ప్రవీణ్ ప్రకాశ్ సమక్షంలో జీఈఆర్ బ్యాడ్జిని చూపిస్తున్న బనగాలపల్లి వలంటీర్లు
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్లు 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించారని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. నంద్యాల జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన పలు పాఠశాలల పనితీరును పరిశీలించారు. బనగానపల్లిలోని వలంటీర్లు తమ పరిధిలోని గృహాల్లో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు చేయించారు.
దీంతో ఈ వలంటీర్లకు యాప్ ద్వారా బ్యాడ్జి వచ్చిది. వీరు తమ పరిధిలో ఒకటికి రెండుసార్లు డేటాను పరిశీలించి.. ‘నా సర్వే సరైంది.. ఇది నా చాలెంజ్.. మిషన్ జీఈఆర్ 100 శాతం ఆంధ్రా’ అనే క్యాప్షన్‌తో బ్యాడ్జి స్క్రీన్‌షాట్‌ను వారి వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. వీరి సవాలును స్వీకరించిన మిగతా 60 వేల మంది వలంటీర్లు కూడా తమ పరిధిలోని డేటాను మరోసారి తనిఖీ చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. నూరు శాతం జీఈఆర్‌ను నిజాయితీ, నిబద్ధతతో సాధించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment