మంత్రి హరీష్ మదిలో ‘సాక్షి’ కథనాలు
నిజాంసాగర్ : రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పర్యటన సందర్భంగా మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలను చదివారు ‘కొనసాగుతున్నాయ్ ‘లెండి’.., నత్తేనయం, మిషన్ కాకతీయ’ పనులపై వార్తలను చదివారు. ఇక్కడి పరిస్థితులను ఎమ్మెల్యే హన్మంత్‌షిండే స్వయంగా మంత్రికి వివరించారు. నాందేడ్- సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కనే ఉన్న నల్లవాగు మత్తడి, కుడి, ఎడమ కాలువలను మంత్రి వీక్షించారు.
బంగారు తెలంగాణే ప్రధాన లక్ష్యం..
జుక్కల్ : బంగారు తెలంగాణ ఏర్పాటే ప్రధాన లక్ష్యమని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని శక్తినగర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంత ప్రాజెక్ట్‌లు నీరు లేక బోసి పోతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్ట్‌లపై పట్టించుకోలేదన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో నీటి సౌకర్యంలేక ప్రజలు వలసలు వెళ్తున్నారన్నా రు. మేడిగడ్డ అన్నారం, నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాని కి 20 టీఎంసీల రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గోదావరి నీళ్లు మళ్లించి జిల్లాలో 5 లక్షల ఎకరాలకు నీరందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని వేంపల్లి, పుప్పాలవాగు మత్తడికి రూ.93 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. శక్తినగర్ బ్రిడ్జికి రూ.7 కోట్లు మంజూరు చేశామన్నారు. కౌలాస్‌నాలా ప్రాజెక్ట్ ఆధునీకరణ, లెండి ప్రాజెక్ట్ పనులు పూ ర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు రెండు లిఫ్ట్ ఇరిగేషన్‌లు ఏర్పాటు చేసి జుక్కల్ నియోజకవర్గానికి నీ రందేలా చూస్తామన్నారు. బిజ్జల్‌వాడి కొత్త చెరువుకు రూ.12 కో ట్లు, నర్సింగ్‌రావుపల్లి మత్తడికి ట్రిపుల్‌ఆర్‌లోరూ.5కోట్లు మంజూరు చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్‌లో నిజాంసాగర్, కౌలాస్‌నాలా ప్రాజెక్ట్‌లు ప ర్యాటక కేంద్రాలుగా మార్చేలా నిధుల కోసం కృషి చేస్తానన్నారు.