skit
-
ట్యాక్స్ గుబులు
-
అమ్మకు వందనం తాతకు అప్పడం అంటున్న పాల్
-
38 గంటలు నిల్చొని వరల్డ్ రికార్డు
-
పాత సెల్ ఫోన్లు కొంటున్న రాజేష్
-
మా తాత అప్పు సుల్తాన్
-
ఇడ్లీ చూసి భయపడుతున్న రాజేష్
-
పెళ్లిపై రాజేష్ తికమక
-
కుర్చీల వ్యాపారం చేస్తానంటున్న రాజేష్
-
భార్య పుట్టింటికి వెళ్లిందని చాక్లెట్లు పంచుతున్న రాజేశ్
-
ఏఐ బాయ్ ఫ్రెండ్గ మారుతానంటున్న రాజేష్
-
ప్రియుడిపై కంప్లైంట్
-
భార్య మీద కోపంతో ఇదేం పాడు పని
-
జీవితాంతం నిద్రవోనని ఛాలెంజ్
-
ప్రయాగరాజ్ ల పళ్ల పుల్లలు అమ్ముతానంటున్న రాజేశ్
-
లోకేష్‌కు కొత్త బాడీగార్డ్!
-
సూపర్ 6 కొడుతా అని డకౌట్
-
కొత్త చైనా వైరస్ గురించి తెల్సుకొని భయపడ్తున్న రాజేషు
-
కొత్త ఏడాదిలో కొత్త ప్లాన్స్
-
అత్త పై పగతో కోడలు ఏం చేసిందో తెలుసా?
-
అచ్చం లక్కీ భాస్కర్ లాగానే
-
పాల్ ప్రపంచ పాద యాత్ర
-
డింగా డింగా వైరస్
-
బిచ్చగానిలా స్ట్రింగ్ ఆపరేషన్
-
కోడిని మింగితా అంటున్న రాజేష్
-
బైక్ ట్యాక్సీ డ్రైవర్ సక్సెస్ స్టోరీ
-
రాజి తాత లవ్ స్టోరీ
-
పుష్ప టు జాతర సంబురాల్లో రాజేష్
-
పెళ్లాం బాధ భరించలేను బాబోయ్
-
గుడిసెలో బతుకుతానంటున్న రాజేశ్
-
ఉత్తుత్తిగనే బీపీ పెంచుకుంటున్న రాజేశ్
-
గరం రాజేష్ కొత్త ఆక్సిజన్ బార్
-
అపరిచితుడిలా మారుతున్న రాజేషు
-
కొత్త ప్రపంచ యాత్రికుడు..
-
ఐపీఎల్ ఆడతానంటున్న రాజేష్
-
ఆ అరటిపండుకు రూ. 50కోట్లు
-
ఇగ సినిమా రివ్యూలు బంద్!
-
సభకు పోయి కుర్చీలు తెచ్చుకుంటా
-
లేడీ మంత్రికి అరటిపళ్ల జబ్బు
-
ఆపరేషన్ 'సమోసా'
-
రెండు గ్రూపుల గొడవలో తన్నులు తిన్న రాజేశ్
-
ఐదేళ్లుగా నకిలీ కోర్టు నడుపుతున్న ఘనుడు..
-
బడికి వోతున్న రాజేషు.. సద్వుయెప్పే బడి కాదయ్యో...
-
కలలో నిజంగ మాట్లాడుతున్న రాజేష్
-
డిజిటల్ దోస్తులొచ్చేస్తున్నారు
-
సంపద సృష్టించు పార్టీ!
-
అన్ని డిలీట్ చేస్తున్న ఇంద్రబాబు..
-
రెడ్‌బుక్‌తో బిల్డప్‌లు
-
భజనకు పోయి బోర్లా పడ్డ పవన్
-
ఫోటో షూట్ బిజీలో చంద్రబాబు..
-
గాలి తయారు చేసే సైంటిస్ట్ అయిన రాజేష్
-
చంద్రబాబు ఇంగ్లీష్ పై.. గరం రాజేష్ సెటైర్స్
-
కిల్ బిల్డింగ్ పాండే అవతారమెత్తిన రాజేష్
-
పాత ఫోన్ లు కొంటున్న రాజేశ్
-
వెయ్యి కోట్ల వజ్రం దొరికింది
-
మనసుకు నచ్చితే ఏదైనా చేస్తానంటున్న రాజేశ్
-
దొంగతనం నేర్పే స్కూలేందయ్యో..
-
రోజూ బిర్యానీ దొరకని నిరుపేద రాజేష్
-
లోకేష్ చెప్పిండని కొత్త పంటలేస్తనంటున్న రాజితాత
-
పవనన్న క్యాంటీన్ పెడతానంటున్న రాజేషు
-
వాళ్లని నిద్రపుచ్చితే రోజుకు రూ.15000
-
వందకోట్ల మందికి చెవుడు ఖాయం
-
విరాళాలు వసూల్ చేస్తున్న రాజేష్
-
కూటమి పేరుతో దాదాగిరి
-
దిల్ సుఖ్ నగర్ కు విమానమా !
-
అనిత మేడం.. నేను రెడీ అంటున్న రాజేష్
-
నీకు 15 వేలు.. నీకు 15 వేలు.. నీకు 18 వేలు..
-
ఇంద్రబాబు, జతీష్ కుమార్ ల మాట ముచ్చట
-
జ్యూస్ షాపులో జాబ్.. డిగ్రీ ఉంటేనే..
-
నేను లాఠీ పడతా మేడం
-
చెత్తపన్ను వసూల్ రాజా
-
ఇంద్రబాబు యాంకర్ కు వందనం
-
తాలూకా ప్లేట్ విరుగుద్ది
-
షేర్లు కొంటా అంటున్న రాజేష్
-
ఇవేం కోల్వులు !
-
పసుపు బిళ్ల ఉంటే పోలీస్ కూడా సలాం కొట్టాలి
-
ఈఎంఐల్లో లంచాలు
-
ఎంపీ బరిలో కోకాపేట ఆంటీ
-
సీటు కావాలంటే రాజీనామా చేయండి
-
అబద్దాల చంద్రం
-
పెళ్లం కొడుతోంది..
-
కుర్చీ మడ్తపెడుతున్న రాజేష్
-
వెల్లుల్లి ధరలకు వామ్మో అంటున్న రవళి
-
శ్రీలంక పారిపోతునంటున్న రాజేశ్
-
రండి బాబు రండి..ఢిల్లీలో బాబు ముష్టి
-
కేసు పెడతా
-
తలా పది ఓట్లు అంటున్న రవళి
-
ఏడో తారీఖు ఏక్ దమ్ దవతిస్త
-
అప్పుడెట్లుండె ఎలక్షన్స్..ఇప్పుడెట్లుండె ఎలక్షన్స్
-
అబద్దం గెలవాలి అంటున్న రాజేష్
-
ముక్కా చుక్కా..లక్కీ డ్రా
-
ఇంద్రబాబుకు విచిత్ర గన్ మెన్
-
పాల్ పార్టీలో చేరుతా..ఎమ్మెల్యే అవుతా..
-
టీడీపీలో చేరుతా..మంత్రిని అవుతా..
-
కైస హే..మై దేఖ్ తుమ్...తుమ్ జావ్..
-
చిట్టినాయుడుకి చిట్టిప్రశ్నలు..లోకేష్ ఫ్రస్టేషన్
-
కాస్తయితే...దీప్తి లక్షలు పోగొట్టుకునేది
-
ఉంగరం పోయిందనీ..
-
డోంట్ వర్రీ నేటి నుంచి 2000 వేల నోట్ల మార్పిడి..!
-
24 గంటలు షాపులు తెరిచే ఉంటాయోచ్
-
బైక్‌పై శివ-పార్వతుల వేష ధారణలో నిరసన.. అరెస్ట్!
డిస్పూర్: దేశంలో పెట్రోల్, డీజిల్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ధరల పెరుగుదలపై తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు. అలా.. పెట్రోల్ ధరలపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడు, పార్వతి వేషధారణలో ధరలపై చిన్న నాటకం ప్రదర్శించి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన బిరించి బోరా అనే వ్యక్తి తనకు వచ్చిన విద్యతో పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. బోరా.. శివుడిగా చిన్న నాటకం ప్రదర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బిరించి బోరాను అరెస్ట్ చేసి నగావ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శివపార్వతుల నాటకంలో ఏముంది? ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన బిరించి బోరా.. వీధి నాటకం వేశారు. బోరా శివుడిగా.. కోయాక్టర్ పరిశిమిత పార్వతిగా బైక్‌పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయి.. బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుంది. దీంతో పెట్రోల్ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తారు. ఇదీ చదవండి: జైలు నుంచే అక్రమాలు.. 81 మంది అధికారులకు లక్షల్లో ముడుపులు -
కొంపముంచిన స్కిట్ బండి సంజయ్ కు షాక్..!!
-
నాటకం వేసిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : పట్టు వస్త్రాలు, ఆభరణాలు, కిరీటం, పెద్ద మీసం, రాజులాగా మేకప్.. హిందీలో ఏకధాటిగా డైలాగ్‌లు చెబుతూ ప్రేక్షకులను ఆలరించారు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్. శుక్రవారం ఎర్రకోటలో నిర్వహించిన ‘రామ్‌లీలా’ నాటకంలో, హర్షవర్ధన్ మిథిల రాజు జనకుడి వేషం వేశారు. మీసం, మేకప్‌తో డ్రామా ఆర్టిస్ట్‌లాగానే తయారయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ కార్యక్రమంలో జనక మహారాజు వేషంలో పరిశుభ్రమైన పర్యావరణాన్ని ఏర్పరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛమైన వాతావరణంలో జీవించాలని కోరుకుంటారు.. గాలి స్వచ్ఛంగా మారితే అది ఆరోగ్యకరమైన జీవనానికి దారితీస్తుందని అన్నారు. కార్యక్రమం ప్రారంభానికే ముందే హర్షవర్ధన్ తాను రామ్‌లీలాలో నాటకంలో సీతా దేవి తండ్రి అయిన జనక మహారాజు పాత్ర వేస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. హర్షవర్ధన్ గతంలో భోజ్‌పురి నటుడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. #राजा_जनक के रूप में अपना किरदार देखकर मुझे आश्चर्य हुआ। यह शायद #मर्यादापुरुषोतमश्रीराम और माता #सीता के आर्शीवाद का ही परिणाम है कि मैं इस भूमिका को लोगों की आकांक्षाओं के मुताबिक निभा पाया। #RamLeela #रामलीला @BJP4India pic.twitter.com/JKjOgQZVzT — Dr. Harsh Vardhan (@drharshvardhan) October 12, 2018 -
ఆకట్టుకున్న ‘అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం’
పాత గుంటూరు: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో పూలే, అంబేడ్కర్ అధ్యయన కేంద్రం నిర్వహణలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ రాజగృహ ప్రవేశం నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శ్రీ సింధూరి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్.డి.విజయభాస్కర్ కలం నుంచి వెలువడిన నాటకాన్ని పడమటి గాలి సృష్టికర్త పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో జిల్లా రిజిష్ట్రర్.ఎస్.బాలస్వామి, కె.రవిశేఖర్, ఎస్.ఎమ్.ప్రకాష్‌కుమార్. డాక్టర్.నూతక్కి సతీష్, టి.రజనీకాంత్, డాక్టర్.కాకాని సుధాకర్, జి.సుకుమార్,అబ్దుల్‌వహీద్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతమ్మ మహత్యం నాటక ప్రదర్శన
తెనాలి: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మూడురోజుల భక్తిరస పౌరాణిక నాటకోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఇక్కడి మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. పట్టణానికి చెందిన శ్రీవిజయలక్ష్మీ శ్రీనివాస నాట్యమండలి ఆధ్వర్యంలో తొలిరోజున శ్రీతిరుపతమ్మ మహాత్మ్యం నాటకాన్ని ప్రదర్శించారు. తొలుత స్థానిక సాహితీ సాంస్కృతిక సంస్థ ప్రజ్వలిత వ్యవస్థాపకుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ప్రముఖ హార్మోనిస్టు, నాటక సమాజం ఆర్గనైజరు దీపాల సుబ్రహ్మణ్యం, జి.బుల్లెబ్బాయి, ఆర్సీ శేఖర్, కొండలరావు, చెన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
నాటక పోటీలకు ‘త్రికూటేశ్వర మహత్యం’
* కోటప్పకొండలో స్క్రీనింగ్ టెస్ట్ * డిసెంబర్ 12 నుంచి 21 వరకు తిరుపతిలో పోటీలు నరసరావుపేట రూరల్: టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబర్లో నిర్వహించే నాటక పోటీల కోసం శనివారం కోటప్పకొండలో స్కీనింగ్ టెస్ట్ నిర్వహించారు. పోటీలకు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కళాకారులు త్రికూటేశ్వర మహత్యం అనే పద్య నాటికను ఎంట్రీగా పంపారు. టీటీడీ సాంస్కృతిక విభాగానికి చెందిన కోనెటి సుబ్బరాజు, యానాపురం సత్యనారాయణతో కూడిన నలుగురు సభ్యులు ఈ నాటికను తిలకించారు. కోటప్పకొండలోని కమ్మసత్రంలో నాటకాన్ని ప్రదర్శించారు. డిసెంబర్ 12 నుంచి 21వ తేదీ వరకు తిరుపతి శ్రీవెంకటేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో మహతి ఆడిటోరియంలో గరుడ పోటీలు జరుగనున్నాయి. వచ్చిన ఎంట్రీలలో ఉత్తమ నాటకాలు, నాటికలను ఇక్కడ ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందులో భాగంగా శనివారం ఈ నాటికను బృందం తిలకించింది. మొత్తం 254 ఎంట్రీలు.. కళాపరిషత్ పోటీలలో పౌరాణిక నాటికలు, నాటకాలు, సాంఘిక నాటకాలు, బాలుర పౌరాణిక నాటికలు, లలిత సంగీతం తదితర విభాగాలలో పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో పాల్గొనేందుకు దాదాపు 254 ఎంట్రీలు వచ్చినట్టు నాటకాన్ని పరిశీలించేందుకు వచ్చిన బృందం సభ్యులు తెలిపారు. వీటిలో ఉత్తమమైనవి గుర్తించి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ తెలుగు సంఘాల నుంచి కూడా ఎంట్రీలు వచ్చినట్టు వివరించారు. ఆకట్టుకున్న నాటక ప్రదర్శన... కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి మహిత్యంపై కళాకారులు ప్రదర్శించిన పద్య నాటకం ఆకట్టుకుంది. త్రికూట పర్వతాలకు ఆ పేరు ఎలా వచ్చింది, దక్షయజ్ణం, గోల్లభామ తదితర ఘట్టాలను కళాకారులు ప్రదర్శించారు. రెండున్నర గంటల నిడివిగల నాటకంలో గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన 15 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇద్దరు సురభి కళాకారిణులు ఇందులో ముఖ్యపాత్రలను పోషించారు. రాష్ట్రంలో ఎంతో గుర్తింపు ఉన్న తిరుపతి శ్రీవెంకటేశ్వర కళాపరిషత్ నాటిక పోటీలలో ప్రదర్శన ఇచ్చి త్రికోటేశ్వరుని మహాత్యాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్టు నిర్వాహకులు సింగర కొండయ్య చౌదరి తెలిపారు. రెండు నెలల పాటు కళాకారులకు శిక్షణ ఇచ్చామన్నారు. -
పుష్కర కళా వేదికపై తెనాలి నాటిక
‘పరమపదం’ నాటిక ప్రదర్శనకు విద్యార్థులు సిద్ధం వేదాద్రి, మరో 3 ఘాట్లలో ప్రదర్శనకు సన్నాహాలు తెనాలి: పుష్కరాల్లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కళా ప్రదర్శనల్లో తెనాలి చిన్నారులకు అవకాశం లభించింది. ‘పరమపదం’ పేరుతో 50 నిమిషాల పౌరాణిక నాటిక ప్రదర్శనకు స్థానిక అమిరినేని రెయిన్బో పబ్లిక్ స్కూలు విద్యార్థులు ఎంపికయ్యారు. ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జగన్మోహనరావు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ నెల 19న కృష్ణా జిల్లా వేదాద్రి పుష్కరఘాట్‌లో, గుంటూరు జిల్లాలోని మరో 3 పుష్కర ఘాట్ల వద్ద నాటిక ప్రదర్శించనున్నారు. అమిరినేని రెయిన్బో పబ్లిక్‌స్కూల్, ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్– తెనాలి సంయుక్త నిర్వహణలో స్కూలు విద్యార్థులు ఈ నాటిక ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. రామాయణంలో సీతాదేవి తన తల్లి అయిన భూమాత ఒడిలోకి వెళ్లాక, శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠం చేరాల్సిన సమయం ఆసన్నమవుతుంది. లేదా అక్కడే ఉండి రాజ్యపాలనలో కొనసాగాల్సి ఉంటుంది. బ్రహ్మదేవుడు వర్తమానాన్ని కాల పురుషుడు శ్రీరాముడికి విన్నవిస్తాడు. దీనిపై శ్రీరాముడు వైకుంఠానికి చేరేందుకు నిర్ణయిస్తాడు. ఆయన వైకుంఠానికి చేరుకోవటమే ఈ పరమపదం నాటిక ఇతివత్తం. ఇందులో శ్రీరాముడుగా రామకృష్ణ, లక్ష్మణుడుగా మణికంఠ, కాలపురుషుడు పాత్రలో విష్ణు, దూర్వాసమునిగా కరిముల్లాతో సహా 30 మంది విద్యార్థులు నటిస్తున్నారు. కూచిపూడి నృత్యంలో ప్రతిభావంతురాలైన ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించిన ఈ నాటికకు దర్శకత్వం లక్ష్మణశాస్త్రి. నిర్వహణ సారథ్యం ఆరాధ్యుల కన్నా, చెన్నం సుబ్బారావు. విద్యార్థులకు పురాణాల గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తున్నట్టు స్కూలు డైరెక్టర్లు అమిరినేని రాజా, దొడ్డక ఆదినారాయణ, సింగయ్య చెప్పారు. -
త్రివిక్రమ్ స్కిట్లో మహేశ్, సమంత!