హన్మకొండ వడ్డేపల్లిలో పోశమ్మ బో నాల పండుగ సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న నగరంలోని ఏసీపీ గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సారయ్యపై సుబేదారి పోలీసులు కేసు నమో దు చేశారు.
మహిళా కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న గన్‌మెన్‌పై కేసు
Published Tue, Aug 30 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
వరంగల్ : హన్మకొండ వడ్డేపల్లిలో పోశమ్మ బో నాల పండుగ సందర్భంగా విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న నగరంలోని ఏసీపీ గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ సారయ్యపై సుబేదారి పోలీసులు కేసు నమో దు చేశారు. పోశమ్మబోనాల పండుగ సందర్భం గా సుబేదారి పోలీస్‌స్టేçÙన్‌కు చెందిన మహిళా పీసీలు శిరీష, ప్రమీలకు వడ్డేపల్లిలోని దేవాల యం వద్ద డ్యూటీ వేశారు. ఈ క్రమంలో మొ క్కులు చెల్లించుకునేందుకు కాజీపేట ఏసీపీ వద్ద పనిచేస్తున్న గన్‌మెన్ సారయ్య తన భార్య మం జులతో వచ్చారు. అయితే, సారయ్య భార్య నేరుగా దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిం చగా మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గొడవ జరగడం తో కానిస్టేబుల్ సారయ్య, అతని భార్య మంజు ల తనపై దాడి చేశారని మహిళా పీసీ శిరీష ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement