
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. వారు తమ కళను ఒక్కోరకంగా వ్యక్తపరుస్తారు. తాజాగా, ఒక స్ట్రీట్ డ్యాన్సర్ నడి వీధిలో తన స్టెప్పులతో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక స్ట్రీట్ డ్యాన్సర్.. మైకేల్ జాక్సన్‌లా అలవోకగా స్టెప్పులేసి అక్కడున్న వారిని మెప్పించాడు. డ్యాన్స్ అనే కాకుండా రకరకాల భంగిమలతో వెరైటీ స్టెప్పులు వేశాడు.
ఒకసారి తాను బౌలింగ్ వేసినట్లు.. ఆ వెంటనే బౌండరీ కొట్టినట్టు భంగిమను మార్చేశాడు. నేలకు కొట్టిన బంతిలా పడుతూ.. లేస్తూ స్టన్నింగ్ స్టంట్‌లు చేశాడు. అంతలోనే గాలిలో పతంగిని లాగినట్లు కూడా స్టెప్పులు వేసి చూపరులను ఆశ్చర్యపరిచాడు. అంతలోనే జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్లుగా.. రకారకాల యాంగిల్స్‌లో స్టెప్పులు వేశాడు.
తన స్టన్నింగ్ స్టెప్పులతో అక్కడి జనాలను షాకింగ్‌కు గురిచేశాడు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు తెలియవు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా, అతని స్టన్నింగ్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి స్టెప్పులు వేయాలంటే గట్స్ ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: వైరల్: చీర కట్టులో చూడముచ్చటైన కేరళ యువతుల డ్యాన్స్ ..
Comments
Please login to add a commentAdd a comment