అనంతపురం సెంట్రల్ : ఈ నెల 12 నుంచి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు జిల్లా నుంచి ఏకంగా 2,200 మంది పోలీసులను బందోబస్తు నిమిత్తం తరలిస్తున్నారు. ఇప్పటికే కొందరు సిబ్బంది పుష్కర ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నారు. ఈ వారంలో తక్కిన వారు వెళ్లనున్నారు. వారిలో 10 మంది డీఎస్పీలు, 23 మంది సీఐలు, 100 మంది ఎస్‌ఐలు, మిగిలిన వారు హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర క్యాడర్లలోని సిబ్బంది ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పొరపాట్లకు ఆస్కారం లేకుండా బందోబస్తు కట్టుదిట్టం చేస్తున్నట్లు సమాచారం.
సీనియర్లలో ఆందోళన : కృష్ణా పుష్కరాలకు దాదాపు 15 రోజులు బందోబస్తు వేస్తుండడంతో కొంతమంది పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రెండేళ్లు పదవీకాలం పొడిగింపుతో పని చేస్తున్న తమకు మినహాయింపు ఇవ్వాలని సీనియర్ కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు కోరారు. ఎక్కువ శాతం మంది అనారోగ్యాలతో బాధపడుతున్నామని వాపోతున్నారు.
పుష్కరాలకు అనంత పోలీసులు
Published Sat, Aug 6 2016 12:40 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement