
అల్లు అర్జున్, స్నేహ రెడ్డి నేడు 14వ పెళ్లిరోజు జరుపుకుంటున్నారు.

లవర్‌బాయ్‌గా అల్లు అర్జున్ తొలి చూపులోనే స్నేహతో ప్రేమలో పడ్డారు.

అమెరికాలో జరుగుతున్న ఒక శుభాకార్యానికి బన్ని వెళ్లారు.. అక్కడ స్నేహను చూసి ప్రేమలో పడిపోయాడు.

అందరిలాగే ఇద్దరి ఇంట్లోనూ పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు.

కానీ, బన్ని-స్నేహ మాత్రం ఒకరినొకరు విడిచి ఉండలేమని చెప్పడంతో కుటుంబ పెద్దలు కాస్త ఆలోచించారు.

చివరికి పిల్లల ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు దిగి వచ్చి సంప్రదింపులు జరిపారు.

2010 నవంబర్ 26న ఘనంగా ఈ జంట నిశ్చితార్థం జరిగింది.

ఆ తర్వాత మూడు నెలలకు 2011 మార్చి 6న వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్ని పెళ్లి చాలా వైభవంగా జరిగింది.

అల్లు అర్జున్- స్నేహ దంపతులకు కుమారుడు అల్లు అయాన్‌తో పాటు ముద్దుల కూతురు ఆర్హ ఉంది






