Metro Train
-
దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి?
దేశంలో శరవేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగణంగా తగిన మౌలిక సదుపాయాలు ఏర్పడుతున్నాయి. వీటిలో ఒకటే మెట్రో రైళ్లు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, కాలుష్యం నుండి నగరాలను కాపాడేందుకు మెట్రో రైళ్లు వరంలా మారాయి. ప్రస్తుతం దేశంలోని ఏఏ నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.కోల్‌కతా మెట్రో కోల్‌కతా మెట్రో 1984, అక్టోబర్ 24న తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇది దేశంలోనే తొలి మెట్రో ప్రాజెక్టు. కోల్‌కతా మెట్రోను కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (కేఎంఆర్సీ) నిర్వహిస్తోంది. కోల్‌కతా మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు.ఢిల్లీ మెట్రో ఢిల్లీ మెట్రోను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)పర్యవేక్షిస్తుంది. ఢిల్లీ మెట్రో 2002లో ప్రారంభమైంది. ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులు ఢిల్లీ మెట్రోలో ప్రయాణాలు సాగిస్తుంటారు.బెంగళూరు మెట్రో (నమ్మ మెట్రో) బెంగళూరు మెట్రో 2011, అక్టోబర్ 20న తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)నిర్వహిస్తోంది. ఈ నెట్‌వర్క్‌లో రెండు లైన్లు, 64 స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు మెట్రోలో రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ మెట్రోలో మొత్తం 57 స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో తన కార్యకలాపాలను 2017, నవంబర్ 29న ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రోలో రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఈ మెట్రో నిర్వహణ బాధ్యత హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)పై ఉంది.పూణే మెట్రో పూణే మెట్రో మూడు లైన్లు ఉన్నాయి. 23 స్టేషన్లతో కూడిన 54.58 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను పూణె మెట్రో కలిగి ఉంది. పూణే మెట్రో నిర్వహణ బాధ్యతను మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) పర్యవేక్షిస్తుంటుంది. పూణే మెట్రో తన కార్యకలాపాలను 2022, మార్చి 6న ప్రారంభించింది. ఈ మెట్రోలో ప్రతిరోజూ 60 వేల నుంచి 65 వేల మంది ప్రయాణిస్తుంటారు.చెన్నై మెట్రో చెన్నై మెట్రో మొత్తం పొడవు 55 కిలోమీటర్లు. దీని నిర్వహణ బాధ్యత చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ ఎల్)పై ఉంది. 2015లో ప్రారంభమైన ఈ మెట్రోలో ప్రస్తుతం 40 స్టేషన్లు ఉండగా, రోజుకు దాదాపు 2.1 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.ముంబై మెట్రో ముంబై మెట్రో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) పర్యవేక్షణలో ఉంది. 2014లో ప్రారంభమైన ఈ మెట్రోలో రోజుకు 1.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.అహ్మదాబాద్ మెట్రో అహ్మదాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యత గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎంఆర్సీఎల్) చేతుల్లో ఉంది. 2019లో ప్రారంభమైన ఈ మెట్రోలో రెండు లైన్లు, 31 స్టేషన్లు ఉన్నాయి. అహ్మదాబాద్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 30 వేల మంది ప్రయాణిస్తున్నారు.నాగ్‌పూర్ మెట్రో నాగ్‌పూర్ మెట్రో నెట్వర్క్ దాదాపు 38 కిలోమీటర్లు. నాగ్‌పూర్ మెట్రో నిర్వహణ బాధ్యత మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్)పై ఉంది. నాగ్‌పూర్ మెట్రోలో ప్రతిరోజూ దాదాపు 1.2 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.కొచ్చి మెట్రో కొచ్చి మెట్రో 2017లో ప్రారంభమయ్యింది. దీని మొత్తం నెట్వర్క్ 27.4 కిలోమీటర్లు. కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ (కేఎంఆర్ఎల్)కొచ్చి మెట్రో నిర్వహణ బాధ్యత వహిస్తుంది. కొచ్చి మెట్రోలో రోజుకు 80 వేల మంది ప్రయాణిస్తున్నారు.లక్నో మెట్రో లక్నో మెట్రో నిర్వహణ బాధ్యత ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్సీ)పై ఉంది. ప్రస్తుతం లక్నో మెట్రోలో ఒక లైన్ ఉంది. లక్నో మెట్రోలో రోజుకు 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. లక్నో మెట్రో 2017లో ప్రారంభమయ్యింది.జైపూర్ మెట్రో జైపూర్ మెట్రో 2015లో చాంద్‌పోల్- మానసరోవర్ మధ్య నడిచే సర్వీసుతో ప్రారంభమయ్యింది. 11 స్టేషన్లు ఉన్న ఈ మెట్రోను జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ (జేఎంఆర్సీ) పర్యవేక్షిస్తుంటుంది.కాన్పూర్ మెట్రోకాన్పూర్ మెట్రోను ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (యూపీఎంఆర్సీ)నిర్వహిస్తోంది. ప్రస్తుతం కాన్పూర్ మెట్రో తొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ఒక లైన్ కలిగివుంది. ఈ మెట్రో 2021, డిసెంబర్ 28 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి -
ఒక అపరిచితుడి దయ
ఒక మనిషి సాటి మనిషికి సాయానికి రాడని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ముక్కూ ముఖం తెలియని మనుషులు చేయందిస్తారు. అడక్కుండానే మనల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. అది ఎంత చిన్నదైనా సరే, ఆ సమయానికి పెద్ద సాయమే అవుతుంది. అయితే, అలాంటి మనుషులను మనం ఎంత నమ్ముతాం? చాలాసార్లు మనుషుల రూపాలను చూసి వాళ్ల గుణాలను అంచనా వేస్తుంటాం. కానీ మనుషులను చూపులతో అంచనా వేయలేం. అలాంటి సందర్భాలు మనకు చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇతరులకు సాయపడటం, ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలు ఎదురైనా అవి గుర్తుంచుకోవాల్సినవి కావు.అధికారికంగా దాని పేరు ‘లండన్ అండర్‌గ్రౌండ్’. కానీ అందరూ పిలిచేది ‘ట్యూబ్’ అని! అది నిజంగానే గొట్టం ఆకారంలోనే ఉంటుంది మరి! కానీ, సొరంగం నుంచి రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తూండటాన్ని చూసినప్పుడు మాత్రం దాన్ని టూత్‌పేస్ట్‌తో పోల్చడం మేలని నాకు అనిపిస్తుంది. పదహారేళ్ల వయసులో మొట్టమొదటిసారి ట్యూబ్‌ను చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన కూడా ఇదే. విక్టోరియా స్టేషన్లో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడే ఎయిర్పోర్ట్ వాహనం నుంచి కిందకు దిగాను. రెండు చేతుల్లో భారీ ట్రంకు పెట్టెలు. మీరు నమ్మినా నమ్మకపోయినా... ఆరోజు ఎయిరిండియా విమానం రెండు గంటలు ముందుగానే ల్యాండ్ అయ్యింది. నేను ఉండటానికి వెళ్తున్న నా సోదరి కిరణ్ కూడా దానికి ఆశ్చర్యపోయింది.తమ్ముడు సెలవుల కోసం అనుకోకుండా ప్రత్యక్షమవుతున్నాడన్న ఆనందం, షాక్ నుంచి కోలుకుంటూ ‘‘హీత్రూ నుంచి బస్సు పట్టుకో... బాండ్ స్ట్రీట్‌లో ట్యూబ్’’ అంటూ కిరణ్ తన ఇంటికి దారి చెప్పింది. ‘‘నేను ఆ పక్కన ఉంటా’’ అని ముగించింది.బాండ్ స్ట్రీట్ స్టేషన్ కిరణ్ ఆఫీసుకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే అప్పటికి లండన్ కొత్త. ఒకపక్క ఉత్సాహంగా ఉంది. ఇంకోపక్క కొంచెం ఉద్వేగంగానూ అనిపిస్తోంది. బాండ్ స్ట్రీట్ అన్నది మోనోపలి గేమ్‌లో కనిపించే పేరు. అక్కడున్న జనాలను చూస్తే మాత్రం అమ్మో ఇంతమందా? అనిపించక తప్పదు. అందరూ ఎవరి హడావుడిలో వారున్నారు. చాలామంది వ్యాపారాలు చేసుకునేవాళ్లనుకుంటా. ఒకరిద్దరు మాత్రం అక్కడక్కడా తచ్చాడుతూ కనిపించారు. బెల్‌బాటమ్ ప్యాంట్లు, పొడుచుకువచ్చినట్లు ఉన్న జుత్తుతో ఉన్న వాళ్లకు బూడిద రంగు ఫ్లానెల్స్, సరిగ్గా అమరని స్కూల్ బ్లేజర్‌తో ఉన్న నేను పరాయివాడినన్న విషయం ఇట్టే తెలిసిపోయేలానే ఉంది. వాతావరణం ఇలా ఉన్న సందర్భంలోనే... సొరంగం నుంచి ట్యూబ్ బయటకొస్తూ కనిపించింది. సొరంగంలో ఉండగానే వచ్చిన రణగొణ ధ్వని ట్యూబ్ వస్తున్న విషయాన్ని అందరికీ ఎలుగెత్తి చెప్పింది. శబ్దం వింటూనే చాలామంది ట్యూబ్ రాకను గుర్తించారు. సామన్లు సర్దుకుంటూ రైలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నాకైతే అంతా కొత్త. పరిసరాలతో పరిచయమూ తక్కువే. ఏం చేయాలో తెలియకుండా అలా... చూస్తూనే ఉండిపోయా కొంత సమయం!ఎవరో గట్టిగా అరిచారు. ‘‘మిత్రమా... రా’’ అని! అప్పటికే రైలు తలుపులు తెరుచుకుని ఉన్నాయి. జనాలు లోపలికి చొరబడుతున్నారు. నేను మాత్రం నా రెండు ట్రంకు పెట్టెలతో ముందుకెళ్లేందుకు తంటాలు పడుతున్నాను. రెండింటినీ ఒక్కో చేత్తో పట్టుకున్నానా... హ్యాండ్‌బ్యాగ్ పట్టుకునేందుకు ఇంకో చేయి లేకుండా పోయింది. సర్దుదామనుకుంటే పెట్టెలు ఎత్తలేనంత బరువైపోతున్నాయి. ఈ లోపు పక్క నుంచి ఏదో గొంతు వినిపించింది... ‘‘ఒంటిచేత్తోనే చేయగలవు.’’ అంటూ. ‘‘రెండు, మూడు కావాలేమో’’ అని కూడా అనేసిందా గొంతు! యాభై ఏళ్లు పైబడ్డ వ్యక్తి మాటలు కావచ్చు అవి. చిందరవందర బట్టలేసుకుని ఉన్నాడు. తలపై టోపీ ఒకటి. గడ్డం కూడా సరిగ్గా గీసుకోలేదు. బహుశా కంపు కూడా కొడుతున్నాడేమో. మామాలుగానైతే ఆ వ్యక్తితో మాట్లాడేవాడిని కాదేమో. భవిష్యత్తులోనైతే అలాంటి వాళ్లకు దూరంగా జరిగిపోయేవాడినేమో. దిమ్మరి అనుకుని వారిని దూరం నుంచే కొనచూపుతో చూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అలాంటివాళ్లపై నాకున్న అయిష్టం ఇట్టే తెలిసిపోతుంది మరి. అయితే ఆ రోజు నేను ట్యూబ్ ఎక్కేనాటి పరిస్థితి వేరు. కుర్రాడిని. సాయం అవసరం ఉంది. పొగరు ఇంకా తలకెక్కి లేదు. మరీ ముఖ్యంగా... ఆ మనిషి నా ట్రంకు పెట్టెలతోపాటు హ్యాండ్ లగేజీ కూడా లాక్కున్నాడు. ట్యూబ్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే రైలు తలుపులు మూసుకున్నాయి. ఆ వ్యక్తి నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నోట్లో కొన్ని పండ్లు ఊడిపోయి ఉంటే... ఉన్నవి కూడా గారమరకలతో కనిపించాయి. ‘‘హమ్మయ్యా... ఎక్కేశాం’’ అన్నాడా వ్యక్తి! సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు నాకు. ఓ నీరసపు నవ్వు నవ్వి ఊరుకున్నాను. ‘‘చిటికెలో రైలు తప్పిపోయేది తెలుసా?’’ అన్నాడు. నాకేమో కొత్తవాళ్లతో మాట్లాడటమంటే భయం. అతడేమో ఒకట్రెండు మాటలతో సరిపెట్టేలా లేడు. మొత్తమ్మీద ఇద్దరి మధ్య కాసేపు మౌనమే రాజ్యమేలింది. రెండు స్టేషన్లు దాటిన తరువాత ఆ వ్యక్తి నా వైపు చూసి, ‘‘ఎక్కడికి మిత్రమా?’’ అన్నాడు. తలూపుతూ నా సమాధానం విన్నాడు. కిటికీల్లోంచి బయటకు చూడటం మొదలుపెట్టాడు. సొరంగం నల్లటి గోడలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు బయట! ఆ వ్యక్తి ఆ నల్లగోడలనే కళ్లప్పగించి మరీ చూస్తూ ఉండిపోయాడు.ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా? అని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. లగేజీ ఎలా దింపుకోవాలన్న ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఇంతలో బాండ్స్ట్రీట్ రానేవచ్చింది. పెట్టెలు సర్దుకుందామని అనుకునే లోపే ఆ వ్యక్తి వాటిని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ‘‘చిన్న లగేజీలు నువ్వు తీసుకో’’ అన్నాడు. ‘‘నీ సైజుకు తగ్గవి’’ అని చతుర్లాడాడు కూడా. ప్లాట్‌ఫామ్ చివరి వరకూ నాకు తోడుగా వచ్చాడు. ‘‘వచ్చేశాం’’ అన్నాడు. ‘‘గుడ్ లక్’’ చెప్పాడు. వచ్చినంత వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. మేమొచ్చిన వైపే వెళ్లాల్సిన ట్యూబ్ కోసం వేచి చూడటం మొదలుపెట్టాడు.ఈ సంఘటన తరువాత నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. అతడు చేసిన సాయానికి థ్యాంక్స్ అయినా సరిగ్గా చెప్పానో లేదో గుర్తు లేదు. కానీ లండన్ అండర్‌గ్రౌండ్‌లో నాకు ఎదురైనా మధురమైన అనుభూతుల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోయింది. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇలా ఇతరులకు సాయపడటం ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలూ ఎదురవుతూంటాయి కానీ, వాటిని నేను గుర్తుంచుకోను. ఢిల్లీలోనూ మెట్రో భూగర్భ మార్గం పడుతున్న నేపథ్యంలో మనకూ ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చూసిన వెంటనే మనకు కలిగే ఇంప్రెషన్ తప్పు కావచ్చు అని చెప్పేందుకు ఉపయోగపడుతూంటాయి. చూపులతోనే మనిషిని అంచనా వేయలేమని చెబుతూంటాయి!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నాగపూర్ కోచ్‌లు రానట్లే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో రైళ్లలో నిత్యం రద్దీ నెలకొంటోంది. ఏ స్టేషన్లో చూ సినా ప్రయాణికులు మెట్రో కోసం ఎదురుచూస్తూ కనిపిస్తున్నారు. కానీ అందుకు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచటం లేదు. ప్రయాణికుల రద్దీ మేరకు మెట్రో సర్వీసులను ఒక్కో రైలుకు 3 కోచ్‌ల నుంచి 6 కోచ్‌లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళిక రూపొందించారు. మహారాష్ట్రలోని నాగపూ ర్ మెట్రో నుంచి కోచ్‌లను తెప్పించాలనుకు న్నా.. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. రోజంతా రద్దీనే రద్దీ ఎక్కువగా ఉన్న రాయదుర్గం–నాగోల్, మియాపూర్–ఎల్బీనగర్ రూట్లలో ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నా ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో మాత్రమే కాదు, అన్ని సమయాల్లోనూ ఈ కారిడార్లలో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఐటీ కారిడార్లలో పనిచేసే ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు. సాధారణంగా రద్దీ కారణంగా ఒక రైలు ఎక్కలేకపోయినా మరో రైలు ఉందిలే అనే భరోసా ఉంటుంది. కానీ ఆ తరువాత వచ్చే మరో రెండు రైళ్లలోనూ ప్రయాణం భారంగానే ఉంటుందని హబ్సిగూడ నుంచి నిత్యం హైటెక్‌సిటీకి ప్రయాణించే శ్రీకాంత్ వాపోయాడు. పెరిగిన ప్రయాణికులు ప్రస్తుతం మూడు కారిడార్లలో 59 మెట్రో రైళ్లు రోజుకు సుమారు 1,065 ట్రిప్పుల వరకు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ సుమారు 5 లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ సంఖ్య 5.10 లక్షల వరకు కూడా ఉంటున్నది. నగరంలో మెట్రో సేవలను ప్రారంభించినప్పటి నుంచి 40 కోట్లకుపైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారు.2017 నవంబర్‌లో మెట్రోరైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దశలవారీగా మెట్రో విస్తరణతో పాటే ప్రయాణికుల రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా ట్రిప్పులు కూడా పెంచారు. కానీ కోచ్‌ల కొరత వల్ల ఎన్ని ట్రిప్పులు తిరిగినా ప్రయాణికుల రద్దీ మా త్రం తగ్గటంలేదు. ప్రస్తుత ప్రయాణికుల్లో ప్రతి రోజూ 1.20 లక్షల మంది విద్యార్థులు, 1.40 లక్షలకుపైగా సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు ఉంటున్నట్లు అంచనా. నష్టాల నెపంతో... మెట్రో రైళ్ల నిర్వహణలో భారీగా నష్టాలొస్తున్నాయనే కారణంతో కొత్త కోచ్‌ల కొనుగోలుపై వెనుకడుగు వేసినట్లు సమాచారం. ఒక కోచ్‌ను కొనాలంటే సుమారు రూ.10 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ లెక్కన 59 రైళ్లకు అదనంగా 3 చొప్పున కొనుగోలు చేయాలంటే రూ.500 కోట్లకుపైగా ఖర్చవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోచ్‌ల కొనుగోలు అసాధ్యమని అంటున్నారు. మెట్రో నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని చెప్తూ మెట్రో నిర్వహణ సంస్థ ఎల్అండ్టీ కోచ్‌ల పెంపుపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వానికి సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.500 కోట్లు వెచి్చంచడం సాధ్యం కాకపోవచ్చునని అధికారులు అంటున్నారు. అద్దె ప్రాతిపదికన నాగపూర్ మెట్రో నుంచి అదనపు కోచ్‌లను తెప్పించే అవకాశం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
మెట్రో కు బ్రేక్.. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
-
మెట్రోలో వర్షం.. కంగుతిన్న ప్రయాణికులు
ముంబై: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం పలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.ప్రయాణీకులతో నిండిన ముంబై మెట్రోలోని ఒక కోచ్‌లో అకస్మాత్తుగా వర్షం పడింది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.కోచ్‌లో ఉన్న ఏసీ వెంట్ నుంచి అకస్మాత్తుగా నీరు బయటకు రావడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈ దృశ్యాన్ని అక్కడున్న పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించిన అనేక వైరల్ వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇప్పుడు ఇదే రేంజ్లో ముంబై మెట్రో వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన కొందరు.. ‘మెట్రోలో ప్రయాణించేందుకు వారు టికెట్ తీసుకున్నారని, అయితే ఇప్పుడు వారంతా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నట్లుందని కామెంట్ చేశారు. ఈ ఘటనపై కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరు మెట్రో పరిస్థితిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. మెట్రో యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు యూజర్లు కోరుతున్నారు. Life in a metro ❌Rain in a metro ✅#Mumbai #MumbaiRain pic.twitter.com/B2m90FsbuW— Miss Ordinaari (@shivangisahu05) September 24, 2024ఇది కూడా చదవండి: నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు