ప్రత్యేక అధికారులు విధులు విస్మరించద్దు | officers do perfect duty | Sakshi
Sakshi News home page

ప్రత్యేక అధికారులు విధులు విస్మరించద్దు

Jul 21 2016 11:15 PM | Updated on Sep 4 2017 5:41 AM

కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు చేపడుతామని ఆర్వీఎం పీవో రాజేశ్వర్‌ రాథోడ్‌ హెచ్చరించారు.

ఆదిలాబాద్‌ టౌన్‌ : కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు చేపడుతామని ఆర్వీఎం పీవో రాజేశ్వర్‌ రాథోడ్‌ హెచ్చరించారు. గురువారం ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. సీఆర్టీలు, ప్రత్యేక అధికారులు సమయపాలన పాటించాలన్నారు. వర్షాకాలంలో సీజినల్‌ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, వ్యాధులు సోకకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేజీబీవీల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలను ఎన్నుకోవాలన్నారు. సమావేశంలో జీసీడీవో పద్మ, అలేస్కో లస్మన్న, ఈఈ శ్రీనివాస్, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement