గారడి కాదు...కనికట్టు కాదు.. యోగా ట్రిక్కు అంతకన్నా కాదు...సజీవంగా ఉన్న పామును ముక్కులోంచి పంపించి, నోటి ద్వారా బయటికి తీస్తున్న వైనం ఇపుడు సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్ కరాచీకి చెందిన ఇక్బాల్ చేస్తున్న ఆ సాహస ప్రదర్శన ఇపుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది.