ట్రంప్ తీరుపై అసంతృప్తిలో అమెరికన్లు! | Americans disapprove of Trump's performance: Poll | Sakshi
Sakshi News home page

ట్రంప్ తీరుపై అసంతృప్తిలో అమెరికన్లు!

Published Sat, Feb 25 2017 10:15 AM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM

ట్రంప్ తీరుపై అసంతృప్తిలో అమెరికన్లు! - Sakshi

ట్రంప్ తీరుపై అసంతృప్తిలో అమెరికన్లు!

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నెలరోజుల పాలన ఎలా ఉంది అనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో.. ఎక్కువ మంది అమెరికన్లు తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. 53 శాతం మంది ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని భావిస్తున్నారని ఎన్బీసీ న్యూస్, సర్వేమంకీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాప్రాయ సేకరణలో వెల్లడైంది.

అదేవిదంగా.. రాబోయే కాలంలో ట్రంప్ పాలనపై ప్రజల్లో భయాందోళన నెలకొందని ఈ సర్వేలో తేలింది. రానున్న నాలుగేళ్లలో అమెరికా ఓ పెద్ద యుద్ధంలో పాల్గొనాల్సి రావొచ్చని మూడింట రెండొంతుల మంది భావిస్తున్నారని ఎన్బీసీ తెలిపింది. మరీ 30 శాతం మంది మాత్రం ట్రంప్ పాలనపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. అయితే.. ఏడు ముస్లిం దేశాలపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి 50 శాతం మంది మద్దతు తెలపడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement