ఆకట్టుకున్న ‘అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం’
పాత గుంటూరు: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో పూలే, అంబేడ్కర్ అధ్యయన కేంద్రం నిర్వహణలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ సింధూరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్.డి.విజయభాస్కర్ కలం నుంచి వెలువడిన నాటకాన్ని పడమటి గాలి సృష్టికర్త పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో జిల్లా రిజిష్ట్రర్.ఎస్.బాలస్వామి, కె.రవిశేఖర్, ఎస్.ఎమ్.ప్రకాష్‌కుమార్. డాక్టర్.నూతక్కి సతీష్, టి.రజనీకాంత్, డాక్టర్.కాకాని సుధాకర్, జి.సుకుమార్,అబ్దుల్‌వహీద్ తదితరులు పాల్గొన్నారు.