అంత కసి ఎందుకు కంగనా?! | Kangna antakasi Why ? | Sakshi
Sakshi News home page

అంత కసి ఎందుకు కంగనా?!

Published Wed, May 13 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

అంత కసి  ఎందుకు కంగనా?!

అంత కసి ఎందుకు కంగనా?!

గాసిప్

కంగనా రనౌత్ అంటే గ్లామర్ స్టార్ అనేవారు మొదట్లో. కానీ ఇప్పుడు పర్‌ఫార్మెన్స్ క్వీన్ అంటున్నారు. ఫ్యాషన్, తను వెడ్స్ మను, క్వీన్ లాంటి చిత్రాలతో నటిగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించి జాతీయ అవార్డును సైతం అందుకుంది కంగనా. అయితే అందుకు సంతోషపడాల్సింది పోయి... అనవసరంగా పాత విషయాలన్నీ తవ్వుతోంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్న నాటి నుంచి ప్రతి ఇంటర్వ్యూలోనూ తనను చాలామంది ఎదగనివ్వలేదని, అయినా కష్టపడి ఎదిగానని చెప్పుకుంటోంది.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అయితే... నన్ను వెన్నుపోటు పొడవాలని చూసినవాళ్లు, వెనక్కి లాగాలని చూసినవాళ్లు అంటూ ఇండస్ట్రీలోని కొన్ని పెద్ద తలకాయలను టార్గెట్ చేసి మాట్లాడింది. దాంతో ఆ పెద్దలు రుసరుసలాడుతున్నారని సమాచారం. ఇక్కడ నటించడం తెలిస్తే చాలదు, ప్రవర్తించడం కూడా తెలియాలి అని కొందరు కంగనాకి సలహా కూడా ఇస్తున్నారట. కంగనా ఆ సలహాను పాటిస్తుందో లేదో మరి!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement