రాష్ట్ర ముఖచిత్రం మారుతోంది | mission kakatiya awards issued by Harish rao | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ముఖచిత్రం మారుతోంది

Published Thu, Apr 20 2017 2:06 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రాష్ట్ర ముఖచిత్రం మారుతోంది - Sakshi

రాష్ట్ర ముఖచిత్రం మారుతోంది

► మిషన్‌ కాకతీయ’తో సాగు, దిగుబడి ఎన్నడూ లేనంత పెరిగింది
► మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
► స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్న ‘సాక్షి’ జర్నలిస్టు రాజశేఖర్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన మిషన్‌ కాకతీయ పథకంతో రాష్ట్ర ముఖచిత్రం మారుతోందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. చెరువుల పునరుద్ధరణతో గతంలో ఎన్నడూ లేని విధంగా రబీలో సాగు ఏకంగా 17లక్షల ఎక రాలకు పెరిగిందని వెల్లడించారు. పంటల దిగుబడి సైతం మునుపెన్నడూ లేని స్థాయి లో 30 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఉండ నుందని స్పష్టం చేశారు.  బుధవారం ఎర్ర మంజిల్‌లోని జలసౌధ కార్యాలయంలో ‘మిషన్‌ కాకతీయ మీడియా అవార్డులు– 2016’ కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు హాజరుకాగా, జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాశ్, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, అవార్డుల ఎంపిక కమిటీ జ్యూరీ సభ్యులు.. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, చింతల ప్రశాంత్‌రెడ్డి, కట్టా శేఖర్‌రెడ్డితోపాటు నీటి పారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌రాజ్, ఈఎన్‌సీలు మురళీ ధర్, విజయ్‌ప్రకాశ్, కాడా కమిషనర్‌ మల్సూర్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌ పాండేలు హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లా డుతూ ఇప్పటికే ఈ కార్య్రక్రమంపై నీతి అయోగ్, హైకోర్టు, కేంద్ర మంత్రి ఉమా భారతి, కేంద్ర జలసంఘం నుంచి ప్రశంసలు దక్కాయని, వివిధ రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయని తెలిపారు.  ఇకపై వీడియో, కెమెరా జర్నలి స్టులకు సైతం మిషన్‌ కాకతీయ అవార్డులు అందిస్తామని ప్రకటించారు.  రాష్ట్రం సస్య శ్యామలం కావాలంటే చెరువులన్నింటినీ పున రుద్ధరించాలని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు.  

‘సాక్షి’కి స్పెషల్‌ జ్యూరీ అవార్డు..
మిషన్‌ కాకతీయ పురస్కారాల్లో స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు ఎంపికైన ‘సాక్షి’జర్నలిస్టు సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, అల్లం నారాయణ తదితరులు అవార్డు ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.25 వేల నగదుతోపాటు మిషన్‌ కాకతీయ ప్రత్యేక మెమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు. ఇక ప్రింట్, ఎలక్ట్రానిక్‌ విభాగాల్లో ప్రథమ బహుమతి పొందిన వారికి రూ.లక్ష, ద్వితీయ బహుమతి పొందిన వారికి రూ.75వేలు, తృతీయ బహుమతి పొందిన వారికి రూ.50 వేల నగదు, ప్రత్యేక మెమెంటోలను అంద జేశారు.

అవార్డులు పొందిన వారిలో ప్రింట్‌ మీడియా నుంచి గుండాల కృష్ణ (నమస్తే తెలంగాణ) గొల్లపూడి శ్రీనివాస్‌– (దిహిందూ), ఇ.గంగన్న (ఆంధ్రజ్యోతి), స్పెషల్‌ జ్యూరీ అవార్డు పొందినవారిలో దామ రాజు సూర్యకుమార్‌–(తెలంగాణ మ్యాగజైన్‌), సంగనభట్ల నర్సయ్య (తెలంగాణ మ్యాగజైన్‌), బి.రాజేందర్‌ (ఈనాడు) ఉన్నారు. ఇక ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగంలో గోర్ల బుచ్చన్న– వీ6, యం.మాణికేశ్వర్‌– ఈటీవీ, బి.శివకుమార్‌– టీన్యూస్, స్పెషల్‌ జ్యూరీ అవార్డులు పొందినవారిలో దొంతు రమేశ్‌– టీవీ–9, బి.నరేందర్‌–టీవీ–5, స్పెషల్‌ కేటగిరీలో కంది రామచంద్రారెడ్డి (వీడియో ఫిలిం), తైదల అంజయ్య (వీడియో సాంగ్‌) ఉన్నారు. వీరితో పాటే ప్రోత్సాహక బహుమతి కింద బాసర ఆర్జీయూకేటీ విద్యార్థిని తేజస్వినికి రూ.10 వేల ప్రత్యేక బహుమతి అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement