దేశంలో శరవేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగణంగా తగిన మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నాయి. వీటిలో ఒకటే మెట్రో రైళ్లు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, కాలుష్యం నుండి నగరాలను కాపాడేందుకు మెట్రో రైళ్లు వరంలా మారాయి. ప్రస్తుతం దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.
కోల్‌కతా మెట్రో
కోల్‌కతా మెట్రో 1984, అక్టోబర్ 24న తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది దేశంలోనే తొలి మెట్రో ప్రాజెక్టు. కోల్‌కతా మెట్రోను కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (కేఎంఆర్‌సీ) నిర్వహిస్తోంది. కోల్‌కతా మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు.
ఢిల్లీ మెట్రో
ఢిల్లీ మెట్రోను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)పర్యవేక్షిస్తుంది. ఢిల్లీ మెట్రో 2002లో ప్రారంభమైంది. ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణాలు సాగిస్తుంటారు.
బెంగళూరు మెట్రో (నమ్మ మెట్రో)
బెంగళూరు మెట్రో 2011, అక్టోబర్ 20న తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్)నిర్వహిస్తోంది. ఈ నెట్‌వర్క్‌లో రెండు లైన్లు, 64 స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రోలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో తన కార్యకలాపాలను 2017, నవంబర్ 29న ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఈ మెట్రో నిర్వహణ బాధ్యత హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్)పై ఉంది.
పూణే మెట్రో
పూణే మెట్రో మూడు లైన్లు ఉన్నాయి. 23 స్టేషన్లతో కూడిన 54.58 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను పూణె మెట్రో కలిగి ఉంది. పూణే మెట్రో నిర్వహణ బాధ్యతను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) పర్యవేక్షిస్తుంటుంది. పూణే మెట్రో తన కార్యకలాపాలను 2022, మార్చి 6న ప్రారంభించింది. ఈ మెట్రోలో ప్రతిరోజూ 60 వేల నుంచి 65 వేల మంది ప్రయాణిస్తుంటారు.
చెన్నై మెట్రో
చెన్నై మెట్రో మొత్తం పొడవు 55 కిలోమీటర్లు. దీని నిర్వహణ బాధ్యత చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ ఎల్)పై ఉంది. 2015లో ప్రారంభమైన ఈ మెట్రోలో ప్రస్తుతం 40 స్టేషన్లు ఉండగా, రోజుకు దాదాపు 2.1 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
ముంబై మెట్రో
ముంబై మెట్రో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) పర్యవేక్షణలో ఉంది. 2014లో ప్రారంభమైన ఈ మెట్రోలో రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
అహ్మదాబాద్ మెట్రో
అహ్మదాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యత గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎంఆర్‌సీఎల్) చేతుల్లో ఉంది. 2019లో ప్రారంభమైన ఈ మెట్రోలో రెండు లైన్లు, 31 స్టేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 30 వేల మంది ప్రయాణిస్తున్నారు.
నాగ్‌పూర్ మెట్రో
నాగ్‌పూర్ మెట్రో నెట్‌వర్క్ దాదాపు 38 కిలోమీటర్లు. నాగ్‌పూర్ మెట్రో నిర్వహణ బాధ్యత మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్)పై ఉంది. నాగ్‌పూర్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 1.2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
కొచ్చి మెట్రో
కొచ్చి మెట్రో 2017లో ప్రారంభమయ్యింది. దీని మొత్తం నెట్‌వర్క్ 27.4 కిలోమీటర్లు. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్‌ఎల్)కొచ్చి మెట్రో నిర్వహణ బాధ్యత వహిస్తుంది. కొచ్చి మెట్రోలో రోజుకు 80 వేల మంది ప్రయాణిస్తున్నారు.
లక్నో మెట్రో
లక్నో మెట్రో నిర్వహణ బాధ్యత ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్‌సీ)పై ఉంది. ప్రస్తుతం లక్నో మెట్రోలో ఒక లైన్ ఉంది. లక్నో మెట్రోలో రోజుకు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. లక్నో మెట్రో 2017లో ప్రారంభమయ్యింది.
జైపూర్ మెట్రో
జైపూర్ మెట్రో 2015లో చాంద్‌పోల్- మానసరోవర్ మధ్య నడిచే సర్వీసుతో ప్రారంభమయ్యింది. 11 స్టేషన్లు ఉన్న ఈ మెట్రోను జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జేఎంఆర్‌సీ) పర్యవేక్షిస్తుంటుంది.
కాన్పూర్ మెట్రో
కాన్పూర్ మెట్రోను ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్‌సీ)నిర్వహిస్తోంది. ప్రస్తుతం కాన్పూర్ మెట్రో తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ఒక లైన్ కలిగివుంది. ఈ మెట్రో 2021, డిసెంబర్ 28 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి
Comments
Please login to add a commentAdd a comment