సాక్షికి మంత్రి హరీష్ రావు ప్రశంసలు
హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణ కోసం సాక్షి మీడియా చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు ప్రశంసించారు. సాక్షి పత్రికలో అక్షర యజ్ఞం పేరిట చెరువులపై చేపడుతున్న చర్చాకార్యక్రమం ఎంతో మేలు చేస్తోందని హరీష్ రావు అన్నారు. సాక్షి తీసుకొచ్చిన జనస్పందనలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించానని చెప్పారు. సాక్షి టీవీ స్టూడియోలో శుక్రవారం రాత్రి జరిగిన చర్చా కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు సాక్షి ఈడీ రామచంద్రమూర్తి, సీనియర్ పాత్రికేయులు దేవురపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మిషన్ కాకతీయ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు.
- ఒకప్పుడు హైదరాబాద్ను సిటీ ఆఫ్ లేక్స్గా పిలుచుకునే వాళ్లం.
- బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోనూ తెలంగాణ చెరువుల కోసం 265 టీఎంసీల నీటిని కేటాయించారు.
- రాను రాను చెరువుల సామర్థ్యం తగ్గిపోయింది.
- చెరువుల్లోకి రావాల్సిన నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి.
- తెలంగాణలో ప్రతి గ్రామంలో జీవితం చెరువుతో ముడిపడి ఉంది.
- రాష్ట్రంలో నీటి లభ్యత తగ్గిపోయిందంటే చెరువుల దుస్థితే కారణమని సీఎం కేసీఆర్ చెప్పారు.
- భారీ ప్రాజెక్టులు కట్టాలంటే చట్టపరంగా ఎన్నో అడ్డంకులున్నాయి.
- చెరువుల పునరుద్ధరణకు ఎలాంటి అడ్డంకుల్లేవ్, ప్రజలకు తక్షణ ప్రయోజనం కలుగుతుంది.
- తెలంగాణలో మొత్తం 46 వేల చెరువులు ఉన్నాయి.
- పది ఎకరాల నుంచి కొన్ని వేల ఎకరాలకు ఇవి నీటిని ఇస్తున్నాయి.
- ఈ ఏడాది 9 వేల చెరువుల పునరుద్ధరణ, వచ్చే ఐదేళ్లలో అన్ని చెరువుల పునరుద్ధరణ
- చెరువుల్లో పూర్తి పూడిక తీయడం గతంలో ఎప్పుడు జరగలేదు.. ఈసారి ఒక యజ్ఞంలా చేస్తున్నాం.
- చెరువుల్లో 50 ఏళ్ల పూడిక ఈసారి తీయడం మా లక్ష్యం.
- పూడిక మట్టినంతటినీ పొలాల్లోకి తరలించడం వల్ల సాగు భూములు కూడా మెరుగవుతాయి.
- ప్రభుత్వం చేసే ఈ మిషన్ కాకతీయలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి.
- చెరువుల పునరుద్ధరణకు ఎంత డబ్బు ఖర్చయితే అంత మంజూరు చేస్తాం.
- అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఉన్న చెరువుల సరిహద్దుల్లో మొక్కలను నాటించే పని చేస్తారు.
- అన్ని రికార్డులను పరిశీలించిన తరువాతనే చెరువుల సరిహద్దులపై నిర్ణయం.
- ఇక్రిశాట్ ప్రయోగాత్మకంగా పూడిక మట్టిపై ఓ పుస్తకం విడుదల చేసింది.
- పూడిక మట్టి వినియోగించేలా ప్రభుత్వమే విస్తృత ప్రచారం చేస్తోంది.
- అద్భుతమైన సాంస్కృతిక కేంద్రంగా చెరువు ఉంటుంది.
- చెరువుల పునరుద్ధరణలో కూడా గోరటి వెంకన్న భాగస్వామ్యం ఉండాలని కోరుతున్నా.
- ప్రాణహిత చేవెళ్ల ద్వారా నల్లగొండకు సాగు, తాగు నీరు అందించాలని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.
- తప్పకుండా ఆయన వినతిని అంగీకరిస్తున్నా.
- నీళ్లున్న చెరువుల్లో చేపల పెంపకం కూడా చేపట్టాలని ఆలోచిస్తున్నాం.
- మిషన్ కాకతీయపై అకౌంట్ కూడా ఓపెన్ చేయబోతున్నాం.
- వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.
- తెలంగాణ పునర్నిర్మాణంలో కాకతీయ చాలా కీలక ఘట్టం.
-
సాక్షి టీవీలో మిషన్ కాకతీయకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి హరీశ్ రావు కోరారు.