష్యం గతేడాది (రూ.1.40 లక్షల కోట్లు) కన్నా 20 శాతం ఎక్కువగా అంటే.. రూ.1.68 లక్షల కోట్లు నమోదు చేయడం శుభపరిణామమన్నారు. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈలకు విరివిగా రుణాలివ్వాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. పీఎం ముద్ర, స్టాండప్ ఇండియా తదితర పథకాలకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు మరింత దృష్టి సారించాలని కోరారు. వీధి, చిరు వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు, ఆత్మనిర్భర్ నిధి, పీఎం ఎఫ్ఎమ్ఈ పథకాల ద్వారా చిరు వ్యాపారులకు రుణాలిచ్చేందుకు మరింత ప్రాధాన్యతనివ్వాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆయా పథకాల అమలులో ఎక్కువ జాప్యం లేకుండా దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకానికి 8వ తరగతి అర్హత, ఒక జిల్లా ఒక వస్తువు వంటివి తొలగించడం వంటి అంశాలను సరళతరం చేసిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ రుణ సదుపాయం కల్పించడంలో వేగం పెంచాలన్నారు. ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇందులో పాలుపంచుకోవాలన్నారు. కౌలు రైతులకు మరింత సహకారం జూన్ నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 67,422 మంది కౌలు రైతులకు రూ.517.86 కోట్ల ఆర్థిక సాయం అందించినట్టు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగనన్న నగర్లలో గృహ నిర్మాణం చేసుకునే వారికి రుణ సదుపాయం కల్పించే లక్ష్యం రూ.2,464.72 కోట్లు (60 శాతం) చేరామన్నారు. సిబిల్ స్కోర్, వయసు తదితర కారణాలతో ఎక్కువ దరఖాస్తులు పక్కన పెడుతున్నారని.. బ్యాంకర్లు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యం చేరడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. రైతులకు మరిన్ని రుణాలివ్వాలి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రైతులకు మరిన్ని రుణాలందించడం ద్వారా చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. జగనన్న పాలవెల్లువ పథకంలో పాడి రైతులకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలను విజయవంతగా అమలు చేస్తోందని కొనియాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో ప్రభుత్వానికి తమవంతు సహకారం అందించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. కౌలు రైతులు, స్వయం సహాయక సంఘాలకు మరింత తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు మరింత సహకరించాలని కోరారు. జగనన్న గృహ నిర్మాణ కాలనీలకు రానున్న నాలుగైదు నెలల్లో నూరు శాతం రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం ఎం.రవీంద్రబాబు, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, యూబీఐ జీఎం గుణానంద్ గామి, ఏసీఎం రాజుబాబు పాల్గొన్నారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ తగ్గించండి స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకూ రూ.4,286 కోట్లను రుణాలుగా ఇచ్చినట్టు మంత్రి బుగ్గన చెప్పారు. దీనిని మరింత పెంచాలని కోరారు. రూ.3 లక్షల వరకూ డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ కార్యక్రమాల ద్వారా పేద మహిళలకు వడ్డీ భారం తగ్గించే అంశంపైనా చొరవ చూపాలన్నారు. -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
100 జీఈఆర్‌ను నిజాయితీగా సాధించాలి
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్లు 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించారని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. నంద్యాల జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన పలు పాఠశాలల పనితీరును పరిశీలించారు. బనగానపల్లిలోని వలంటీర్లు తమ పరిధిలోని గృహాల్లో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు చేయించారు. దీంతో ఈ వలంటీర్లకు యాప్ ద్వారా బ్యాడ్జి వచ్చిది. వీరు తమ పరిధిలో ఒకటికి రెండుసార్లు డేటాను పరిశీలించి.. ‘నా సర్వే సరైంది.. ఇది నా చాలెంజ్.. మిషన్ జీఈఆర్ 100 శాతం ఆంధ్రా’ అనే క్యాప్షన్‌తో బ్యాడ్జి స్క్రీన్‌షాట్‌ను వారి వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. వీరి సవాలును స్వీకరించిన మిగతా 60 వేల మంది వలంటీర్లు కూడా తమ పరిధిలోని డేటాను మరోసారి తనిఖీ చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. నూరు శాతం జీఈఆర్‌ను నిజాయితీ, నిబద్ధతతో సాధించాలన్నారు. -
పోలీసు సేవలకు సలాం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఏపీ పోలీసులకు మంగళవారం విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినో త్సవంలో సీఎం జగన్ పతకాలు అందజేశారు. 2021, 2022, 2023కు సంబంధించి 65 మంది పో లీసులు కేంద్రం పరిధిలో ప్రకటించిన ప్రెసిడెంట్ పో లీస్ మెడల్(పీపీఎం), పోలీస్ మెడల్ మెరిటోరియస్ సర్విస్(పీఎం), పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ (పీ ఎంజీ), అసాధారణ్ ఆసూచన కుశ లత పదక్‌తో పా టు ముఖ్యమంత్రి శౌర్య పతకాలను అందుకున్నారు. పీపీఎం 2021–22: భావనాసక్సేనా (జాయింట్ సె క్రటరీ, విదేశాంగ శాఖ, న్యూఢిల్లీ), వెంకటరామిరెడ్డి, (ఐజీపీ–శిక్షణ), పి.సీతారాం(గ్రేహౌండ్స్ క మాండెంట్), ఎన్.సుధాకర్‌రెడ్డి (ఎస్డీపీఓ, పలమనేరు) పీఎం 2021–22: ఎస్వీ రాజశేఖరబాబు (డీఐజీ, లా అండ్ ఆర్డర్), ఎం.రవీంద్రనాథ్‌బాబు(ఏఐజీ, లా అండ్ ఆర్డర్), కె.రఘువీర్‌రెడ్డి(ఎస్పీ, నంద్యాల), కేఎస్వీ సుబ్బారెడ్డి(కమాండెంట్, 6 బెటాలియన్), కె.నవీన్‌కుమార్(ఏఎస్పీ, గ్రేహౌండ్స్), కె.సుబ్రహ్మ ణ్యం (ఏడీసీపీ, విశాఖ), వి.వి.నాయుడు(ఏసీపీ దిశ, విజయవాడ), సీహెచ్.రవికాంత్ (ఏసీపీ, ఎస్బీ విజ యవాడ), జి.రవికుమార్(డీఎస్పీ, సీఐడీ), కె.వి.రా జారావు, (డీఎస్పీ పీటీఓ), జె.శ్రీనివాసులురెడ్డి (ఎస్ డీపీఓ, నెల్లూరు), వి.శ్రీరాంబాబు(డీఎస్పీ, సీఐడీ), కె.విజయపాల్ (ఎస్డీపీఓ, రాజమండ్రి), సి.శ్రీనివాసరావు (డీఎస్పీ దిశ, ప్రకాశం), జి.వీరరాఘవరెడ్డి (ఎస్డీపీఓ, మార్కాపురం), వై.రవీంద్రరెడ్డి (ఏఆర్ డీఎస్పీ, తిరుపతి), పి.వి.హనుమంతు(అసిస్టెంట్ క మాండెంట్, 6వ బెటాలియన్), బి.విజయ్‌కుమార్ (అసిస్టెంట్ కమాండెంట్, గ్రేహౌండ్స్), బి.గుణరా ము (సీఐ, విజయవాడ), ఎం.కోటేశ్వరరావు (ఎస్ఐ, శ్రీకాకుళం), జి.కృష్ణారావు(ఎస్ఐ, విజయవాడ), ఆర్.రామనాథం, (ఆర్ఎస్ఐ, విజయవాడ), ఇ.శివశంకర్‌రెడ్డి (ఆర్ఎస్ఐ, 2వ బెటాలియన్), ఎం.వెంకటేశ్వర్లు(ఏఆర్ఎస్ఐ, నెల్లూరు), ఎస్.సింహాచలం (ఏఆర్ఎస్ఐ, 3వ బెటాలియన్), టి.నరేంద్రకుమార్ (ఏఎస్ఐ, గుంటూరు), పి.భాస్కర్(ఏఎస్ఐ, కడప), ఎన్.శ్రీనివాస్(ఏఎస్ఐ, కొవ్వూరు), ఎస్.వీరాంజనేయులు(ఏఎస్ఐ, విజయవాడ). పీఎంజీ 2021: ఆర్.రాజశేఖర్ (డీఏసీ), సీహెచ్.సాయిగణేశ్ (డీఏసీ), కె.పాపినాయుడు (ఎస్ఐ, అనకాపల్లి), డి.మబాషా (ఏఏసీ), టి.కేశవరావు(హెచ్‌సీ, ఎస్ఐబీ), ఎం.మునేశ్వరరావు (గ్రేహౌండ్స్ ఎస్సీ), గ్రేహౌండ్స్ జేసీల్లో ఎస్.బుచ్చిరాజు, జి.హరిబాబు, బి.చక్రధర్, ఎం.నాని, పి.అనిల్ కుమార్. అసాధారణ్ ఆసూచన కుశలత పదక్ 2022: సి.శ్రీకాంత్ (ఐజీపీ, సీఐడీ), ఎ.బాబ్జీ (ఎస్ఐబీ, ఎస్పీ), ఇ.జి.అశోక్ కుమార్(ఏఎస్పీ, ఎస్ఐబీ), ఎ.వెంకటరావు(డీఎస్పీ, తీవ్రవాద విభాగం, విశాఖ), కె.నిరీక్షణరావు(ఎస్ఐ, ఎస్ఐబీ). ముఖ్యమంత్రి శౌర్య పతకం(2023): బి.సుధాకర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్), కె.విజయశేఖర్ (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐబీ), కె.హరీష్ (ఆర్ఎస్ఐ), పి. రమేశ్(ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ), టి.రవికుమార్(ఎస్ఐ, గ్రేహౌండ్స్), గ్రేహౌండ్స్ ఆర్ఎస్ఐలు టి.సత్యనారా యణ, పి.సతీశ్‌కుమార్, సీహెచ్.శివ, గ్రేహౌండ్స్ ఎ స్పీలు షామలరావు, రవి, నాగరాజు, గ్రేహౌండ్స్ జే సీలు ఎస్కే కరీం బాషా, బి.వాసుదేవ రెడ్డి, సయ్యద్ హబీబుల్లా, ఎస్.సిద్దయ్య, ఎం.గౌరునాయుడు. -
శుభమన్ గిల్, రవీంద్ర జడేజా వద్దు ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
-
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
బిల్డప్ బాబాయ్.. ఒక్క మ్యాచ్‌లో అయినా ఆడు నాన్న
-
Viral Video: టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. వినూత్న డ్రమ్స్ తో అదరగొట్టేశాడు
-
కిం కర్తవ్యం?
ఏడాది వ్యవధిలో జరిగిన గత టి20 ప్రపంచకప్‌కు, ఈ సారి టి20 ప్రపంచకప్ మధ్య భారత జట్టు ప్రదర్శనలో తేడా ఏముంది... నాడు గ్రూప్ దశలో వెనుదిరగ్గా, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సెమీస్ వరకు రాగలిగింది. నాకౌట్‌కు చేరామనే విషయం, పాక్‌పై గెలవడం తప్ప ఓవరాల్‌గా ఆటలో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. ఈ రెండు వరల్డ్‌కప్‌ల మధ్య 35 అంతర్జాతీయ టి2ంలు ఆడిన టీమిండియా ఏకంగా 26 గెలిచి జోరుగా ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. కానీ తుది ఫలితం మాత్రం నిరాశాజనకం. ఈ నేపథ్యంలో వచ్చే వరల్డ్‌కప్‌లో జట్టు రూపురేఖల్లో ఏదైనా మార్పు ఉండవచ్చా, రెండేళ్ల కోసం ఏమైనా కొత్త ప్రయోగాలు ఉంటాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశం. అంతర్జాతీయ క్రికెట్లో ఒక మెగా ఈవెంట్ ముగిసిన తర్వాత అన్ని జట్లలో సహజంగానే కొందరి కెరీర్లు ముగుస్తాయి. మంచి విజయాలతో సంతృప్తిగా ముగించేవారు ఒక వైపు...నిరాశగా ఇక సాధించేందుకు ఏమీ లేదని భావనతో మరి కొందరు ఆటకు దూరమవుతారు. ఈ రకంగా చూస్తే టోర్నీలో ఆడిన భారత ప్రస్తుత జట్టు ఎలా ఉండబోతోంది. మున్ముందు కుర్రాళ్లకు ఎలాంటి అవకాశం దక్కుతుంది. ఆటగాళ్ల టి20 ఫార్మాట్ రిటైర్మెంట్పై ఇప్పుడే మాట్లాడటం సరి కాదంటూ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దాటవేసినా... వాస్తవం చూస్తే ఈ ఫార్మాట్లో పలు మార్పులు మాత్రం ఖాయం. ఇద్దరు స్టార్లూ కష్టమే... కోహ్లి, రోహిత్ స్టార్లు కావచ్చు గాక...కానీ రెండేళ్ల తర్వాత జరిగే టి20 వరల్డ్ కప్ వరకు వారు కొనసాగడం సందేహమే. బీసీసీఐ మరీ కఠినంగా వ్యవహరించకపోవచ్చు గానీ వాస్తవం చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. 2024 సమయానికి రోహిత్‌కు 37, కోహ్లికి 36 ఏళ్లు ఉంటాయి. రోహిత్ ఇప్పటికే ఫిట్నెస్పరంగా చాలా వెనుకబడి ఉన్నాడు. కెప్టెన్‌గా ఈ సారి దక్కిన అవకాశం ఉపయోగించుకోలేకపోయాడు. పైగా ఆటగాడిగా కూడా విఫలమయ్యాడు. రోహిత్ కెరీర్‌కు సంబంధించి వన్డే వరల్డ్ కప్ ఒక లక్ష్యంగా మిగిలింది. ఇప్పటికిప్పుడు కెప్టెన్సీ మార్పు కూడా ఉండదు కాబట్టి వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో జట్టును గెలిపిస్తే అతను దిగ్గజాల్లో ఒకడిగా నిలిచిపోతాడు. కాబట్టి పూర్తి ఫోకస్ వన్డేలపైనే ఉండవచ్చు. రెండేళ్ల తర్వాత మళ్లీ టి20 కెప్టెన్సీ చేయాలనే ప్రేరణ అతనికి ఏమీ కనిపించడం లేదు. కోహ్లికి ఫిట్నెస్ సమస్య లేదు కానీ అతను కూడా ఈ ఫార్మాట్లో చాలా సాధించేశాడు. వరల్డ్ కప్ విజేత జట్టులో భాగం కాకపోయినా అదేమీ అతని గొప్పతనాన్ని తగ్గించదు. పైగా వన్డేల్లో ‘ఆల్‌టైమ్ గ్రేట్’లలో ఒకడైన కోహ్లికి స్వదేశంలో వన్డే వరల్డ్ కప్‌లో అసాధారణ ప్రభావం చూపించగలడు. బీసీసీఐ అంతర్గత సమాచారం ప్రకారం వీరిద్దరు ఐపీఎల్‌కు మాత్రం పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన చేయకపోవచ్చు గానీ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సిరీస్‌లకు దూరమవుతూ వస్తారు. రాహుల్‌పై వేటు పడుతుందా! తర్వాతి రెండు సిరీస్‌లలో పేర్లను పరిశీలించకపోవడంతో అశ్విన్, దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ టి20 కెరీర్ ముగిసినట్లే అని చెప్పవచ్చు. సుదీర్ఘ విరామం తర్వాత గత వరల్డ్‌కప్‌కు ముందు అనూహ్యంగా అశ్విన్ పునరాగమనం చేయగా, ఐపీఎల్ ప్రదర్శనతో ఫినిషర్ కార్తీక్ కెరీర్ చివర్లో మళ్లీ దూసుకొచ్చాడు. అయితే వీరిద్దరితో కొత్తగా ప్రయత్నించేందుకు ఏమీ లేదు కాబట్టి ఫార్మాట్‌నుంచి తప్పుకోవడం ఖాయం. ఆఖరి నిమిషంలో జట్టుతో చేరిన మొహమ్మద్ షమీ టి20 కెరీర్ కూడా ఇక ముందుకు వెళ్లదు. రాహుల్ పరిస్థితి మాత్రం కాస్త సందేహాస్పదంగా ఉంది. అటు పూర్తిగా తప్పుకోలేడు, ఇటు గొప్పగా ఆడటం లేదు...ఇలాంటి స్థితిలో అతనిపై వేటు పడవచ్చు. అయితే దేశవాళీ, ఐపీఎల్లో మళ్లీ చెలరేగితే పునరాగమనం కూడా సాధ్యమే. కొత్త పేస్ బౌలర్లు పోటీనిస్తూ దూసుకొస్తున్న తరుణంలో భువనేశ్వర్ కుమార్ తన సాధారణ ప్రదర్శనతో ఇంకా ఎంత వరకు జట్టులో కొనసాగగలడో చూడాలి. వచ్చేది ఎవరు? రెండేళ్ల తర్వాత పూర్తిగా భిన్నమైన జట్టును మనం చూడవచ్చు. తొలి బంతినుంచి దూకుడు ప్రదర్శిస్తూ విధ్వంసక శైలి ఆటగాళ్లు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. పృథ్వీ షా, సంజు సామ్సన్ ఎలాంటి ప్రత్యర్థిపైనైనా చెలరేగగలరు. పంత్ దూకుడు గురించి అందరికీ తెలుసు. కివీస్‌తో సిరీస్‌కు ఎంపికైన శుబ్‌మన్ గిల్ ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మెరుపు సెంచరీతో సత్తా చాటారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ సరిగ్గా సరిపోతాడు. పేస్ విభాగంలోనైతే ఉమ్రాన్ మొదలు మొహసిన్ వరకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. బుమ్రా ఎలాగూ మళ్లీ జట్టులో చేరతాడు. మరో వైపు 32 ఏళ్ల సూర్యకుమార్ కెరీర్ ఉచ్ఛదశలో ఉన్నాడు కాబట్టి వచ్చే రెండేళ్ల ప్రణాళికలో కూడా అతను భాగం కావడం ఖాయం. భవిష్యత్తును బట్టి చూస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అన్ని వైపులనుంచి మద్దతు లభించవచ్చు. ఆల్‌రౌండర్‌గా తన విలువను ప్రదర్శిస్తున్న అతను రోహిత్ లేని సమయంలో కెప్టెన్‌గా కూడా రాణిస్తున్నాడు. పైగా ఐపీఎల్లో తొలి సారే గుజరాత్‌కు విజేతగా నిలిపిన రికార్డూ ఉంది. కొత్త ప్రణాళికలు, వ్యూహాలు కూడా వంద శాతం ఫలితాలిస్తాయని ఎవరూ చెప్పలేరు. అయితే సెమీస్‌లో ఇంగ్లండ్ ఆట చూస్తే టి20లు ఎలా ఆడాలో తెలుస్తుంది. ఆరంభంలో వికెట్లు కాపాడుకొని చివర్లో పరుగులు రాబట్టగలమనే ఆలోచనకన్నా... ఆసాంతం ధాటిని ప్రదర్శించి కొన్ని ఓటము లు ఎదురైనా నష్టం లేదు. పవర్‌ప్లేలో పవర్ఫుల్ ఆట చూపించే ఇదే దూకుడు సరైన సమయంలో జట్టుకు సత్ఫలితాలు అందించడం మాత్రం ఖాయం. భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) ప్రకారం భారత జట్టు వచ్చే ఏడాది కేవలం 12 టి20లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. 2023లో వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానికి సన్నాహకంగా అన్నట్లు 25 వన్డేల్లో టీమిండియా బరిలోకి దిగుతుంది. –సాక్షి క్రీడావిభాగం -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం వేలం వెర్రేనా? సర్వేలో ఏం చెప్పారంటే?
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రధానంగా భద్రత, పనితీరుకే ప్రాధాన్య మిస్తున్నారు. ఈ వాహనాలు తరచూ అగ్నిప్రమాదాలకుగురవుతుండటంతో..ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే విషయంలోవెనక్కి తగ్గుతున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటరు భద్రత, పనితీరుపై తమకు అంతగా నమ్మకం లేదనే వారి సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 32 శాతానికి పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది కేవలం 2 శాతంగా నమోదైంది. 292 జిల్లాల్లోని 11,000 మంది పైచిలుకు వినియోగదారుల నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా ఈ సర్వే నివేదిక రూపొందించారు. ఇందులో 47 శాతం మంది పెద్ద నగరాలు, 33 శాతం మంది ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందినవారు కాగా.. 20 శాతం మంది తృతీయ శ్రేణి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు డజన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) అగ్నిప్రమాదాలకు గురైన ఉదంతాలు నమోదయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా లోపాలున్న వాహనాల బ్యాచ్‌లను వెంటనే ఉపసంహరించాలని లేదా భారీ జరిమానా విధించాల్సి వస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 21న హెచ్చరించింది. దీంతో 7,000 పైగా వాహనాలను కంపెనీలు వెనక్కి రప్పించాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలంటూ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులతో కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. మరిన్ని వివరాలు.. ♦ విద్యుత్‌యేతర వాహనాలు, కిక్కిరిసిన ప్రజా రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ-స్కూటర్లపై చాలా మంది ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే పనితీరు, భద్రతపైనే ఆందోళన పెరుగుతోంది. ♦ తమకు గానీ తమ కుటుంబ సభ్యులకు గానీ వచ్చే 6 నెలల్లో ఈ-స్కూటర్‌ను కొనే ఆలోచన లేకపోవడానికి.. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణమని 5 శాతం మంది తెలిపారు. వాటిని కొనేంత నిధులు తమ దగ్గర లేవని 7 శాతం మంది చెప్పారు. తమ దగ్గర ఇప్పటికే చాలా వాహనాలు ఉన్నాయని, మరో టూ-వీలర్ కొనే యోచనేదీ లేదని 9 శాతం మంది పేర్కొన్నారు. ♦ ఈవీలనేవి వేలం వెర్రిలాంటివని, ఈ ధోరణి త్వరలోనే తగ్గిపోతుందని 2 శాతం మంది పేర్కొన్నారు. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ♦కేవలం ఒక్క శాతం కుటుంబాలు మాత్రమే వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమపై ఉందని నివేదిక పేర్కొంది. ♦ ఈ-స్కూటర్లు, బ్యాటరీల భద్రతా ప్రమాణాలను రూపొందిస్తున్నప్పటికీ .. అనేక వర్గాల ప్రమేయం ఉన్నందున, ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తోంది. (ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత) ∙ -
ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవలకు దేశంలోనే రెండో ర్యాంకులో నిలుస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా చేపట్టే చెల్లింపుల(వేరియబుల్ పే)లో తాజాగా కోత పెట్టింది. సగటు చెల్లింపులను 70 శాతానికి పరిమితం చేసేందుకు నిర్ణయించింది. మార్జిన్లు మందగించడం, ఉపాధి వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ వేరియబుల్ పేను కుదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాన్ని ఉద్యోగులకు సైతం తెలియజేసినట్లు వెల్లడించాయి. వేరియబుల్ పే విషయంలో ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో సైతం ఇటీవల వెనకడుగు వేసిన విషయం విదితమే. ప్రధానంగా టెక్నాలజీపై పెరిగిన పెట్టుబడులు, మార్జిన్లపై ఒత్తిడి, నైపుణ్య సరఫరా చైన్ బలహీనపడటం వంటి అంశాలు ప్రభావం చూపాయి. కాగా.. ఐటీ సేవలకు నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కొంతమంది ఉద్యోగులకు త్రైమాసిక వేరియబుల్ పే చెల్లింపుల విషయంలో నెల రోజులపాటు ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు డీలా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలలో ఇన్ఫోసిస్ నికర లాభం అంచనాలకంటే తక్కువ వృద్ధిని సాధించింది. పెరిగిన వ్యయాల కారణంగా 3.2 శాతానికి పరిమితమైంది. అయితే పూర్తి ఏడాది ఆదాయ అంచనాలను మాత్రం కంపెనీ 14–16 శాతానికి పెంచింది. ఇందుకు పటిష్ట డీల్ పైప్‌లైన్ సహకరించింది. ఇక 21–23 శాతం మార్జిన్లను ఆశిస్తోంది. క్యూ1లో 20 శాతం మార్జిన్లను అందుకుంది. ఉద్యోగలబ్ది, ప్రయాణ ఖర్చులు, సబ్‌కాంట్రాక్టు వ్యయాలు వంటివి ప్రభావం చూపాయి. దీనికితోడు భారీగా పెరిగిన ఉద్యోగ వలస(అట్రిషన్) దేశీ ఐటీ రంగ లాభదాయకతను దెబ్బతీస్తోంది. అయితే నిపుణులను ఆకట్టుకోవడం, పోటీస్థాయిలో వేతనాల పెంపు వంటివి చేపట్టడం ద్వారా వృద్ధిని కొనసాగించనున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఇటీవల పేర్కొనడం గమనార్హం! ఇది స్వల్ప కాలంలో మార్జిన్లను బలహీనపరచినప్పటికీ అట్రిషన్‌ను తగ్గిస్తుందని, భవిష్యత్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. -
ఒరిస్సా హైకోర్టు స్వయం సమీక్ష
కటక్: దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒరిస్సా హైకోర్టు స్వయం సమీక్ష జరుపుకుంది. ఈ మేరకు వార్షిక నివేదిక–2021ను ఇటీవల విడుదల చేసింది. జవాబుదారీతనంతో ఉండటం, నిర్దేశిత లక్ష్యంతో పనిచేయాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. ఎదురైన సవాళ్లు, ప్రధాన తీర్పు, పేరుకుపోతున్న కేసుల తీరును వివరించింది. ఇందులో..హైకోర్టులో 40 ఏళ్లకు పైగా నలుగుతున్న కేసులు 400కుపైగానే ఉన్నట్లు తెలిపింది. కేసుల సంఖ్య పెరుగుతూ పోతుండటపై ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కరోనా సమయంలో కోర్టుల్లో కార్యకలాపాలు కొనసాగించడం ప్రధాన సవాల్‌గా మారిందని పేర్కొంది. కోవిడ్ కారణంగా ఏడాదిలో 67.20 రోజులను జిల్లా కోర్టులు నష్టపోయాయని తెలిపింది. -
ఇలా స్టెప్పులు వేయాలంటే గట్స్ ఉండాలి.. వీడియో వైరల్!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. వారు తమ కళను ఒక్కోరకంగా వ్యక్తపరుస్తారు. తాజాగా, ఒక స్ట్రీట్ డ్యాన్సర్ నడి వీధిలో తన స్టెప్పులతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక స్ట్రీట్ డ్యాన్సర్.. మైకేల్ జాక్సన్‌లా అలవోకగా స్టెప్పులేసి అక్కడున్న వారిని మెప్పించాడు. డ్యాన్స్ అనే కాకుండా రకరకాల భంగిమలతో వెరైటీ స్టెప్పులు వేశాడు. ఒకసారి తాను బౌలింగ్ వేసినట్లు.. ఆ వెంటనే బౌండరీ కొట్టినట్టు భంగిమను మార్చేశాడు. నేలకు కొట్టిన బంతిలా పడుతూ.. లేస్తూ స్టన్నింగ్ స్టంట్లు చేశాడు. అంతలోనే గాలిలో పతంగిని లాగినట్లు కూడా స్టెప్పులు వేసి చూపరులను ఆశ్చర్యపరిచాడు. అంతలోనే జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగా.. రకారకాల యాంగిల్స్‌లో స్టెప్పులు వేశాడు. తన స్టన్నింగ్ స్టెప్పులతో అక్కడి జనాలను షాకింగ్‌కు గురిచేశాడు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, అతని స్టన్నింగ్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి స్టెప్పులు వేయాలంటే గట్స్ ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వైరల్: చీర కట్టులో చూడముచ్చటైన కేరళ యువతుల డ్యాన్స్ .. -
సింధు కంటే తైజూకు మెరుగైన రికార్డు ఉంది: పీవీ రమణ
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ సెమీస్‌లో పీవీ సింధు గెలుపు కోసం వంద శాతం కృషి చేసిందని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. సింధు సెమీస్‌లో ఓటమి అనంతరం ఆయన స్పందించారు. అయితే సింధూ కంటే తైజూకు మెరుగైన రికార్డు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పీవీ సింధు అటాకింగ్ గేమ్ ఆడలేకపోయిందని ఓటమికి కారణాలను వివరించారు. సింధు ప్రత్యర్థి తైజూయింగ్ వరల్డ్ ఛాంపియన్, ఆమె చాలా వ్యూహాత్మకంగా ఆడింది అని రమణ తెలిపారు. కాగా, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్‌లో పీవీ సింధు- చైనీస్ తైపీకి చెందిన తైజుయింగ్ మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగింది. తొలి గేమ్‌లో ఆధిక్యం దిశగా దూసుకుపోయిన సింధును తైజు సమర్థవంతంగా ఎదుర్కొంది. అనంతరం దూకుడైన ఆటతో తొలి గేమ్‌లో 21-18తో పీవీ సింధును ఓడించింది. ఇక రెండో గేమ్‌లో తైజుయింగ్‌కు సింధు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్‌లో 12-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. సెమీస్‌లో ఓడిన సింధు ఇక కాంస్య పతక వేట కొనసాగించనుంది. హీ బింగ్ జియాతో సింధు గెలిస్తే కాంస్య పతకం ఖాయమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీచర్లకు టెస్ట్‌లు!
సాక్షి, హైదరాబాద్:ఐఐటీల్లో ఇంజనీరింగ్ విద్యా బోధనలో నాణ్యతాప్రమాణాల పెంపు దిశగా చర్యలను ఐఐటీల కౌన్సిల్ వేగవంతం చేసింది. బోధనలో నాణ్యత తగ్గిపోతుండటంతో అంతర్జాతీయ స్థాయిని అందుకోలేకపోతున్నామని భావనకొచ్చింది. అందుకే ప్రస్తుత స్థానాన్ని మెరుగు పరుచుకోవడంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధనను అందుబాటులోకి తెచ్చేలా చర్య లు చేపడుతోంది.ఇందులో భాగంగా ఐఐటీలకు అకడమిక్ ఫ్రీడంతోపాటు వివిధ ఐఐటీల్లో కొత్త అధ్యాపకుల బోధన తీరుతెన్నులపైనా సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.అధ్యాపకులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసేలా అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని ఇటీవల జరిగిన కౌన్సిల్ భేటీలో నిర్ణయించారు. మూడేళ్ల తర్వాత మూల్యాంకనం... పీహెచ్డీ పూర్తి చేసిన వారికి అనుభవం లేకపోయినా ప్రతిభావంతులైన వారిని ఖాళీగా ఉన్న స్థానాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించి మూడేళ్ల తరువాత వారి పనితీరును ఐఐటీ అంతర్గత కమిటీలతో మూల్యాంకనం చేస్తారు. 5.5 ఏళ్ల తరువాత ఫ్యాకల్టీ పనితీరు, పరిశోధన, బోధన, తదితర అంశాల్లో ఎక్స్టర్నల్ కమిటీతో సమీక్షించి వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించాలా? లేదా బయటకు పంపించాలా? అన్న విషయాన్ని తేలుస్తారు. అంటే ఐదున్నరేళ్ల పాటు వారు కాంట్రాక్టు లేదా తాత్కాలిక పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్ కమిటీ వాల్యుయేషన్ తరువాతే వారి రెగ్యులరైజేషన్ అంశం తేల్చాలని, ఈ విధానాన్ని కొత్తగా నియమితులయ్యే వారికే వర్తింపజేయాలన్న ఆలోచనలో ఉంది. అలాగే అధ్యాపకులపై అడ్మినిస్ట్రేటివ్ పని భారాన్ని తగ్గించనున్నారు. దీంతో వారు పరిశోధనల పట్ల ప్రత్యేక శ్రద్ధవహిస్తారని, తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందుతుందని కౌన్సిల్ భావిస్తోంది. వెనుకబడితే బీఎస్సీ ఇంజనీరింగ్... ఐఐటీల్లో చేరే విద్యార్థులు సాధారణ విద్యార్థులకంటే కొంత ప్రతిభ కలిగిన వారే అయినా, వాటిల్లో చేరిన అందరూ ఒకేలా ఉండరు. వారి ప్రతిభలో హెచ్చుతగ్గులు ఉంటాయి. వెనుకబడిన వారి కోసం బీఎస్సీ ఇంజనీరింగ్ చదివే అవకాశాన్ని కల్పించాలని కౌన్సిల్ నిర్ణయించింది. చదువులో వెనుకబడిన విద్యార్థులు తమ ప్రథమ సంవత్సరం (రెండో సెమిస్టర్) తర్వాత తమ సామర్థ్యాలను,రెండో సెమిస్టర్లో వారికి వచ్చే క్రెడిట్స్‌ను బట్టి,బీటెక్ కొనసాగకుండా బీఎస్సీ ఇంజనీరింగ్ చదువుకోవచ్చు.మూడేళ్లకే ఈ డిగ్రీని ఐఐటీలు అందజేయాలని కౌన్సిల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని నిబంధనలను ఐఐటీలే సొంతంగా రూపొందించుకొని అమలు చేయాలని స్పష్టం చేసింది. పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం.. ఐఐటీల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచి బలోపేతం చేసేందుకు ఐఐటీల కౌన్సిల్ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ప్రపంచ స్థాయి వర్సిటీల్లో దేశంలోని ఐఐటీలు, విద్యా సంస్థలు టాప్ 250–300 స్థానాల్లోనే ఉన్నాయి. ఇటీవల టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన సర్వేలో ఇదే తేలింది. ఈ నేపథ్యంలో రీసెర్చ్, డెవలప్మెంట్, ప్రమాణాల పెంపులో అధ్యాపకులు కచ్చితమైన బాధ్యత తీసుకునేలా చర్యలు చేపడుతోంది. అందుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఐఐటీలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తమే కాకుండా పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. పరిశోధనలకు పెద్దపీట దేశంలోని ఐఐటీలతోపాటు ఇండియన్ వర్సిటీలకు చెందిన ప్రముఖులు అనేక మంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇండస్ట్రీ లీడర్లుగా ఉన్నారు. అయినా దేశీయ విద్యా సంస్థలకు భారీగా నిధులను రాబట్టుకోలేకపోతున్నామన్న అంచనాకు కౌన్సిల్ వచ్చింది. హార్వర్డ్ వర్సిటీకి పూర్వ విద్యార్థుల నుంచి ఏడాదికి దాదాపు రూ. 800 కోట్లొస్తే.. 2017లో ఐఐటీ మద్రాసు రూ. 55 కోట్లే రాబట్టుకోగలిగింది. 2016లో అమెరికన్ వర్సిటీలు పూర్వ విద్యార్థుల నుంచి దాదాపు 535 బిలియన్ డాలర్లు సమకూర్చుకోగా, అందులో 25 టాప్ వర్సిటీలు 52 శాతం నిధులను పొందాయి. దేశంలోని విద్యా సంస్థలు కూడా ఆ స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ఐఐటీల్లో చదువుకొని విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల సంపాదన నుంచి కనీసంగా ఒక శాతం మొత్తాన్ని ఐఐటీల అభివృద్ధికి వెచ్చించాలని విజ్ఞప్తి చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల సమీక్ష... ఐఐటీల్లో విభాగాల వారీగా ఉన్న అకడమిక్ కమిటీల ఆధ్వర్యంలో కోర్సుల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను సమీక్షించేందుకు చర్యలు చేపడుతోంది. ఇంజనీరింగ్ విద్యలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక సెమిస్టర్ పూర్తయ్యాక ఆయా కోర్సుల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలపైనా విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేలా చర్యలు తీసుకుంది. వారి సూచనలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడంతోపాటు బోధనలో నాణ్యతాప్రమాణాలు పెంచేందుకు చర్యలు చేపడుతోంది. -
రషీద్‌పై ప్రసంశల వర్షం
సాక్షి, హైదరాబాద్ : శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలం, యువకెరటం రషీద్ ఖాన్ సత్తా చాటాడు. కోల్‌కతాతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో, రషీద్ అటు బ్యాటుతో ప్రత్యర్థి బౌలర్లు విసిరిన బంతిని బౌండరీలు తరలిస్తే.. ఇటు గింగిరాలు తిరిగే బంతితో కోల్‌కతా బ్యాట్మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫీల్డ్‌లో అద్భుతంగా కదిలి రనౌట్ చేశాడు. అంతేకాకుంకా కీలక సమయంలో రెండు క్యాచ్‌లను పట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. ఇలా శుక్రవారం రోజు రషీద్ వన్ మ్యాన్ షో చేశాడు. సన్‌రైజర్స్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. రషీద్ ఆటతీరుపై ప్రసంశలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన తరపున రషీద్ ఖాన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడిందని, రషీద్ ఖాన్‌తో పాటు జట్టు మొత్తానికి అభినందనలు చెప్పారు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సైతం మ్యాచ్‌పై స్పందించారు. మ్యాచ్ చూడలేపోయానని చెప్పిన ఆయన, ట్రోఫీ అందుకోవాలంటూ ఆకాంక్షించారు. రషీద్ గురించి ఎవరేమన్నారంటే.. ప్రముఖుల ట్వీట్లు Take a bow @rashidkhan_19... Whatta match by @SunRisers 👏Can't wait for Sunday!!! Congratulations to the whole team. 😊 Go #OrangeArmy #SRH — Mahesh Babu (@urstrulyMahesh) May 25, 2018 Missed the game but glad that @SunRisers made it 👏👏Congratulations and good luck for the trophy Guys 👍 — KTR (@KTRTRS) May 25, 2018 Cometh the hour, cometh the man. Big game, and @rashidkhan_19 was simply outstanding with both bat and ball. Has been a wonderful journey for us on our way to the finals and I wish the boys give it their everything and enjoy the finals. #KKRVSRH — VVS Laxman (@VVSLaxman281) May 25, 2018 Special performance from @rashidkhan_19 tonight, big game player! #superstar #SRH — Tom Moody (@TomMoodyCricket) May 25, 2018 This was @rashidkhan_19 ‘s day and when it is the day of a top player, his team invariably wins. Congratulations @SunRisers . The two top teams meet in the final on Sunday, must be a fascinating contest #KKRVSRH — Mohammad Kaif (@MohammadKaif) May 25, 2018 .@rashidkhan_19 you beauty! What a key role this man played today with the ball, the bat & on the field ! It's gonna be Orange vs Yellow in the finale! @SunRisers #SRHvKKR #IPL2018 — R P Singh (@rpsingh) May 25, 2018 Pathhar se pani nikal nahi sakte Lekin @rashidkhan_19 aaj Wo bhi kar dete. Batting bowling fielding. Mind blowing effort #KKRvsSRH Goodluck to two best teams of this ipl2018 for the finals #CSKvSRH — Irfan Pathan (@IrfanPathan) May 25, 2018 As a leg spinner I love seeing all the different types of leg spinners playing in the #IPL but watching @rashidkhan_19 bowl in these big games makes me proud as he loves this stage & pressure it also gets me excited ! 👍 — Shane Warne (@ShaneWarne) May 25, 2018 Deserved to be in the finals! @SunRisers ... Rashid - what a match he’s had! so happy for Kane Williamson! It’s Gonna be one helluva final! #KKRvsSRH — Ranveer Singh (@RanveerOfficial) May 25, 2018 I think Rashid Khan could discover a new planet in the solar system or a new element in the periodic table today — Harsha Bhogle (@bhogleharsha) May 25, 2018 మరోసారి మంచి మనసు చాటుకున్న రషీద్ ఇక్కడ చదవండి -
ఇలా ఎన్నడూ చూసి ‘తీరం’
అలలకు ప్రాణం పోయడానికి.. దూకుతున్న ఆకాశ గంగలా... సముద్రానికి ఎదురెళ్తున్న నీటిపడగలా... రయ్యిన దూసుకెళ్తున్న ‘నీరా’జువ్వలా.. ఫ్లోరిడాలోని లాడర్డెల్ తీరంలో వైమానిక ప్రదర్శనలో ‘లుకాస్ ఆయిల్ ఏరోబాటిక్’ విమాన విన్యాసం కనువిందు చేసింది. -
ఐపీఎల్ : పైసల్ ఎక్కువ.. పరుగులు తక్కువ!
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ లీగ్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కు ఏమాత్రం కొదవ ఉండదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు సొంత జట్టుకు ఆడటానికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏడాది పాటు జాతీయ జట్టుకు ఆడితే రాని డబ్బు సరిగ్గా ఒకటిన్నర నెల ఆడితే తమ ఖాతాల్లో జమ అవుతుంది. దీంతోనే ఐపీఎల్లో ఆడేందుకు అన్ని క్రికెట్ దేశ ఆటగాళ్లు ఆసక్తి కనబరుస్తారు. ఒక్కో ఆటగాడికి కోట్ల రూపాయలు చెల్లిస్తారు. అయితే ఇప్పటికే ఐపీఎల్ లీగ్‌లో సగం షెడ్యూల్ పూర్తి అయింది. కానీ ఈ సీజన్ వేలంలో కొందరు ఆటగాళ్లు అధిక ధరకు అమ్ముడయ్యారు. కానీ వారు ఆటలో దారుణంగా విఫలమయ్యారు. వారు ఎవరంటే.. డీఆర్సీ షార్ట్ : ఆస్ట్రేలియాకు చెందిన షార్ట్ బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో అత్యధిక పరుగులు చేశాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ జట్టు నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. బిగ్‌బాష్‌లో లీగ్‌లో సంచలనం కలిగించిన ఈ యువ కెరటం ఐపీఎల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 97.01 స్ట్రైక్ రేట్‌తో కేవలం 65 పరుగులు చేశాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ : టీ20 క్రికెట్లో మ్యాక్స్‌వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బరిలో దిగితే ప్రత్యర్థికి చుక్కలు చూపించేస్తాడు. కానీ గత రెండు సీజన్ల నుంచి మాత్రం తన ప్రభావం చూపించలేక పోతున్నాడు. కింగ్స్ పంజాబ్‌ను వదిలి ఢిల్లీ తరపున ఆడుతున్న మ్యాక్స్‌వెల్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్‌లు ఆడగా మొత్తం చేసిన పరుగులు 126, స్ట్రైక్ రేటు 159.49. ఈ ఆసీస్ ఆటగాడిని ఏడు కోట్ల రూపాలయకు ఢిల్లీ కొనుగోలు చేసింది. జయదేవ్ ఉనద్కట్ : బౌలర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఉనద్కత్ ఒకడు. గత సీజన్లో పూణె తరపున సంచలన బౌలింగ చేసిన ఇతడు ఈ సీజన్లో మాత్రం తన బౌలింగ్ పదును చూపెట్టలేక పోతున్నాడు. గత సీజన్లో ఉనద్కత్ బౌలింగ్ చూసిన రాజస్తాన్ రాయల్స్ 11.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 7మ్యాచ్‌లు ఆడి కేవలం 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎకనామీ 10.18గా ఉంది. కీరన్ పోలార్డ్ : క్రీజులో దిగంగానే బంతిని బౌండరీ తరలించడంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ముందుంటారు. ఈ కోవలో కీరన్ పోలార్డ్ ఒకరు. ముంబై తరపున ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తుంటాడు. చాలా సార్లు ఒంటిచేత్తో ముంబైకి విజయాలు అందించాడు. కానీ ఈ సారి దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్‌లు ఆడగా 108.57 స్ట్రైక్ రేటుతో కేవలం 76 పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ : ఆస్ట్రేలియాకు చెందిన ఫించ్‌ను కింగ్స్ పంజాబ్ 6.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో ఒక్కసారి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక పోయాడు. ఆరు మ్యాచ్‌లు ఆడగా మొత్తం 24 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 150గా ఉంది. -
గాయకుడిపై కరెన్సీ వర్షం
-
మెగాస్టార్ పాటకు.. అమెరికాలో డ్యాన్స్!
-
మెగాస్టార్ పాటకు.. అమెరికాలో స్టాండింగ్ ఒవేషన్!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీఇచ్చిన ఖైదీ నంబర్ 150 ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో తనలోని గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు మెగాస్టార్. మెగా మేనియాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఓ అంతర్జాతీయ రియాలిటీ షోలో ఖైదీ నంబర్ 150 సినిమాలోని సన్నజాలి లా నవ్వేస్తోందిరో పాటకు డ్యాన్స్చేశారు అక్కడి డ్యాన్సర్. ఫాక్స్ టీవీలో నిర్వహించే షో టైం ఎట్ ది అపోలో షోలో ఈ పాటను ప్రదర్శించారు. ఎమ్మీ అవార్డ్ విన్నర్ స్టీవ్ హార్వే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో ష్రాయ్ ఖన్నా టీం ఈ పాటను ప్రదర్శించారు. మెగాస్టార్ పాట అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. డ్యాన్స్ పూర్తయిన తరువాత ఆడిటోరియంలోని ఆడియన్స్ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ష్రాయ్ ఖన్నా టీంను అభినందించారు. ఈ వీడియోను మెగా అభిమానుల కోసం తన ఫేస్ బుక్ పేజ్‌లో షేర్ చేశాడు చిత్ర నిర్మాత చిరు తనయుడు రామ్ చరణ్. -
పల్లె సంప్రదాయానికి పదునుపెట్టిన గోరటి
చీమకుర్తి రూరల్: పల్లె సంప్రదాయాలకు పదాలను జతగూర్చి జనపదాలుగా మార్చి నృత్యరూపకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రముఖ జానపద కళాకారుడు గోరటి వెంకన్న. ఆశుకవిత్వంతో పద కవితలను గుక్కతిప్పుకోకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శుక్రవారం చీమకుర్తిలో జరిగిన బాలోత్సవం కార్యక్రమాన్ని వెంకన్న జానపద గీతాలతో వేదికను దద్దరిల్లేలా చేశారు. రెండోరోజు జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మక్క, వెంకటరెడ్డితో కలిసి గోరటి వెంకన్న పల్లెల్లోని వాతావరణ పరిస్థితులను తన జానపద గేయాలతో నృత్యరూపకంలో చూపరులను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యహరిశ్చంద్రుడిగా పేరుగాంచిన చీమకుర్తి నాగేశ్వరరావు పద్యాలు ఉమ్మడి రాష్ట్రాలలోనే పేరెన్నికగలవని అన్నారు. అంతటి కళాకారుడుని ఆదరించిన చీమకుర్తి వాసులకు కళలంటే ఎంత మక్కువో చెప్పకనే చెప్తున్నాయని, స్థానికుల కళాభిమానాన్ని కొనియాడారు. ముందుగా బాల బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక, జానపద నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. వాటితో పాటు తిరువూరు బాలలు ప్రదర్శించిన ఆలోచించండి నాటిక ఆకట్టుకుంది. తొలుత రెండోరోజు బాలోత్సవం కార్యక్రమాన్ని రోటరీక్లబ్ అ«ధ్యక్షుడు శిద్దా వెంకట సురేష్, వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకూరి రఘుకిరణ్, ప్రధాన కార్యదర్శి ముప్పూరి చలమయ్య ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్, అందెశ్రీలాంటి వారందరినీ ఆహ్వానించి తెలుగు మహాసభలు నిర్వహించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, మహాసభల్లో ఇష్టమైన వారికే సీఎం కేసీఆర్ స్థానం కల్పించారని విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో పోరాటం చేసిన కవులు, రచయితలకు ఈ మహాసభల్లో స్థానం కల్పించకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానించడమేమిటన్నారు. ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించినా తెలంగాణ చరిత్ర వారిని గుర్తుపెట్టుకుంటుందన్నారు. -
జీఈఎస్ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
-
టీడీపీ ఎంపీపీ అసభ్యకర నృత్యాలు
-
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
కలెక్టర్ ఎస్. సత్యనారాయణ –పత్తికొండ, తుగ్గలి అధికారులపై ఆగ్రహం కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి అధ్వానంగా ఉందని, అధికారులు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో పాటు పలుశాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం నీరుగారిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. పత్తికొండ, తుగ్గలి మండలాల్లో సున్నా శాతం పనితీరు కనబరచడంతో ఆయన అధికారులపై మండిపడ్డారు. వారంలోపు 20 శాతం పురోగతి కన్పించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటి ఎద్దడిని నివారించండి.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయని, గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా సమస్యాత్మక గ్రామాలను గుర్తించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. నాన్ సీఆర్ఎఫ్, ఎస్డీపీ నిధులతో ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిధుల వినియోగంతో పాటు పనుల లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. 14వ ఆర్థిక సంఘం నిధులను మంచినీటి పథకాల మరమ్మతులకు వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ హరిబాబు, ఈఈలు, డీఈలుపాల్గొన్నారు. -
ట్రంప్ తీరుపై అసంతృప్తిలో అమెరికన్లు!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నెలరోజుల పాలన ఎలా ఉంది అనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో.. ఎక్కువ మంది అమెరికన్లు తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. 53 శాతం మంది ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని భావిస్తున్నారని ఎన్బీసీ న్యూస్, సర్వేమంకీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాప్రాయ సేకరణలో వెల్లడైంది. అదేవిదంగా.. రాబోయే కాలంలో ట్రంప్ పాలనపై ప్రజల్లో భయాందోళన నెలకొందని ఈ సర్వేలో తేలింది. రానున్న నాలుగేళ్లలో అమెరికా ఓ పెద్ద యుద్ధంలో పాల్గొనాల్సి రావొచ్చని మూడింట రెండొంతుల మంది భావిస్తున్నారని ఎన్బీసీ తెలిపింది. మరీ 30 శాతం మంది మాత్రం ట్రంప్ పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అయితే.. ఏడు ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి 50 శాతం మంది మద్దతు తెలపడం గమనార్హం. -
ఆకట్టుకున్న ‘అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం’
పాత గుంటూరు: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో పూలే, అంబేడ్కర్ అధ్యయన కేంద్రం నిర్వహణలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ సింధూరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్.డి.విజయభాస్కర్ కలం నుంచి వెలువడిన నాటకాన్ని పడమటి గాలి సృష్టికర్త పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో జిల్లా రిజిష్ట్రర్.ఎస్.బాలస్వామి, కె.రవిశేఖర్, ఎస్.ఎమ్.ప్రకాష్‌కుమార్. డాక్టర్.నూతక్కి సతీష్, టి.రజనీకాంత్, డాక్టర్.కాకాని సుధాకర్, జి.సుకుమార్,అబ్దుల్‌వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు సిబ్బంది పనితీరు పరిశీలన
కర్నూలు: బ్యాంకుల వద్ద పోలీస్ సిబ్బంది పనితీరును శుక్రవారం.. ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. శుక్రవారం ఉదయం కర్నూలులోని స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ దగ్గర క్యూలైన్లో నిలబడిన ఖాతాదారులతో మాట్లాడారు. ఉద్యోగులకు, పింఛన్‌దారులకు నగదు చెల్లింపుల విషయంలో ఎలాంటి జాప్యం చేయరాదని బ్యాంకు అధికారులకు సూచించారు. ఎస్బీఐ జనరల్ మేనేజర్ మురళీధర్‌తో నగదు రహిత లావాదేవీల గురించి చర్చించారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ రమణమూర్తి కూడా ఉన్నారు. -
సైనికుడి విన్యాసాన్ని ఆసక్తిగా తిలకించిన మోదీ
-
కమర్షియల్ కు దీటుగా కో-ఆపరేటివ్ సేవలు
ఖాతాదారులకు ఏటీఎంల పంపిణీ దోమకొండ: కమర్షియల్ బ్యాంకులకు దీటు గా కో ఆపరేటివ్ బ్యాంకులు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయని డీసీసీబీ ఉపాధ్యక్షుడు పరికి ప్రేంకుమార్ అన్నారు. మండల కేం ద్రంలోని కో ఆపరేటీవ్ బ్యాంకులో శుక్రవా రం ఖాతాదారులకు ఏటీఎం కార్డులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి జిల్లాలోని కో ఆపరేటీవ్ ఖాతాదారులందరికీ ఏటీఎంలు పంపిణీ చేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రైతులకు రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకు నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో దోమకొండ సిం గిల్‌విండో చైర్మన్ నర్సారెడ్డి, ముత్యంపేట సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, కో ఆపరేటీవ్ బ్యాంకు మేనేజర్ శాంతాదేవి, సొసైటీ సీఈవోలు బాల్‌రెడ్డి, రాంచంద్రం, నర్సాగౌడ్, బ్యాంకు సిబ్బంది శ్రీపాల్‌రెడ్డి, సాయికృష్ణ, సునీత, రాకేశ్, శ్రావణ్‌రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
మీ పనితీరేం బాగోలేదు!
– చెత్త సమస్య ఇప్పటి వరకు నెరవేరలేదు – శానిటేషన్ అధికారులు, సిబ్బందిపై ఆర్డీ ఆగ్రహం కర్నూలు (టౌన్): నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడం లేదు. ఎన్నిసార్లు మీకు చెప్పాలి. మీ పనితీరేం బాగోలేదు అని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక నగరపాలకలోని సమావేశ భవనంలో పారిశుద్ధ్య, రెవెన్యూ విభాగాలతో ఆర్డీ సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారీగా శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిప్పర్ల సమస్య ఉందని చెబుతున్నారు... ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు. మూడు నెలలుగా సమస్య ఉంటే ఎందుకు పరిష్కరించుకోలేదని వారిని ప్రశ్నించారు. మీ నిరా్వకంతో నగరంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. జమ్మి చెట్టు నుంచి గార్గేయపురం కంపోస్టు యార్డుకు చెత్త తరలించడంలో సమస్యలు వస్తున్నాయన్నాయన్నారు. కంపోస్టు యార్డు వద్ద పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త తరలింపు అధ్వానంగా తయారయ్యిందని మండిపడ్డారు. వారానికి ఒకరు చొప్పున్న శానిటరీ ఇన్స్పెక్టర్ కంపోస్టుయార్డు, జమ్మిచెట్టు వద్ద పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీవో 279 ప్రకారం వర్కర్లను టెండర్ ద్వారా తీసుకుని ఇంటింటి చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి పన్నుల వసూళ్లు వందశాతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, ఇన్చార్జీ పర్యావరణ ఇంజినీరు రాధకృష్ణ, రెవెన్యూ అధికారులు వీరస్వామి, మల్లిఖార్జున, రెవెన్యూ ఇన్సె్పక్టర్లు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ పనితీరు భేష్
ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ పీఏసీఎస్‌ను వాణిజ్య బ్యాంకులకు దీటుగా తీర్చిదిద్దడం బాగుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు కితాబిచ్చారు. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని శేరిగూడ వార్డులో ఉన్న ఉప్పరిగూడ పీఏసీఎస్‌ను మంగళవారం 9 జిల్లాల సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు స్టడీటూర్‌లో వచ్చి సందర్శించారు. ఉప్పరిగూడ పీఏసీఎస్ సీఈఓ గణేష్‌ని సంఘం పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా సంఘాన్ని తీర్చిదిద్దడం చాలా బాగుందన్నారు. ఎక్కడ లేనన్ని డిపాజిట్లు సేకరించి రైతుల శ్రేయస్సుకోసం పాటుపడటం అభినందనీయమని తెలిపారు. క్యాష్ కౌంటర్, ఎరువుల, విత్తనాల కేంద్రాలు, ఏర్పాటు చేసి వాణిజ్య బ్యాంకులకు దీటుగా సంఘాన్ని తీర్చిదిద్దడం రాష్ర్టానికే గర్వకారణమని కొనియాడారు. గోల్డ్ లోన్లు, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చి రైతులను ఆపదలో అదుకొవడం శుభపరిణామమని అన్నారు. రోజుకు రూ.50 లక్షలు టర్నోవర్‌తో సంఘం పని చేయడం నచ్చిందని అభిప్రాయం వ్యక్తపరిచారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ , మహబూబ్‌నగర్‌తో పాటు పలు జిల్లాలో పని చేస్తున్న సంఘాలను ఉప్పరిగూడ పీఏసీఎస్‌లాగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ర్టంలోనే ఉప్పరిగూడ పీఏసీఎస్ సేవలు రైతులకు అందుబాటులో ఉన్నయని ఇదే తరహాలో ఆయా జిల్లాలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9 జిల్లాల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు. -
సాఫ్ట్‌బాల్ పోటీలో విద్యార్థినుల ప్రతిభ
మరికల్ (ధన్వాడ) : నిజామాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలో మరికల్ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఈనెల 16నుంచి 18వరకు నిజామాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో 9వ తరగతి చదువుతున్న రోషిణి, గాయత్రి మంచి ప్రతిభ కనబర్చి ప్రశంసా పత్రాలను సాధించారు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల హెచ్ఎం అపర్ణ, పీఈటీ సుగుణ వారిని అభినందించారు. -
వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
నడిగూడెం: వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మండల విద్యాధికారి ఎండి.సలీంషరీఫ్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యాభివృద్దికి కృషి చేయాలని, పేద విద్యార్థులకు చేయూతనివ్వాలని ఆయన కోరారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు నిర్మల, తలారి శ్రీనివాసరావు, వెంకటనర్సయ్య, ప్రధానోపాద్యాయులు పాల్గొన్నారు. -
ప్లీజ్.. నా నుంచి అది ఆశించొద్దు: సల్మాన్
ముంబై: స్టార్ హీరో అయినప్పటికీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటాడు. అయినా అతని స్టార్ డమ్ కు ఏ లోటూ లేదు. బాలీవుడ్ మూవీలను వంద కోట్ల క్లబ్ కు చేరడం నీళ్లప్రాయంగా మార్చిన హీరో సల్మాన్ ఖాన్. శుక్రవారం అతని పెళ్లి విషయంపై కాస్త వివాదం కావడం తెలిసిందే. తమ్ముడు అర్బాజ్ ఖాన్ పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేయడంతో పాటు సమర్ధించుకున్నాడు. ఈ జూన్ 23-26 తేదీల మధ్య ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఫా) ఉత్సవాలపై సల్మాన్ మాట్లాడుతూ... తాను హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ లాగ డాన్స్ చేయలేనని చెప్పాడు. అందుకే ఐఫాలో వారి అంత మంచి స్టెప్పులు వేయలేనని, అందుకే తన నుంచి అలాంటివి ఆశించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. తనకు వచ్చిన విధంగా నార్మల్ స్టెప్పులతో అలరించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాడు. వరుస షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ తాను చాలా బిజీగా ఉన్నా స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరగనున్న ఐఫా వేడుకల్లో పాల్గొంటానని చెప్పాడు. సల్మాన్ ఎక్కడుంటే అక్కడ చాలా ఫన్నీగా ఉంటుందని, కుటుంబమంతా ఉన్న ఫీలింగ్ కలుగుతుందని సీనియర్ హీరో అనిల్ కపూర్ అభిప్రాయపడ్డాడు. ఐఫాలో కరీనా కపూర్, మోనాలి ఠాకూర్, ప్రీతమ్, నీతి మోహన్ ఫర్మార్మెన్స్ చూడవచ్చని చెప్పాడు. హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ కంటెస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తారని అనిల్ వివరించాడు. -
వ్యక్తిగత ప్రశంసలతో టీం వర్క్ కు ప్రోత్సాహం
మనిషికి ఇచ్చే వ్యక్తిగత గుర్తింపు.. ప్రశంసలు... వారిని టీం వర్క్ చేయడానికి ప్రోత్సహిస్తుందని, వారిలో మంచి శక్తినిస్తుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. చైనాలోని ఓ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లో పనిచేసేవారిపైనా, కొందరు విద్యార్థులపైనా జరిపిన అధ్యయనాల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. ప్రయోగశాలలు, ఫీల్డ్ ప్రయోగాల ద్వారా అధ్యయనాల్లో... వ్యక్తిగత గుర్తింపు.. టీమ్ వర్క్ కు ఎంతగానో సహకరిస్తుందని కనుగొన్నారు. వ్యక్తి పని తీరుపై అతడికి ఇచ్చే ప్రశంసల ప్రభావం ఉంటుందని చైనాలో జరిపిన కొత్త పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఒక్కొక్కరి పనిని వ్యక్తిగతంగా గుర్తించడం, ప్రశంసలు తెలియజేయడం టీం వర్క్ ను ప్రోత్సహిస్తుందని అమెరికా నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పూలే కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ సహ అధ్యయనకారుడు ప్రొఫెసర్ బ్రాడ్లీ కిర్క్ మాన్ తెలిపారు. అధ్యయనకారులు చైనా విశ్వవిద్యాలయానికి చెందిన 256 మంది విద్యార్థులపై జరిపిన అధ్యయనాల్లో ఒక్కొక్కరి పనులను విడివిడిగా గుర్తించడంతోపాటు, సమూహాలతో కలసికూడ గుర్తించారు. వ్యక్తిగత పనుల్లో ప్రశంసలు పొందిన వారే సమూహాల్లో శక్తివంతంగా పనిచేసినట్లు గుర్తించామని తమ అధ్యయనాల వివరాలను అప్లైడ్ సైకాలజీ జర్నల్ లో ప్రచురించారు. రెండవ రౌండ్ లోనూ వ్యక్తిగత ప్రశంసలు పొందిన వ్యక్తి... ఇటు వ్యక్తిగతంగానూ, సమూహాలతో కలసి కూడా పనిలో గణనీయమైన మెరుగును కనబరచినట్లు అధ్యయనకారులు గుర్తించారు. అంతేకాక వ్యక్తిగత గుర్తింపులేని వ్యక్తి టీమ్ మెంబర్ గా కూడ ఎటువంటి మెరుగుదలను చూపించలేకపోయినట్లు తెలుసుకున్నారు. ఉత్తర చైనాలోని ఓ ఉత్సత్తి సంస్థ కూలీలపై కూడ పరిశోధకులు ఈ కొత్త ప్రయోగాలను నిర్వహించారు. కంపెనీలోని కొన్ని విభాగాల్లో 'ఎంప్లాయీ ఆఫ్ ద మంత్' పేరుతో టీమ్ లోని అత్యధిక పనిమంతులను గుర్తించి మిగిలిన విభాగాల్లో గుర్తించకుండా వదిలేశారు. అయితే ఇక్కడకూడా ప్రత్యేక గుర్తింపునివ్వకుండా వదిలేసిన టీమ్ లలో అటు వ్యక్తిగతంగా గాని, టీమ్ వర్క్ లో గాని పనిలో ఎటువంటి ప్రత్యేక ఫలితాలూ కనిపించకపోవడాన్ని తెలుసుకున్నారు. -
విశాల్ సిక్కా వేతనం 75 కోట్లు
భారత ఐటీ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారి సరసన ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా నిలిచారు. ఏడాదికి 11 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 75 కోట్ల జీతాన్నిసిక్కా అందుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ దూసుకుపోతోంది. దీంతో మొదట్లో సుమారు రూ. 54 కోట్లు ( 7.8 మిలియన్ డాలర్లు) ఉండే సిక్కా పారితోషికం ఒక్కసారిగా పెరిగిపోయింది. సిక్కాకు సంవత్సరానికి 11 మిలియన్ డాలర్లు (సుమారు 75 కోట్లు) ప్యాకేజ్ ఉండగా... అందులో ఓ మిలియన్ డాలర్ బేసిక్ శాలరీ, 3 మిలియన్ డాలర్ల వేరియబుల్ పే, 2 మిలియన్ డాలర్ల స్టాక్ ఆప్షన్లు, మరో 5 మిలియన్ డాలర్లు స్టాక్ ఆప్షన్స్ కలిపి మొత్తం 11 మిలియన్ డాలర్ల వేతనాన్ని సిక్కా పొందుతున్నారు. దీంతో ఐటీ దిగ్గజాల్లోని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా 2014-15 ప్యాకేజ్ (11.3 మిలియన్ డాలర్లు) కు దగ్గరగా చేరుకుంది. 2013-14 లో టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ ప్యాకేజ్ 3.15 మిలియన్ డాలర్లు, అదే సంవత్సరం షేర్లు మినహా మాజీ విప్రో చీఫ్ టి.కె. కురియన్ ప్యాకేజీ 1.5 మిలియన్ డాలర్లు ఉన్నట్లు తాజా లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
ఆకర్షించినన 'మహిళా' మ్యూజిక్ బ్యాండ్
-
ఐఫా వేడుకల్లో రామ్ చరణ్ డ్యాన్స్
-
రామ్ చరణ్, అఖిల్, జీవా... తొలిసారిగా స్టేజ్ డ్యాన్స్!
అవార్డు వేడుకలంటే ఆటా పాటా కామన్. హీరో, హీరోయిన్లు హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తుంటే, హుషారుగా వన్స్ మోర్ అనాలనిపిస్తుంది. ఈ సందడితో పాటు సినిమా పరిశ్రమకు సేవలందించి, చరిత్రలో నిలిచిపోయిన పెద్దలను గౌరవించుకుంటే అప్పుడు ఆ వేడుకకు నిండుదనం వస్తుంది. ఈ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో ‘ఐఫా-ఉత్సవమ్’ అవార్డుల వేడుక అత్యంత వైభవంగా ఈ విధంగానే జరగనుంది. జియోవన్ స్మార్ట్‌ఫోన్, రేనాల్ట్‌ల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ను అందిస్తోంది. చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహానటుడు డా. అక్కినేని నాగేశ్వరరావు, శతాధికచిత్రాల నిర్మాత డా. డి. రామానాయుడు, దర్శక దిగ్గజం కె.బాలచందర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్‌లకు ఈ వేదికపై నివాళులర్పించనున్నారు. ఇంకా దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న వారిని సత్కరించనున్నారు. ఇక.. ఈ అవార్డు వేడుకలో సందడి గురించి చెప్పాలంటే... మొదటిసారి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్న రామ్‌చరణ్ డ్యాన్సుల విషయంలో తన తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రామ్‌చరణ్. స్టయిలిష్‌గా డ్యాన్సులు చేసే చరణ్ ఇప్పటివరకూ ఆహూతుల ముందు ఏ వేదిక మీదా కాలు కదపలేదు. తొలిసారి ‘ఐఫా’ వేదికపై ఆయన డ్యాన్స్ చేయనుండడం విశేషం. ఈ అవార్డు వేడుకలకు చరణ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్చొచ్చు. వేదికపై రెచ్చిపోవడానికి గచ్చిబౌలి స్టేడియంలో రామ్‌చరణ్ చాలా హుషారుగా రిహార్సల్స్ చేస్తున్నారు. అదిరిపోయేలా అఖిల్.. ‘మనం’లో కొన్ని సెకన్లు కనిపించి, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని కితాబులందుకున్నారు అఖిల్. అలాగే మొదటి సినిమా ‘అఖిల్’తోనే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించు కున్నారు. ఈ చిచ్చరపిడుగు లైవ్ పెర్ఫార్మెన్స్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ‘ఐఫా’ వేదికపై అదిరిపోయే స్టెప్పులు వేయడానికి అఖిల్ కసరత్తులు చేస్తున్నారు. వారెవ్వా అనిపించాలనుకుంటున్న జీవా.. తమిళ హీరో జీవా కూడా ఇప్పటివరకూ ఏ అవార్డు వేడుకలోనూ డ్యాన్స్ చేయలేదు. ఇప్పుడు ‘ఐఫా’లో రెచ్చిపోవడానికి రెడీ అయ్యారు. మొదటిసారి స్టేజీపై డ్యాన్స్ చేయనున్నారు కాబట్టి, ఎక్కడా తగ్గేది లేదన్నట్లుగా ఉంది జీవా వ్యవహారం. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసి, అందరూ వారెవ్వా అనే విధంగా డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు. ప్రముఖుల సమక్షంలో... పసందుగా... దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రరంగానికి చెందిన తారల అవార్డు వేడుక ఇది. ఈ వేడుకలో నాలుగు భాషలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, నాగచైతన్య తదితరుల నటులతో పాటు అందాల తారలు కాజల్ అగర్వాల్, మమతా మోహన్‌దాస్, కావ్యా మాధవన్ వంటివారి సమక్షంలో ఈ వేడుక పసందుగా జరగనుంది. ఆ కలను ‘ఐఫా’ నెరవేర్చింది - తమన్నా సినిమాల్లోకి రాకముందు నేను ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ దావర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుందామనుకున్నా. అనుకోకుండా సినిమాలకు అవకాశం రావడంతో అది నెరవేరలేదు. ఇప్పుడీ ‘ఐఫా’ కారణంగా అది నెరవేరింది. ఈ అవార్డుల వేదికపై నేను చేయనున్న డ్యాన్సులకు ఆయనే కొరియోగ్రఫీ చేస్తున్నారు. సోమవారం నా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నా స్టెప్స్‌ని కాపీ... పేస్ట్ చేయమన్నారు - దేవిశ్రీ ప్రసాద్ నాకు ఒక పట్టాన ఏదీ నచ్చదు. ట్యూన్ చేయడం అయినా, పాట పాడడం అయినా, చివరికి డ్యాన్స్ చేయడం అయినా. అందుకే ఈ వేదికపై నాతో కలిసి డ్యాన్స్ చేసేవాళ్లకు కొన్ని స్టెప్స్ చూపించాను. షియామక్ దావర్కి అవి నచ్చడంతో ‘అందరూ కాపీ పేస్ట్ చేయండి’ అన్నారు. -
శర్వానంద్ డైరెక్టర్‌కి షాకిచ్చాడట!
చెన్నై: 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి హిట్ చిత్రం ఇచ్చిన దర్శకుడుమేర్లపాక గాంధీ టాలీవుడ్ విలక్షణ హీరో శర్వానంద్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తన అప్ కమింగ్ మూవీ 'ఎక్స్ ప్రెస్ రాజా' లో అద్భుతమైన నటనతో శర్వానంద్ తనను షాక్ కు గురి చేశాడన్నాడు. చాలా టాలెంటెడ్ యాక్టర్ అని తెలిసినా...సెట్లో తనను తానును ఇంత బాగా మలుచుకుంటాడని అస్సలు ఊహించలేదంటూ ఉబ్బితబ్బిబు అవుతున్నాడు. అమోఘమైన శర్వానంద్ పెర్ఫామెన్స్‌కు నిర్ఘాంతపోయానంటూ గాంధీ చెప్పుకొచ్చాడు. చాలా సన్నివేశాలలో అతని నటన తాను ఊహించినదానికంటే కూడా చాలా బావుందన్నాడు. శర్వానంద్ ని డైరెక్ట్ చేయడాన్ని ఎంజాయ్ చేశానంటున్నాడు. ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారంటూ పొగడ్తల్లో ముంచెత్తేశాడు. శర్వానంద్ లాంటి నటుడితో పనిచేయడం మంచి అనుభవాన్ని మిగిల్చిందని వ్యాఖ్యానించాడు దర్శకుడు. మరోవైపు కథను బట్టి సినిమాకు ఆ పేరు పెట్టాను తప్ప తనకు ' ఎక్స్ ప్రెస్' సెంటిమెంట్ లేదని స్పష్టం చేశాడు. అలాగే కథను బట్టి హీరో తప్ప, హీరోకు అనుగుణంగా కథ తయారు చేయడం తనకు నచ్చదని వ్యాఖ్యానించాడు. ప్రతి ఇరవై నిమిషాలకో ఆశ్చర్యకరమైన ట్విస్ట్ తో , విభిన్నమైన కథనంతో తెలుగులో వస్తున్న ఎక్స్‌ప్రెస్ రాజా అందరినీ ఆకట్టుకోవడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేశాడు. కాగా జనవరి 14న సరిగ్గా సంక్రాంతి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ యోచిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన ఆడియోకు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. హీరోయిన్ గా సురభి హరీష్ ఉత్తమన్, బ్రహ్మాజీ, పోసాని మురళి, తదితరులు నటించారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు శర్వానంద్. -
పెద్దోడి కన్నా చిన్నోడే బెటర్!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయులు తేజస్వి, తేజ్‌ప్రతాప్ యాదవ్ నితీశ్‌కుమార్ కేబినెట్లో టాప్ రెండు, మూడు స్థానాలను అలంకరించడం.. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. పెద్దగా అనుభవంలేని వారికి కీలక శాఖలు అప్పగించడంపై విమర్శకులు మండిపడ్డారు. ఇప్పుడు వారు పదవుల్లోకి చేరి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో వయస్సులో చిన్నవాడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన తేజస్వి తన పనితీరుతో ఆకట్టుకుంటుండగా.. అన్న తేజ్‌ప్రతాప్ మాత్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి చేపట్టిన తేజస్వి పరిణతి గల రాజకీయ నాయకుడి ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అప్పగించిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదే అన్న తేజ్‌ప్రతాప్ విషయానికొస్తే ఆయనకు 'పాస్' మార్కులు ఇవ్వడానికి ఇప్పటికీ పరిశీలకులు వెనుకాముందాడుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా తేజ్‌ప్రతాప్ ఇంకా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన కొంత సిగ్గుపడుతూ, నెర్వస్‌కు గురవుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే తేజ్‌ప్రతాప్ కూడా అధికారులతో దృఢంగా వ్యవహరిస్తూ.. శాఖను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. 'తేజస్వి శాంతస్వభావం కనబరుస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన వివిధ రాజకీయ అంశాలపై సమర్థంగా మాట్లాడి.. విమర్శకుల నోళ్లు మూయించారు. లాలూ రాజకీయ వారసుడు తేజస్వినేనని ప్రతిపక్ష నేతలు సైతం ఇప్పుడు అంగీకరిస్తున్నారు' అని ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనోజ్ యాదవ్ పేర్కొన్నారు. -
గారడీకాదు.. నిజం.. ముక్కులోంచి నోట్లోకి
ఇస్లామాబాద్: గారడీ కాదు, కనికట్టు అంతకన్నా కాదు... సజీవంగా ఉన్న పామును ముక్కులోంచి పంపించి, నోటి ద్వారా బయటికి తీస్తున్న వైనం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్ కరాచీకి చెందిన ఇక్బాల్ చేస్తున్న ఈ సాహస ప్రదర్శన ఇపుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. పాములతో గారడీ చేయడం వాటిని ఒడుపుగా ఆడించడం మనకు తెలిసిందే. కానీ ఇక్బాల్ ప్రమాదకర ప్రదర్శన మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఓ పాము కాటు అతని జీవితాన్ని మార్చి వేసింది. పాముకాటుతో మూడు రోజుల పాటు మృత్యువు పోరాడిన ఇక్బాల్ సర్పాలతోనే ఈ సాహసం చేస్తున్నాడు. నిరంతరం అపాయకరమైన విద్యను ప్రదర్శిస్తూ, తన వృత్తిగా మలుచుకున్నాడు. బతికున్న పామునే ముక్కులోంచి లోపలికి పంపించి తిరిగి నోటి ద్వారా బయటికి తీస్తున్నాడు. 'భయంకరమైన విష సర్పం నన్ను కాటేసినప్పుడు వెంటనే స్పృహ కోల్పోయా... మూడు రోజుల పాటు మత్యువుతో పోరాడాను. ఆ సమయంలో మా టీచర్ నాకు ఈ విద్య నేర్పారు. అప్పటి నుంచి ఇలా కొత్త జీవితాన్ని ప్రారంభించాను' అంటూ చెప్పుకొచ్చాడు. ముగ్గురు కొడుకులు, అయిదుగురు ఆడపిల్లలు ఉన్న తన కుటుంబాన్ని పోషించుకునేందుకు గత 12 సంవత్సరాలుగా ఈ వృత్తి మీదనే ఆధారపడ్డానని చెప్పాడు. ఇది ప్రమాదకరం అని తెలిసినా.. తనకు వేరే గత్యంతరం లేదంటున్నాడు. ప్రతి ప్రదర్శనకు ముందు తను బతకాలని ఆ దేవుడ్ని కోరుకుంటానని, తన ప్రతిభను గుర్తించి ఆదుకోవాలని కోరుకుంటున్నాడు. -
నిజం..ముక్కులోంచి నోట్లోకి
-
గుంటూరులో శివమణి ప్రదర్శన
-
యూట్యూబ్ ను ఏలుతున్న 'ఎడ్వర్డా' బీట్స్...
లయబద్ధమైన బీట్.. ముఖంలో తొణకని విశ్వాసం.. ఆ చిన్నారి డ్రమ్స్ వాయించిందంటే సంగీత ప్రియులే కాదు...చూసినవారంతా అడుగులు కదపాల్సిదే... అప్పుడప్పుడే పాఠశాల మెట్లు ఎక్కాల్సిన ఐదేళ్ళ వయసులోనే ... ఆమె చేయి తిరిగిన ప్రజ్ఞను ప్రదర్శించింది. ఎటువంటి లోపాలు లేకుండా డ్రమ్స్ వాయిస్తూ, స్టేజ్ షోలు, టీవీ షోలతో దూసుకుపోతోంది. ఆణిముత్యంలా ఆకట్టుకుంటున్న ఆ బాల కళాకారిణి ఎడ్వర్డా హెన్ క్లెయిన్ బటెరిస్టా ప్లే చేసిన వీడియోలు... ఇప్పుడు యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. బ్రెజిల్.. జాయిన్విల్లే నగరంలో నివసించే ఆరేళ్ళ ఎడ్వర్డా తన బీట్స్ తో సంగీత ప్రపంచాన్ని ఓలలాడిస్తోంది. ఇంతకు ముందే ఎన్నో లోకల్ టీవీ ప్రోగ్రామ్స్ లో ప్రతిభను చాటిన బాలిక.. తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఓ సంవత్సరం క్రితం ఐదేళ్ళ అతి చిన్న వయసులో వాయిద్యాన్నిమొదలుపెట్టిన చిన్నారి... చేయి తిరిగిన విద్వాంసురాలిలా డ్రమ్స్ వాయించడం చూపరులను విస్మయ పరుస్తోంది. అతి సుతారంగా కర్రలు తిప్పుతూ చాకచక్యంగా బీట్స్ వేసే ఆమె... వాద్య పరికరాల వెనుక నవ్వుతూ నిలబడినట్లే కనిపిస్తుంది. ట్రాక్ తో పాటు గొంతెత్తి పాడుతూ శక్తివంతంగా తన పరాక్రమాన్ని చాటుతోంది. ప్రదర్శన ముగించే మూడు నిమిషాలకు ముందు ఈలలు, చప్పట్లతో ఆమెకు వచ్చే రెస్సాన్స్ ఓ ప్రముఖ విద్యాంసుడికి కూడా రాదేమో అనిపిస్తుంది. యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఆ బాల మేధావి వీడియోను ఇప్పటివరకూ ఐదు లక్షల మందికి పైగా చూడటమే కాదు, ఎందరో ఆమెను అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. ''నిజానికి ఓ ఐదేళ్ళ చిన్నారి ఇంత అద్భుతంగా డ్రమ్స్ వాయించడం ఆశ్చర్యపరుస్తోంది.", "డ్రమ్స్ వాయిస్తూ పాటను కూడ పాటడం నిజంగా ఆశ్చర్యం" అంటూ వచ్చిన కామెంట్లు ఇప్పుడు ఆమె ప్రతిభకు పట్టం కడుతున్నాయి. -
పనితీరు మార్చుకోవాలి
అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహంపనితీరు మార్చుకోవాలని సూచనసమావేశాలకు సమాచారం, అవగాహనతో రావాలి రారుతీ ట్రాక్టర్లపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం వాడీవేడీగా జెడ్పీ సర్వసభ్య సమావేశం జెడ్పీ సర్వసభ్య సమావేశం గరం గరంగా సాగింది.. అధికారుల పనితీరుపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.. యూంత్రీకరణ అమలులో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని జెడ్పీటీసీలు మండిపడ్డారు.. కరువు, బ్యాంకు రుణాలు, పంట నష్టం అంచనాపై అధికారులను నిలదీశారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మం దిరంలో శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ పద్మ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్ బీ, పీఆర్, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, హరితహారంపై సమీక్షించారు. - సమావేశాలకు పూర్తి సమాచారం, అవగాహనతో రావాలని అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశం - రాయితీ ట్రాక్టర్లలో అవకతవకలపై కోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధమన్న జెడ్పీ వైస్‌చైర్మన్ మురళీధర్ హన్మకొండ : జిల్లాలోని అధికారుల పనితీరు సరిగా లేదని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. సమావేశాలకు పూర్తి సమాచారంతో రాకపోవడంతోపాటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, పీఆర్, విద్య, వైద్య ఆరోగ్య శాఖలు, హరితాహారంపై సమీక్షించారు. వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ఆ శాఖ ద్వారా అమలవుతున్న యాంత్రీకరణ అమలలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని, జెడ్పీటీసీ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. జిల్లాకు 135 ట్రాక్టర్లు రాయితీపై మంజూరైతే కనీసం ప్రచారం చేయడం లేదని, 135 ట్రాక్టర్లకు 135 దరఖాస్తులే వస్తాయా అని జెడ్పీ వైస్‌చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ నిలదీశారు. రైతులకు రాయితీపై ట్రాక్టర్లు ఇస్తున్నామని ఆ శాఖ అధికారులు కనీస సమాచారం ఇవ్వలేదని, ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని లేవనెత్తిపుడు సమాచారం అందించని ఏడీఏ, ఏఓల పై చర్య తీసుకుంటామని చెప్పారని, ఏ చర్య తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నర్సంపేటలో రాత్రికి రాత్రే దరఖాస్తు తీసుకుని ట్రాక్టర్ కేటాయించారన్నారు. రాయితీ ట్రాక్టర్లలో జరిగిన గోల్‌మాల్‌పై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్లడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. స్పందించిన కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ రాయితీ ట్రాక్టర్ల కేటాయింపుపై విచారణ జరిపించామని, ట్రాక్టర్లు తీసుకున్న రైతులంతా అర్హులేనని తేలిందన్నారు. దీంతో సంతృప్తి చెందని సభ్యులు పథకం అమలు తీరు సరిగా లేదన్నారు. దీంతో కలెక్టర్ పూర్తి స్థాయి విచారణ జరిపిస్తానన్నారు. గణపుణం జెడ్పీటీసీ సభ్యుడు, టీడీపీ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ శివశంకర్ మాట్లాడుతూ తమ మండలంలో రెండు ట్రాక్టర్లు కేటాయిస్తే ఇందులో అర్హులు ఎవరు లేరన్నారు. ఒకరైతే హన్మకొండలో నివాసముంటూ వ్యాపారం చేసుకుంటున్నారని, రైతు కాని వ్యాపారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మహబూబాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు, కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెంకన్న మాట్లాడుతూ రాయితీ యంత్రాలు రైతులకు చేరడం లేదన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్న ఎందుకు జాప్యం జరుగుతుందని నిలదీశారు. స్పందించిన కలెక్టర్ కరుణ మాట్లాడుతూ బ్యాంకర్లతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు రుణాలివ్వాలని చెపుతున్నామన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటల అంచనా జరుగుతుందన్నారు. వారం రోజుల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వ్యవసాయ శాఖ ఇన్చార్జి జేడీఏ గంగారాం మాట్లాడుతూ ఖరీఫ్‌లో ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి జరగాల్సిన రైతు చైత్యన యాత్రలు వాయిదా పడ్డాయన్నారు. మిషన్ కాకతీయలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ సూచించారు. శిఖం హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. చెరువులకు రివిట్మెంట్ ఉండేలా చూడాలని ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచించారు. చెరువులు పునరుద్ధరించగానే సరిపోదని జనగామ ప్రాంత చెరువులను గోదావరి జలాలతో నింపాలని, అప్పుడే సార్థకత ఉంటుందన్నారు. రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి మాట్లాడుతూ చెరువుల ఎఫ్టీఎల్ హద్దులు ఎందుకు నిర్ణయించడం లేదని, దీంతో చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. స్పందించిన కలెక్టర్ కరుణ సర్వేయర్ల కొరత ఉందని, థర్డ్ పార్టీ ద్వారా ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించే పనిని చేపట్టనున్నట్లు చెప్పారు. రెవెన్యూ, నీటిపారుదల అధికారులు సమన్వయంతో హద్దుల ఏర్పాటు జరుగుతందన్నారు. చెరువుల మరమ్మతు పనుల్లో అక్రమాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఏటూరునాగారం జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ అన్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కరుణ చెప్పారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కకుండా ముందుగానే అన్నీ చర్యలను ప్రభుత్వం తీసుకుందన్నారు. నీటి ఎద్దడి నివారణకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఆర్అండ్బీ, నేషనల్ హైవే, పీఆర్ అధికారులు సరైన సమాచారంతో రాకపోవడంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేశారు. ఇక ముందు సమావేశాలకు వచ్చేటపుడు శాఖ, చేపట్టిన పనులపై అవగాహన ఏర్పరచుకుని రావాలన్నారు. సభ్యులు అడిగిన వెంటనే సమాధానం చెప్పాలని సూచించారు. అధికారులు సక్రమంగా పని చేయాలని సూచి స్తున్నా.. అగ్రిమెంట్ సమయంలోనే పర్సంటేజీలు తీసుకుంటున్నారని సభ్యులు ఆరోపించారు. భీమారం, మడికొండ చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ది చేయాలని, తద్వారా నగర ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు దోహదపడుతాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ప్రాథమిక అరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని, కనీసం మండల ప్రజాపరిషత్ సమావేశాలకు కూడా రావడం లేదని సభ్యులు వైద్యాధికారులు తీరుపై మండిపడ్డారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ అధికారులు పని తీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. -
అంత కసి ఎందుకు కంగనా?!
గాసిప్ కంగనా రనౌత్ అంటే గ్లామర్ స్టార్ అనేవారు మొదట్లో. కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ క్వీన్ అంటున్నారు. ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్ లాంటి చిత్రాలతో నటిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతీయ అవార్డును సైతం అందుకుంది కంగనా. అయితే అందుకు సంతోషపడాల్సింది పోయి... అనవసరంగా పాత విషయాలన్నీ తవ్వుతోంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న నాటి నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనూ తనను చాలామంది ఎదగనివ్వలేదని, అయినా కష్టపడి ఎదిగానని చెప్పుకుంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అయితే... నన్ను వెన్నుపోటు పొడవాలని చూసినవాళ్లు, వెనక్కి లాగాలని చూసినవాళ్లు అంటూ ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద తలకాయలను టార్గెట్ చేసి మాట్లాడింది. దాంతో ఆ పెద్దలు రుసరుసలాడుతున్నారని సమాచారం. ఇక్కడ నటించడం తెలిస్తే చాలదు, ప్రవర్తించడం కూడా తెలియాలి అని కొందరు కంగనాకి సలహా కూడా ఇస్తున్నారట. కంగనా ఆ సలహాను పాటిస్తుందో లేదో మరి! -
హీరోల పక్కన చోటు వద్దా?!
గాసిప్ హీరోయిన్గా ఎంత గ్లామర్ ఒలకబోసినా... ఎప్పుడూ పర్ఫార్మెన్స్ని నిర్లక్ష్యం చేయలేదు ప్రియాంక. మొదట్నుంచీ హీరోతో పాటు తనకూ ప్రాధాన్యత ఉండేలా చూసుకుంది. పోటీపడి నటించింది. అయితే ఇప్పుడు ఏకంగా హీరోలని మించిపోతోంది. గత కొంతకాలంగా హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్‌నే ఎక్కువగా ఎంచుకుంటూ వస్తోంది ప్రియాంక. ఫ్యాషన్, మేరీకోమ్ లాంటి చిత్రాలతో స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. త్వరలో ఓ ఇంటర్నేషనల్ టెలివిజన్ షోలో ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా కనిపించబోతోంది. ఫైట్లవీ బాగా చేయాలి కాబట్టి ఎంతసేపూ జిమ్‌కే అతుక్కుపోతోం దని, వర్కవుట్లతోనే కాలం గడుపుతోందని సమాచారం. ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి రావడాన్ని కొందరు హర్షిస్తుంటే... కొందరు మాత్రం... ఇలా తనే హీరోలా ఫీలయ్యి చేస్తూ ఉంటే, కొన్నాళ్లకు హీరోల పక్కన చోటు కరువవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఆ హెచ్చరికలు ప్రియాంక చెవిన పడ్డాయో లేదో! -
మూగరోదన
60 ఆవులకు రెండు రోజులు నరకయాతన 17 మృతి, ఎనిమిదింటి పరిస్థితి విషమం గడువు తీరిన బొంబాయి రవ్వే కారణం గోశాలలో నిబంధనలు శూన్యం అడ్డూఅదుపులేని నిబంధనలు.. అందుబాటులో లేని సౌకర్యాలు.. అక్కరకు రాని వైద్యం.. మల్లికార్జునపేట గోశాల నిర్వహణ తీరును ప్రశ్నిస్తున్నాయి. తక్కువ రేటుకు వస్తుందన్న సాకుతో కాలంచెల్లిన బొంబాయిరవ్వను తినిపించిన కనికరం లేని మనుషుల మధ్య మూగజీవాలు నలిగిపోతున్నాయి. కలుషిత ఆహారం తిని 17 ఆవులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో గోశాలలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడ : మల్లికార్జునపేటలో గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో కలుషిత ఆహారం తిని 17 ఆవులు మృతిచెందిన ఘటన చర్చనీయాంశమైంది. సుమారు వందేళ్లుగా నడుస్తున్న ఈ గోశాలలో ఒకేసారి సుమారు 60 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురికావడం, వాటిలో 17 చనిపోవడం, మరో ఎని మిదింటి పరిస్థితి విషమంగా ఉండటం గోప్రేమికులను కలవరపరుస్తోంది. మరో రెండు రోజులు గడిస్తే కానీ గోవులు పూర్తిగా కోలుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పాపం ఎవరిది? గోశాలలో మూడు షెడ్లలో 280 ఆవులు ఉన్నాయి. ఇందులో కొన్ని వయస్సు మళ్లినవి కాగా, కొన్ని సాధారణ, మరికొన్ని చూడి ఆవులు. సోమవారం ఉదయం భవానీ ట్రేడర్ నుంచి తెప్పించిన సుమారు 750 కేజీల బొంబాయిరవ్వను ఆవులకు మేతగా వేశారు. ఈ రవ్వను జనవరిలోగానే ఉపయోగించాల్సి ఉంది. గడువు తీరిన బొంబాయి రవ్వను అధిక మోతాదులో తినడం వల్లే మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. మంగళవారం ఉదయానికే సుమారు 60 ఆవులు అస్వస్థతకు గురైనట్లు వెటర్నరీ వైద్యులు గుర్తించారు. 35 ఆవులు కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని ఆవులు కింద పడే ఉన్నాయి.. ఇంకొన్ని కళ్లు తేలేశాయి. ఉదయం నుంచి ఆహారం, నీరు ముట్టలేదు. దీంతో వెటర్నరీ వైద్యులు ఏడు బృందాలుగా ఏర్పడి వైద్యసేవలు అందించినా బుధవారం సాయంత్రం వరకు గోవులు నరకయాతన అనుభవిస్తూనే ఉన్నాయి. తీవ్రంగా అనారోగ్యం పాలైన 17 ఆవులు చనిపోయాయి. మిగిలిన ఆవులకు సెలైన్లు, గ్లూకోజ్‌లు అందించి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు 15 చూడి ఆవులు గర్భస్రావం అవుతాయేమోననే ఆందోళనలో వైద్యులు ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన భవానీ ట్రేడర్స్ వ్యాపారి సాంబశివరావును వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని గడువు ముగిసిన బొంబాయి రవ్వను గో సంరక్షణ సంఘం ప్రతినిధులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఆహారంపై నిబంధనలు నిల్ నిత్యం అనేకమంది భక్తులు గోశాలకు వచ్చి గోవులకు కావాల్సిన మేత వేస్తుంటారు. దాతలు వేసే మేతపై ఎటువంటి నియంత్రణ లేదు. గోవులకు ఏవిధమైన ఆహారం ఇవ్వొచ్చు, ఏది ఇవ్వకూడదనే సూచనలు తెలియజేసే నోటీసు బోర్డులు గో సంరక్షణ కేంద్రంలో లేవు. వాస్తవానికి బొంబాయి రవ్వ, అన్నం, గంజి, స్వీట్లను ఆవులకు అధిక పరిమాణంలో ఇవ్వకూడదు. అయితే, కొంతమంది దాతలు గోవులకు స్వీట్లు, అన్నం పెడుతున్నట్లు సమాచారం. దాతలు ఇచ్చే ఆహారాన్ని నిర్వహకులు తనిఖీ చేయడం లేదు. అంబులెన్స్, వైద్య సలహాలు అంతంతమాత్రమే ఆవులకు అత్యవసర వైద్యం కోసం లబ్బీపేటలోని పశువైద్యశాలకు తీసుకువెళ్లాలంటే అంబులెన్స్ వంటి కనీస సౌకర్యం లేదు. దీంతో అస్వస్థతకు గురైన ఆవుల్ని అక్కడే ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రతి మంగళవారం పశువైద్యుడు వచ్చి గోవులకు పరీక్షలు చేస్తారు తప్ప ఏయే వాతావరణ పరిస్థితుల్లో పశువులకు ఏవిధమైన ఆహారం ఇవ్వాలి అనే సూచనలు ఇస్తున్న దాఖాలాలు లేవు. వెంటి లేషన్, ఫ్లోరింగ్, దాణా తొట్లు, మురుగునీరు పోయే సౌకర్యాలు మాత్రం బాగానే ఉన్నాయి. కేసు మాఫీకి యత్నం 17 మూగజీవాల మరణానికి కారణంపై మంత్రి దేవినేని ఉమా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించే కంటే వారిని రక్షించేందుకే ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు కావాల్సిన నివేదికలు తయారవుతున్నాయని అధికార పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. -
రాజసం చాటిన గిత్తలు
నెల్లూరు(అగ్రికల్చర్): ఒంగోలు జాతి పశువుల ప్రద్శనలో భాగంగా గిత్తలు తమ రాజసం చాటారుు. నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు లో ఉన్న పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మైదానంలో చివరి రోజైన ఆదివారం గిత్తల ప్రదర్శన కోలాహలంగా సాగింది. ఫైనల్‌గా పూం డ్ల వెంకురెడ్డి గోశాలకు చెందిన ఆవు, గిత్తల విభాగంలో కర్నూలు జిల్లా కాటం మురళీధర్‌కు చెందిన గిత్త ఛాంపియన్లుగా నిలిచారుు. గిత్తకు కిలో వెండి, ఆవుకు అరకిలో వెండి బహూకరించారు. ప్రదర్శనను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆసక్తిగా తిలకించారు. పశువుల యజమానులతో ముచ్చటించడటంతో పాటు ఒంగోలు జాతి పశుసంపద వృద్ధిలో వారి కృషిని అభినందించారు. ప్రదర్శనను తిలకించిన ప్రముఖుల్లో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, కార్పొరేటర్ ఆనం రంగమయూర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. గోసంపదను రక్షించుకోవాలి: మేకపాటి రాజమోహన్‌రెడ్డి గోసంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఒక ఆవు సాయంతో 30 ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేయవచ్చన్నారు. ఆర్గానిక్ వ్యవసాయంతో రసాయనాల్లేని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పొందవచ్చన్నారు. పశుసంపదను కాపాడుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగుచర్యలు తీసుకోవాలన్నారు. పూండ్ల వెంకురెడ్డిచారిటబుల్ట్రస్ట్ నిర్వహిం చిన ఒంగోలు జాతి అందాల పశువుల ప్రదర్శనతో నెల్లూరుకు ఎనలేని గుర్తింపు వచ్చిందని వెంకురెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు. ఒంగోలుజాతిని రక్షించుకోవాలి: మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఒంగోలు జాతి పశువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. బహుమతి ప్రదానోత్సవానికి ఆ యన ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. సింధు నాగరికత కాలం నుంచి పశువులు వ్యవసాయానికి ఆసరాగా ఉండేవని పేర్కొన్నారు. ఒంగోలు, గుండ్లకమ్మ పరిసర ప్రాంతాల్లోని పశుగ్రాసంలో కాల్షియం,భాస్వరం ఎక్కువగా ఉండడంతోఒంగోలు జాతి పశువులు అభివృ ద్ధి చెందాయని వివరించారు. కార్యక్రమంలో పూండ్ల వెంకురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకురెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ సతీష్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ సుబ్బారెడ్డి, డా క్టర్ వెంకటేశ్వరరావు, శ్రీనివాసులురెడ్డి, సీతారామిరెడ్డి, వెంకటస్వామిరెడ్డి పాల్గొన్నారు. ఆసక్తిగా సాగిన గిత్తల పోటీలు చివరి రోజు ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శన ఆ సక్తికరంగా సాగింది. పాలపళ్ల విభాగంలో నె ల్లూరు ఫత్తేఖాన్పేటకు చెందిన పిండి సురేష్‌బాబు, వైఎస్సార్ కడప జిల్లా నెల్లూరు కొట్టాలకు చెందిన చిలంకూరి కిరణ్‌కుమార్‌రెడ్డి, అ దే జిల్లా కేతవరానికి చెందిన గవిరెడ్డి సావి త్రమ్మ గిత్తలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారుు. కన్సోలేషన్ బహుమతి చిలంకూరి కిరణ్‌కుమార్‌రెడ్డికి చెందిన గిత్త దక్కించుకుంది. ఒక జత పళ్ల గిత్తల విభాగంలో గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన శ్రీరాందుర్గాప్రసాద్, నాదెండ్లకు చెందిన నల్లబోరుుల శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు, నెల్లూరుకు చెందిన పిండి సురేష్‌బాబు గిత్తలు వరుసగా మొదటి మూడు స్థానాలను సొంతం చేసుకున్నారుు. రెండు జతల పళ్ల గిత్తల విభాగంలో పూండ్ల వెంకురెడ్డి ట్రస్టుకు చెందిన గిత్తలు ప్రథమ, ద్వితీయ, పిండి సురేష్‌బాబు గిత్త తృతీయ స్థానాల్లో నిలిచారుు. మూడు జతల పళ్ల గిత్తల విభాగంలో ప్రకాశం జిల్లా పొట్టెపాడుకు చెందిన బనిగల నరసింహరావు, అదే జిల్లా వంకాయలపాడుకు చెందిన భవనం వెంకటరత్నారెడ్డి, గుంటూరుజిల్లా కొర్రపాడుకు చెందిన ఎరువ హనిమిరెడ్డికి చెందిన గిత్తలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించారుు. పూర్తిస్థాయి గిత్తల విభాగంలో కర్నూలు జిల్లాకు చెందిన కాటంమురళీధర్రెడ్డి గిత్తకు ప్రథమస్ధానం, గుంటూరు జిల్లా పాత ఎల్లాయపాళేనికి చెందిన కాసు అయ్యప్పరెడ్డి గిత్తకు ద్వితీయస్థానం, ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన కల్యాణ్ ఆక్వా ప్లాంట్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ వారి గిత్తకు తృతీయ స్థానం దక్కింది. ప్రకాశం జిల్లాకు చెందిన అట్ల సత్యనారాయణ, నలుబోలు కోటయ్యల గిత్తలు కన్సోలేషన్ బహుమతులు దక్కించుకున్నారుు. -
మీ పనితీరు మారాలి
అనంతపురం టౌన్ : ‘మీ పనితీరు మారకపోతే ఇబ్బంది పడతారు. నగర, పురపాలక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదు. రెవెన్యూ వసూళ్లు ఆశించి స్థాయిలో లేవు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు కేవలం రెండు నెలలు గడువు ఉంది. వంద శాతం వసూలు లక్ష్యంగా పనిచేయండి. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవంటూ అధికారులను ఆర్డీఎంఏ మురళీకృష్ణగౌడ్ హెచ్చరించారు. మంగళవారం ఆర్డీఎంఏ కార్యాలయంలో నగర, పురపాలక సంఘాల రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ వృద్ధిపై కంట్రీ టౌన్ ప్లానింగ్ ఆర్జేడీ బాలాజీతో కలిసి అనంతపురం, కర్నూలు జిల్లాల మునిసిపల్ అధికారులతో సమీక్షించారు. ఆదాయం వంద శాతం వసూలు కాకపోతే మునిసిపాలిటీ ఆర్థికంగా ఎలా బలపడతాయని ప్రశ్నించారు. సంస్థలకు వచ్చే ఆదాయాల్లో ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో రాబట్టడం లేదన్నారు. ఇలాగైతే కనీస స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కూడా నిధులు ఉండవనే విషయం మీకు తెలియదాని ప్రశ్నించారు. ‘ప్రధానంగా ఆస్తి పన్ను వసూలులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లా పరిధిలో ఆస్తి పన్ను వసూలు డిమాండ్ రూ.35.89 కోట్లు ఉంటే రూ.20.44 కోట్లు వసూలయ్యింది. కర్నూలు జిల్లా పరిధిలో రూ.39.43 కోట్లు ఉంటే రూ.19.88 కోట్లు వసూలు అయ్యింది. నీటి చార్జీల వసూలులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోట్ల రూపాయల్లో వసూలవ్వాల్సి ఉంది. మొండి బకాయిలు వసూలుపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఏటా బకాయిలు చేంతాడులా పెరిగిపోతున్నాయ’ంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘డేంజర్ ఆఫ్ అఫెన్సీవ్ ట్రేడ్ (డీఓటీ) లెసైన్స్ ఫీజు, ప్రకటన పన్ను, ఎన్‌క్రోచ్‌మెంట్ ఫీజు, దుకాణాల లీజు, తదితర వాటి ద్వారా వచ్చే రెవెన్యూని పూర్తి స్థాయిలో రాబట్టడం లేదు. వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. సంస్థలు సొంత ఆదాయాన్ని పెంపొందించుకుని ఆర్థికంగా బలోపేతమై అభివృద్ధి పనులు చేసుకోవాలి. మార్చి 31 నాటికి ఆస్తి పన్ను వందశాతం వసూలవ్వాలి. పన్నేతర ఆదాయం కూడా వందశాతం వసూలు చేయాలి’ అని ఆదేశించారు. రెవెన్యూ వసూళ్ల విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు ఉంటాయి జాగ్రత్తంటూ హెచ్చరించారు. సమావేశంలో కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.ఎస్.మూర్తి, అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ నాగవేణి, ఇతర మునిసిపాలిటీల కమిషనర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
ఆర్ట్ ఈజ్ లైఫ్..
నందు మనవడిని పొదివి పట్టుకుని పేవ్‌మెంట్‌పై ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న అమ్మమ్మ ఆలింగనంలో ఆర్తి ఉంది. తుది శ్వాస వరకూ మనవడి భవిష్యత్తుకు ఆసరాగా నిలవాలన్న ఆదుర్దా ఉంది. వీటిని యథాతథంగా ప్రతిఫలింపజేసిన వర్ణ చిత్రం ఆహూతుల్ని ఆకట్టుకుంది. మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం ప్రారంభమైన ఆర్ట్‌లైఫ్ ఎట్ 55 ప్రదర్శన ఇలాంటి అర్థవంతమైన చిత్రాలకు వేదికైంది. గోమాతతో ముచ్చట్లాడుతున్న బాలుడి వదనంలో సంతోషాన్ని, ఆర్ఫన్ హోమ్‌లోని చిన్నారి దీనమైన చూపుల్ని ఒడిసిపట్టుకున్న చిత్రకారిణి ఎన్ఆర్ఐ రాధా వల్లూరి అచ్చమైన భారతీయతను ప్రతిబింబించే చిత్రాలను గీసి కళాభిమానుల ప్రశంసలు అందుకున్నారు. చిత్ర ప్రదర్శనను దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రారంభించారు. సినీ హీరో నందు, హీరోయిన్లు విమలారామన్, నిఖితా నారాయణన్, పేజ్‌త్రీ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సినీనటి సమంత ఆధ్వర్యంలోని ప్రత్యూష సపోర్ట్‌కు నిర్వాహకులు ఆర్థిక సహాయం అందించారు. -
పనితీరు మారకపోతే చర్యలు
అధికారులకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి హెచ్చరిక అనంతపురం మెడికల్: ‘జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకారం చేపడుతున్నట్లుగా కనిపించడం లేదు.. మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నట్లున్నారు.. క్రమశిక్షణారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది.. మాతాశిశు మరణాలు, ఆస్పత్రిలో ప్రసవాలు నిర్వహించే అంశాల్లో ైవె ఫల్యాన్ని మీ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి’ అని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మారకపోతే చర్యలు తప్పవని అధికారులను ఆయన హెచ్చరించారు. ఆదివారం జిల్లాకు విచ్చేసిన ఆయన వైద్య కళాశాలలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డెరైక్టర్ వెంకటేశ్, కళాశాల ప్రిన్సిపాల్ నీరజ, డీఎంహెచ్ఓ రామసుబ్బారావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బోధనాస్పత్రి సూపర్‌స్పెషాలిటీ స్థాయి తరహా సేవలు అందించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. ఇందుకు సంబంధించిన నిధులు వినియోగించుకోలేక పోతే మురిగిపోతాయన్నారు. ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు కావడం లేదనేది స్పష్టమవుతోందన్నారు. ప్రధానంగా మాతా శిశు మరణాలను అరికట్టడంలో వైఫల్యం కనిపిస్తోందన్నారు. ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా చూడడం లేదు. గర్భిణీలకు ఆరోగ్య సిబ్బంది అంగరక్షకులుగా పనిచేయాలని సూచించారు. గర్భిణులకు సంబంధించిన వివరాలు మీ వద్ద ఉన్నట్లులేదు. రేపటి నుంచే డేటా సేకరణ సర్వే ప్రారంభించి, జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మనం ప్రజల కోసమే ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకుని పనిచేయాలని హితువు పలికారు. సమావేశంలో అదనపు వైద్యాధికారి వెంకటరమణ, అదనపు వైద్యాధికారి (ఎయిడ్స్ కంట్రోల్) సాయిప్రతాప్, ఆర్ఎంఓ కన్నెగంటి భాస్కర్, ఆస్పత్రుల సమన్వయ కర్త రామకృష్ణరావు, మలేరియా అధికారి ఆదినారాయణరెడ్డి, జబార్ కో-ఆర్డినేటర్ విజయమ్మ, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు. -
నాట్యామృతం
నాంపల్లి: వినసొంపైన శాస్త్రీయ సంగీతం... చూడ చక్కని హావభావాలు...అభినయం... ప్రేక్షకుల మదిని దోచేశాయి. ఆనందప్రియ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా మందిరంలో గీతా గణేషన్ శిష్య బృందం ‘శ్రీ కృష్ణ లీలామృతం’ రూపకాన్ని ప్రదర్శించింది. గీతా గణేషన్ శిష్యురాళ్లు వి.కె.రిషిక, అమృత ముంగికర్, డి.ఎస్.అదితి, అమూల్య మంజా, శివాని, భువనేశ్వరి, శ్రీవేణి, శ్రావ్య, శాంభవి, రసజ్ఞ కలిసి ‘శ్రీ కృష్ణ లీలామృతం’ భరతనాట్య ప్రదర్శనను ఆద్యంతం రక్తికట్టించారు. తొలుత అమృత వర్షిణి రాగంలో వినాయక స్తుతి... ‘గజవాదన బిడువెను గౌరీ తనయా’ అనే కీర్తనతో ప్రదర్శన ప్రారంభమైంది. రెండోఅంశంగా రాజీ నారాయణ్ రచించిన ‘వర్ణం’ కల్యాణి రాగంలో సాగింది. ‘గోకుల బాల... గోపియ లోల..’ అనే కీర్తనలో శ్రీకృష్ణ జననం, పూతన సంహారం, గోవర్ధనగిరి ధారణం, కాళింది మర్దనం, ద్రౌపదీ మాన సంరక్షణ, గీతోపదేశం తదితర అంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. అనంతరం సురేష్ భట్ భావగీతాలపనలో భాగంగా ప్రదర్శించిన గోపికా కృష్ణుల క్రీడలు కళాకారుల ప్రతిభకు దర్పణం పట్టాయి. సారంగ రాగంలో మాధురి ఎన్.కృష్ణన్ స్వరపరిచిన గీతాన్ని చివరి అంశంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు మృదంగంతో రామకృష్ణ, శ్రీకాంత్(తబలా), కోలంకన్ అనిల్ కుమార్(వయొలిన్) వాద్య సహకారం అందించారు. నాట్య గురువులు యశోద ఠాగూర్, డాక్టర్ హేమమాలిని, ప్రియదర్శిని గోవింద్‌లు కళాకారులను అభినందించారు. అంతకు ముందు జరిగిన సభలో గీతా గణేషన్ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆనందప్రియ ఫౌండేషన్ పని చేస్తున్నట్లు వివరించారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం వంటి భారతీయ కళల్లో ఎంతో మందికి శిక్షణనిస్తున్నట్టు చెప్పారు. -
మంత్రులకు చంద్రబాబు క్లాస్!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు క్లాస్ తీసుకున్నారు. పనితీరు బాగోలేదని సగానికిపైగా మంత్రులపై చంద్రబాబు అసంతృప్తిని వెళ్లగక్కారు. పనితీరు ఆధారంగా ఏ, బీ, సీ గ్రేడులు కేటాయిస్తూ మంత్రులకు చంద్రబాబు షాకిచ్చారు. ఏ గ్రేడులో ఆరుగురు మంత్రులకు చంద్రబాబు అవకాశం కల్పించినట్టు తెలిసింది. మంత్రుల పనితీరును ప్రతిరోజు సమీక్షించేందుకు రహస్య యంత్రాంగం ఏర్పాటు చేశారు. వంద రోజుల తర్వాత పూర్తి స్థాయి గ్రేడుల వారీగా సమీక్షలు నిర్వహిస్తామని మంత్రులకు చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు పంపారు. -
కాసులు కురిపిస్తేనే ‘ఫైర్’ సర్టిఫికెట్?
బాన్సువాడ, న్యూస్‌లైన్ :జిల్లాలో అగ్నిమాపక శాఖ అధికారుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆ శాఖకు ప్రాముఖ్యత లేకున్నా, ఉన్న కొద్ది అధికారాలను వినియోగించుకోవడంలో ఆశాఖలో కొందరు అధికారులు ఆరితేరారు. బీమా కోసం వాహనాలకు ఫైర్ సర్టిఫికెట్ జారీ చేయడం, ప్రైవేటు స్కూళ్లకు గుర్తింపు సందర్భంగా జారీచేసే ఫైర్ సర్టిఫికెట్, దీపావళి సందర్భంగా ట పాకాయలకు ఇచ్చే నో ఆబెక్షన్ సర్టిఫికెట్లను డబ్బులు ఇవ్వనిదే జారీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తికి ఫైర్ సర్టిఫికెట్ జారీకి లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ సురేశ్ ఏసీబీ అధికారులకు చిక్కడ మే నిదర్శనం. ఇదీ సంగతి.. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు విషయంలో కీలకంగా మారిన ఫైర్ సర్టిఫికెట్ పైసలవ్వనిదే జారీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అధిక పాఠశాలలు గుర్తింపు విషయంలో వెనుకంజ వేయడానికి ఫైర్ సర్టిఫికెట్ కారణమని తెలుస్తోంది. ఈ సర్టిఫికెట్ పొందడానికి భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉన్నందునే దరఖాస్తు చేయడం లేదని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. జిల్లాలో విద్యా శాఖ లె క్కల ప్రకారం దాదాపు వందకు పైగా గుర్తింపులేని పాఠశాలలు ఉన్నాయి. వీటి లో 50 శాతం పాఠశాలల యాజమాన్యం గుర్తింపు కోసం దరఖాస్తు చే శాయి. అయితే ఫైర్ సర్టిఫికెట్ తీసుకొనే విషయంలో భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సి రావడంతో, గుర్తింపు కోసం ముందుకు రావడం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. మారిన నిబంధనలు.. కొన్నేళ్ల క్రితం త మిళనాడులోని కుంభకోణం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ప్రతి పాఠశాలలో విద్యార్థుల రక్షణ దృష్ట్యా అగ్ని నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఒక పాఠశాలకు గుర్తింపు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ఫైర్ ఆఫీసర్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. పాఠశాలలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే పాఠశాలలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పైపుల ద్వారా మంటలు ఆర్పివేస్తారు. అంతేకాకుండా కార్చన్ మోనాక్సైడ్ సిలిండర్స్ కూడా పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి. ఇవన్నీ పాఠశాలలో ఉన్నాయని, పాఠశాలలో షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేదని, ఎలక్ట్రికల్, ఫైర్ ఆఫీసర్లు ధ్రువీకరించాలి. ఈ వ్యవహారం పూర్తయిన తర్వాత పాఠశాలకు గుర్తింపు ఇవ్వాలనే నిబంధన విధించారు. ఇలా అగ్నిమాపక శాఖ నుంచి సర్టిఫికెట్ పొందాలంటే సుమారు ’10 నుంచి 25వేల వరకు ఒక్కో పాఠశాల చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొందని పాఠశాలల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బీమా కోసం వాహనాలకు జారీ చేయడంలో, టపాకాయల దుకాణాలకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు డబ్బులు ఇవ్వనిదే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులకు తప్పని ఇబ్బందులు జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాల్లోని పాఠశాలకు గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రతి స్థాయిలో ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. శానిటరీ సర్టిఫికెట్, సౌండ్ పొల్యూషన్ లేదని నిరభ్యంతర సర్టిఫికెట్, ఫైర్ సర్టిఫికెట్, ఆట స్థలం ఉందని సర్టిఫికెట్ ఇలా అనేక రకాల సర్టిఫికెట్లు విద్యా శాఖకు సమర్పించాలి. ఎవరి స్థాయిలో వారు అందినంత దోచుకోవడంతో పాఠశాలకు గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలంటేనే యాజమాన్యాలు హడలెత్తిపోతున్నాయి. గుర్తింపు పొందడానికి ఫైర్ సర్టిఫికెట్ కావాల్సి ఉండడంతో అగ్నిమాపక శాఖకు కలిసివస్తోంది. -
ఆహార అభద్రత
జిల్లాలో ఆహార భద్రత శాఖ పనితీరు దారుణంగా ఉంది. ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు సీమాంధ్ర ప్రాంతంనుంచి అప్ అండ్ డౌన్ చేస్తుండడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ఆరు నెలల కాలంలో 48 కేసులే నమోదు కావడం, జూన్ 15 తర్వాత ఒక్క కేసూ లేకపోవడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనం. ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : ఆహార పదార్థాల కల్తీని నిరోధించడంలో ఆహా ర భద్రత శాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఈ శాఖ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. గతంలో ఈ శాఖను ఆహార కల్తీ నిరోధక శాఖ అని పిలిచేవారు. 2011 ఆగస్టు 8వ తేదీన ఆహార భద్రత శాఖగా పేరు మార్చారు. అయితే ఈ విషయం శాఖ అధికారులకు తెలియదో, లేదా పట్టించుకోలేదో.. బోర్డు మాత్రం మార్చలేదు. ఇటీవల ఈ విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు బోర్డుపై పేరు మార్పించారు. సీమాంధ్ర నుంచి అప్ అండ్ డౌన్.. ఆహార భద్రత శాఖ అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు నెలల క్రితం జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి గంగాధర్ వైఎస్సార్ కడప జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానం రెండు నెల ల పాటు ఖాళీగా ఉంది. ఇన్చార్జి బాధ్యతలు సైతం ఎవరికీ అప్పగించ లేదు. నెలక్రితం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారిగా అమృతశ్రీ వచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రసాద్, ప్రహ్లాద్‌లు స్థానికంగా ఉండరు. ప్రసాద్ అనే అధికారి విజయవాడనుంచి వచ్చి వెళుతుంటారు. ప్రహ్లాద్ అనే అధికారి కర్నూలునుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దీంతో వీరు ఎ ప్పుడు వస్తున్నారో ఎంతసేపు ఉంటున్నారో తెలియని పరిస్థితి. గతంలో జిల్లా ఉన్నతాధికారి లేనందున తనిఖీలు చేయడం లేదని తప్పించుకున్నారు. జిల్లా అధికారి వచ్చిన తర్వాత కూడా వీరు ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదు. ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు 48 కేసులే నమోదు కావడం గమనార్హం. అందులో జూలై 15 నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా వంద కేసులు నమోదు చేశామని శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఫిర్యాదు వస్తే స్పందిస్తాం -అమృతశ్రీ, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి గతంలో జిల్లాలో ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి లేకపోవడంతో తనిఖీలు నిర్వహించలేదు. ఫిర్యాదులు వస్తే స్పందిస్తాం. తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేస్తాం.