కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది
హైదరాబాద్: కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. గురువారం జరిగిన రోయింగ్ విభాగంలో మంజీత్ సింగ్, దేవేందర్ సింగ్ స్వర్ణ పతకాలు సాధించారు. దీంతో తెలంగాణ ఖాతాలో రెండు బంగారు పతకాలు చేరాయి. పతకాలు సాధించిన క్రీడాకారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభినందనలు తెలిపారు. జాతీయ క్రీడలు ప్రారంభమైనప్పటినుంచి ఈ రోజు వరకు తెలంగాణకు ఏ విభాగంలోనూ స్వర్ణ పతకాలు రాలేదు.