పుష్కరాల సమయంలో దేవుళ్ల విగ్రహాల కూల్చివేతా | ysrcp questions demolition of temples at the time of pushkaras | Sakshi
Sakshi News home page

పుష్కరాల సమయంలో దేవుళ్ల విగ్రహాల కూల్చివేతా

Published Mon, Jul 4 2016 3:31 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

పుష్కరాల సమయంలో దేవుళ్ల విగ్రహాల కూల్చివేతా - Sakshi

పుష్కరాల సమయంలో దేవుళ్ల విగ్రహాల కూల్చివేతా

అభివృద్ధి పేరుతో జరుగుతున్న దేవాలయాల విధ్వంసాన్ని ఖండిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి తెలిపారు. పుష్కరాల సమయం ఎప్పుడో చాలా ముందుగానే నిర్ణయం అవుతుందని, ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా.. అప్పటినుంచి పట్టించుకోకుండా ఇప్పటికిప్పుడు.. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుష్కరాలు వస్తున్న సమయంలో హిందూ ఆలయాలను ఇష్టారాజ్యంగా కూల్చివేయడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు.

రోడ్ల విస్తరణ కోసం ఇష్టారాజ్యంగా గుళ్లు, మసీదులు పగలగొట్టేస్తామంటుంటే.. అసలు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో అర్థం కావట్లేదని చెప్పారు. దేవాలయాలను ధ్వంసం చేసిన దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో ఏ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని తెలిపారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న కూల్చివేతలను వైఎస్ఆర్సీపీ ఖండిస్తోందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement