పోలీసు సిబ్బంది పనితీరు పరిశీలన
కర్నూలు: బ్యాంకుల వద్ద పోలీస్ సిబ్బంది పనితీరును శుక్రవారం.. ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. శుక్రవారం ఉదయం కర్నూలులోని స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ దగ్గర క్యూలైన్‌లో నిలబడిన ఖాతాదారులతో మాట్లాడారు. ఉద్యోగులకు, పింఛన్‌దారులకు నగదు చెల్లింపుల విషయంలో ఎలాంటి జాప్యం చేయరాదని బ్యాంకు అధికారులకు సూచించారు. ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ మురళీధర్‌తో నగదు రహిత లావాదేవీల గురించి చర్చించారు. ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ రమణమూర్తి కూడా ఉన్నారు.