కాసులు కురిపిస్తేనే ‘ఫైర్’ సర్టిఫికెట్? | 'Fire' certificate | Sakshi
Sakshi News home page

కాసులు కురిపిస్తేనే ‘ఫైర్’ సర్టిఫికెట్?

Published Fri, May 9 2014 3:37 AM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

కాసులు కురిపిస్తేనే ‘ఫైర్’ సర్టిఫికెట్? - Sakshi

కాసులు కురిపిస్తేనే ‘ఫైర్’ సర్టిఫికెట్?

 బాన్సువాడ, న్యూస్‌లైన్ :జిల్లాలో అగ్నిమాపక శాఖ అధికారుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆ శాఖకు ప్రాముఖ్యత లేకున్నా, ఉన్న కొద్ది అధికారాలను వినియోగించుకోవడంలో ఆశాఖలో కొందరు అధికారులు ఆరితేరారు. బీమా కోసం వాహనాలకు ఫైర్ సర్టిఫికెట్ జారీ చేయడం, ప్రైవేటు స్కూళ్లకు గుర్తింపు సందర్భంగా జారీచేసే ఫైర్ సర్టిఫికెట్, దీపావళి సందర్భంగా ట పాకాయలకు ఇచ్చే నో ఆబెక్షన్ సర్టిఫికెట్‌లను డబ్బులు ఇవ్వనిదే జారీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తికి ఫైర్ సర్టిఫికెట్ జారీకి లంచం తీసుకుంటూ ఫైర్ ఆఫీసర్ సురేశ్  ఏసీబీ అధికారులకు చిక్కడ మే నిదర్శనం.

ఇదీ సంగతి..
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు విషయంలో కీలకంగా మారిన ఫైర్ సర్టిఫికెట్ పైసలవ్వనిదే జారీ చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అధిక పాఠశాలలు గుర్తింపు విషయంలో వెనుకంజ వేయడానికి ఫైర్ సర్టిఫికెట్ కారణమని తెలుస్తోంది.  ఈ సర్టిఫికెట్ పొందడానికి భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉన్నందునే దరఖాస్తు చేయడం లేదని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. జిల్లాలో విద్యా శాఖ లె క్కల ప్రకారం దాదాపు వందకు పైగా గుర్తింపులేని పాఠశాలలు ఉన్నాయి. వీటి లో 50 శాతం పాఠశాలల యాజమాన్యం గుర్తింపు కోసం దరఖాస్తు చే శాయి. అయితే ఫైర్ సర్టిఫికెట్ తీసుకొనే విషయంలో భారీగా ముడుపులు చెల్లించుకోవాల్సి రావడంతో, గుర్తింపు కోసం ముందుకు రావడం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు.  

మారిన నిబంధనలు..
కొన్నేళ్ల క్రితం త మిళనాడులోని కుంభకోణం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదుల సంఖ్యలో విద్యార్థులు సజీవ దహనం అయ్యారు.  ఈ విషయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఆ తర్వాత ప్రతి పాఠశాలలో విద్యార్థుల రక్షణ దృష్ట్యా అగ్ని నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఒక పాఠశాలకు గుర్తింపు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా ఫైర్ ఆఫీసర్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. పాఠశాలలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే పాఠశాలలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పైపుల ద్వారా మంటలు ఆర్పివేస్తారు. అంతేకాకుండా కార్చన్ మోనాక్సైడ్ సిలిండర్స్ కూడా పాఠశాలల్లో ఏర్పాటు చేయాలి.

  ఇవన్నీ పాఠశాలలో ఉన్నాయని, పాఠశాలలో షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేదని, ఎలక్ట్రికల్, ఫైర్ ఆఫీసర్లు ధ్రువీకరించాలి. ఈ వ్యవహారం పూర్తయిన తర్వాత పాఠశాలకు గుర్తింపు ఇవ్వాలనే నిబంధన విధించారు. ఇలా అగ్నిమాపక శాఖ నుంచి సర్టిఫికెట్ పొందాలంటే సుమారు ’10 నుంచి 25వేల వరకు ఒక్కో పాఠశాల చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొందని పాఠశాలల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బీమా కోసం వాహనాలకు జారీ చేయడంలో, టపాకాయల దుకాణాలకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో అధికారులు డబ్బులు ఇవ్వనిదే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

అనుమతులకు తప్పని ఇబ్బందులు
జిల్లాలోని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాల్లోని పాఠశాలకు గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రతి స్థాయిలో ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్త చేస్తున్నారు. శానిటరీ సర్టిఫికెట్, సౌండ్ పొల్యూషన్ లేదని నిరభ్యంతర సర్టిఫికెట్, ఫైర్ సర్టిఫికెట్, ఆట స్థలం ఉందని సర్టిఫికెట్ ఇలా అనేక రకాల సర్టిఫికెట్లు విద్యా శాఖకు సమర్పించాలి. ఎవరి స్థాయిలో వారు అందినంత దోచుకోవడంతో పాఠశాలకు గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలంటేనే యాజమాన్యాలు హడలెత్తిపోతున్నాయి. గుర్తింపు పొందడానికి ఫైర్ సర్టిఫికెట్ కావాల్సి ఉండడంతో అగ్నిమాపక శాఖకు కలిసివస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement