toured.
-
బీజేపీ బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించి, రెండు సభల్లో పాల్గొననున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. ఏయే అంశాలపై మాట్లాడుతారు, ఏ హామీలిస్తారన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ తరఫున బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని, ఎస్సీ వర్గీకరణ అంశానికీ మద్దతు ప్రకటించవచ్చని నేతలు అంటున్నారు. ఈ నెల 7న సాయంత్రం 5.30గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బీసీ గర్జనసభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తే పార్టీ తరఫున సీఎం అయ్యే బీసీ నేత పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న దశలో బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీకి అనుకూలంగా బీసీల మద్దతు కూడగట్టవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ఎమ్మార్విఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగల ఆత్మగౌరవసభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ జాతీయ, రాష్ట్ర పార్టీలు ఇప్పటికే మద్దతును ప్రకటించిన నేపథ్యంలో.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతోపాటు రాష్ట్రంలో ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచే అంశాన్ని పరిశీలిస్తామని మోదీ హామీ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. 7న మోదీ షెడ్యూల్ ఇదీ.. ప్రధాని మోదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు యూపీ నుంచి వైమానికదళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియానికి వస్తారు. 5.30 గంటల నుంచి 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటల సమయంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. -
100 జీఈఆర్‌ను నిజాయితీగా సాధించాలి
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్లు 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించారని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. నంద్యాల జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన పలు పాఠశాలల పనితీరును పరిశీలించారు. బనగానపల్లిలోని వలంటీర్లు తమ పరిధిలోని గృహాల్లో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు చేయించారు. దీంతో ఈ వలంటీర్లకు యాప్ ద్వారా బ్యాడ్జి వచ్చిది. వీరు తమ పరిధిలో ఒకటికి రెండుసార్లు డేటాను పరిశీలించి.. ‘నా సర్వే సరైంది.. ఇది నా చాలెంజ్.. మిషన్ జీఈఆర్ 100 శాతం ఆంధ్రా’ అనే క్యాప్షన్‌తో బ్యాడ్జి స్క్రీన్‌షాట్‌ను వారి వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. వీరి సవాలును స్వీకరించిన మిగతా 60 వేల మంది వలంటీర్లు కూడా తమ పరిధిలోని డేటాను మరోసారి తనిఖీ చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. నూరు శాతం జీఈఆర్‌ను నిజాయితీ, నిబద్ధతతో సాధించాలన్నారు. -
ఇంత అధ్వానమా?
పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి వసతిపై సుప్రీం కోర్టు బృందం అసంతృప్తి పలు పాఠశాలల సందర్శన పరిస్థితులపై ఆరా మెదక్ టౌన్ /చిన్నశంకరంపేట / తూప్రాన్ /చేగుంట: ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీటి వసతిని తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం శుక్రవారం జిల్లాలో పర్యటిం చింది. పలు పాఠశాలల్లో పరిస్థితులు అధ్వానంగా ఉండడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపోను మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేకపోవడంపై అధికారులను నిలదీశారు. మెదక్ మండలం, మెదక్ పట్టణం, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, తూప్రాన్ మండలాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలను బృందం సభ్యులు సందర్శించారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను బృందం సభ్యులు పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బృందం ప్రతినిధులు అశోక్, కుమార్‌గుప్తా, టీవీ రత్నం, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలను మెరుగు పర్చేందుకే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమన్నారు. తాము పరిశీలించిన అంశాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామన్నారు. బృందం వెంట డీఈఓ నజీమొద్దీన్, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషా, డిప్యూటీ ఈఓ లింబాద్రి జిల్లా అధికారులు ఉన్నారు. చిన్నశంకరంపేటలోని జెడ్పీహెచ్ఎస్లో 500 మందికి ఒకటే మరుగుదొడ్డి ఉండటంపై బృందం సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే విషయమై జిల్లా అధికారులను ప్రశ్నించారు. పలు పాఠశాలల్లోని మరుగుదొడ్లను తాము వస్తున్నామనే శుభ్రం చేసినట్టుందని వారు వ్యాఖ్యానించారు. చేగుంటలో మరుగుదొడ్ల నిర్వహణ తీరుపై బృందం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడియారం పాఠశాలలోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం ఏదని?, ఇంకా ఎన్నాళ్లు నిర్మిస్తారని?, పాఠశాల అభివృద్ధి నిధులేం చేస్తున్నారని? ప్రధానోపాధ్యాయురాలిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తూప్రాన్ మండలం మనోహరాబాద్, రామాయిపల్లి, పట్టణంలోని బాలుర,బాలికల పాఠశాలలను సం దర్శించారు. విద్యార్థుల హాజరు శా తం, సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు సదుపాయంపై హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు.