కృష్ణా పుష్కరాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
విజయవాడ: కృష్ణా పుష్కరాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల పనులపై శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పనులు పూర్తి చేయడానికి ఇంకా నెల రోజులే గడువుందని, ఈలోగా పూర్తిచేయకపోతే అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రోడ్డుకు ఒకవైపు బారికేడ్లు నిర్మించి, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని చెప్పారు. నాణ్యత దెబ్బతినకుండా రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు.