'కేసీఆర్ 6 నెలల పాలన బాగుంది' | kodandaram appreciate to kcr governance | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ 6 నెలల పాలన బాగుంది'

Published Tue, Dec 9 2014 4:47 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

kodandaram appreciate to kcr governance

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు 6 నెలల పాలన బాగుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కితాబిచ్చారు. సీపీఐ కార్యాలయంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పాటు కోదండరాం పాల్గొన్నారు. తెలంగాణలో ఆరు నెలల పాలనపై చర్చించారు.

తెలంగాణ అభివృద్ధి కోసం నిర్దిష్ట ప్రణాళికలు, సూచనలు చేస్తామని కోదండరాం అన్నారు.  చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ 6 నెలల పాలనలో నిరాశ నెలకొందని చెప్పారు. హామీలను, పథకాలను మరింత సమర్థవంతంగా నెరవేర్చాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement