వింగ్స్ ఇండియా–2024లో వైమానిక విన్యాసాలను తిలకిస్తున్న నగరవాసులు
సనత్‌నగర్ (హైదరాబాద్): బేగంపేట విమానాశ్రయం వేదికగా కనువిందు చేసిన వింగ్స్ ఇండియా– 2024 ముగిసింది. చివరి రోజు సెలవు దినం ఆదివారం కావడంతో సందర్శకులు భారీ సంఖ్యలో ఏవీయేషన్ షో తిలకించేందుకు తరలివచ్చారు. సందర్శకుల తాకిడితో ఎయిర్‌పోర్ట్ సందడిగా మారింది. రన్‌వేపై ప్రదర్శనకు ఉంచిన చిన్నా పెద్దా విమానాలు, హెలికాప్టర్లు, చాపర్లు వీక్షించి మురిసిపోయారు.
వినువీధిలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్, గ్లోబల్ స్టార్స్‌కు చెందిన మార్క్‌జెఫర్స్ బృందం లోహ విహంగాలతో చేసిన చిత్ర విన్యాసాలతో పులకించిపోయారు. ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరిన విశేషాలెన్నో వీక్షించి తరించారు. ఏవియే షన్ రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. నగరం నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచీ సందర్శకులు పోటెత్తా రు. ఏవియేషన్ షోలో అడుగడుగునా తిరిగి అద్భుతాలను ఆస్వాదించారు. నింగిలో ‘హృదయ’పూర్వకంగా రంగు రంగుల ముగ్గులను వే స్తూ కనురెప్పలను వాల్చనీయకుండా చేసిన ఏరో »ొటిక్స్ అంతులేని అనుభూతులను మిగిల్చాయంటూ తమ మనోభావాలను వెల్లడించారు.
చివరి రోజు వరకు ఉన్న విమానాలు...
బిజినెస్ డేస్‌గా చెప్పే మొదటి రెండు రోజుల పాటు కనువిందు చేసిన అనంతరం సాధారణంగా ‘షో’ నుంచి చాలావరకు ని్రష్కమిస్తాయి. కానీ ఈ సారి ఆఖరి రోజు వరకు రెండు, మూడు చిన్న విమానా లు తప్ప మిగతావన్నీ రన్‌వే పై కొలువుదీరి ఉండి సందర్శకులను కనువిందు చేశాయి. షోకు హైలెట్ గా నిలిచిన బోయింగ్ 777ఎక్స్, ఎ యిర్‌బస్, ఎయి ర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో కార్గో విమానాలు చివరి క్షణం వరకు ఉండి ఆనందాన్ని రెట్టింపు చేశాయి. ఆదివారం షో ముగియడంతో బై..బై అంటూ గాలిలో ఎగిరిపోయాయి.
సారంగ్, మార్క్‌జెఫర్స్ బృందాలకు సెల్యూట్
నాలుగు రోజుల పాటు గ‘ఘన’విన్యాసాలతో సందర్శకులకు వినోదంతో పాటు మధురానుభూతులను పంచిన సారంగ్ టీమ్, మార్క్‌జెఫర్స్ బృందానికి భాగ్యనగరం సెల్యూట్ చేసింది. నింగిలో ‘హృదయా’ంతరాలు మురిపించేలా ఏరో»ొటిక్స్ చేసిన బృంద సభ్యులతో సందర్శకులు ఫొటోలు దిగారు. వారి ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు. హైదరాబాద్ సందర్శకులు తమపై చూపించిన ఆప్యాయతకు ఆ బృందాలు కూడా ఆనందాన్ని వ్యక్తపరిచాయి. ఈ సారి కి బై బై అంటూ..మళ్ళీ రెండేళ్ళకు కలుసుకుందాం అంటూ హైదరాబాదీయులకు వీడ్కోలు పలికిన ఏరో»ొటిక్స్ బృందాలు ఏవియేషన్ షో నుంచి వెనుదిరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment