న్యూఢిల్లీ: ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జేఎన్‌యూలో మరో వివాదం చోటుచేసుకుంది. తరగతి గదిలో తాము అకడమిక్ కరికులమ్‌లో భాగంగా ఒక చిత్రాన్ని చూస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది సోదాలు నిర్వహించారని జేఎన్‌యూ ఎంఫిల్ విద్యార్థులు ఆరోపించారు. కొంతమంది విద్యార్థులు ఈ విషయాన్ని జేఎన్‌యూ విద్యార్థి సంఘం దృష్టికి తీసుకెళ్లి వర్సిటీ అధికార యంత్రాంగాన్ని నిలదీయాలని కోరారు. సెక్యూరిటీ ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడలేదని, ఇటీవల ఘటనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండేం దుకే సోదాలు చేశారని వర్సిటీ అధికారులు చెప్పారు.
‘రాజద్రోహం’ టైప్ చేస్తే జేఎన్‌యూ ప్రత్యక్షం: సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఓ సరికొత్త వివాదానికి కేంద్రమైంది. ‘గూగూల్ మ్యాప్స్’లో ‘యాంటీ-నేషనల్(జాతి వ్యతిరేకం), సెడిషన్(రాజద్రోహం), పెట్రియాటిజమ్(దేశభక్తి), భారత్ మాతా కీ జై’ అనే పదాల కోసం వెతుకుతుంటే ఢిల్లీలోని ‘జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ’ (జేఎన్‌యూ) ప్రత్యక్షమవుతోంది. దీనిపై వర్సిటీ విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని గూగుల్ ప్రతినిధి చెప్పారు.
జేఎన్‌యూలో మరో వివాదం
Published Sat, Mar 26 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM
Advertisement